సబ్ ఫీచర్

బంగళా వీడాలంటే బాధ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాసేవకులు, అధికార నివాసాల ప్రహసనానికి ఇది ఆరంభమూ కాదు, అంతమూ కాదు. పదవీకాలం ముగిసి ఏళ్లు గడిచినా ఇంకా ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయని నేతల గురించి తరచూ వార్తలు వింటూనే ఉన్నాం. ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నా నాయకుల వైఖరిలో మార్పు రావడం లేదు. సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టు1న ఒక తీర్పునిస్తూ, పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రులకు ప్రభుత్వ బంగళాల్లో ఉండే అధికారం లేదని, రెండునెలల్లోగా అలాంటి ‘మాజీ’లంతా అధికారిక నివాసాలను ఖాళీచేయాలని ఆదేశించింది. 1997లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రులకు కేటాయించిన బంగళాలను వారి జీవితకాలంలో ఖాళీచేయవలసిన అవసరం లేదంటూ ఓ జీవోను విడుదల చేసింది. ‘లోక్ ఫహారి’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ ఆదేశాన్ని సుప్రీంకోర్టులో 2004లో సవాలు చేసింది. ఆ కేసులో వాదప్రతివాదనలు విన్నాక సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం యుపి మాజీ ముఖ్యమంత్రులు ఎన్.డి.తివారి, కల్యాణ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, రామనరేష్ యాదవ్,మాయావతి, రాజనాథ్ సింగ్ అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంది. రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా, కల్యాణ్ సింగ్, రామనరేష్ యాదవ్‌లు ఇప్పుడు గవర్నర్లుగా పనిచేస్తున్నారు. ములాయం సింగ్ ఎంపీగా ఉన్నారు. చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి ఇప్పటికీ అధికారిక నివాసంలోనే తిష్టవేశారు.
జమ్మూ-కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నుంచి విడిగా ఉంటున్న ఆయన భార్య పాయల్ అబ్దుల్లాను ఢిల్లీలోని 7, అక్బర్ రోడ్డులోని బంగళా నుంచి కేంద్ర ప్రభుత్వం ఈమధ్యనే బలవంతంగా ఖాళీ చేయించింది. ఆ బంగళాకు బదులు మరోచోట ఉంటే తన భద్రతకు ముప్పు అని ఆమె వాదించినా ఫలితం లేకపోయింది. ఒమర్ అబ్దుల్లా వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. అప్పుడు ఆయనకు దిల్లీలో బంగాళా కేటాయించారు. ఆ బంగళాను ఖాళీ చేసేందుకు ఆయన భార్య ఏళ్లతరబడి ససేమిరా అన్నా, చివరకు వేరే చోటకు మారక తప్పలేదు.
ఉన్నత పదవులను అధిష్ఠించిన వారిలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను మినహాయిస్తే చాలామంది నేతలు అధికార నివాసాలను తమంతట తాముగా వదిలివేయడానికి సిద్ధపడిన దాఖలాలు లేవు. 1951లో అంబేడ్కర్ నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశాక, మరుసటి రోజునే పృథ్వీరాజ్ రోడ్డులోని ప్రభుత్వ భవనాన్ని ఖాళీచేసి 26, ఆలీపూర్‌లోని వేరొక ఇంటికి భార్యా సమేతంగా వెళ్లి పోయాడు. ఇలాంటి నిజాయితీ నేటి నేతల్లో కొరవడింది. ఇక, సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అమర్‌సింగ్‌కు దిల్లీలోని లోథి ఎస్టేట్‌లో బంగళాను ప్రభుత్వం కేటాయించింది. ఆ బంగళాకు ప్రభుత్వ ఖర్చులతో అన్ని హంగులతోను కళాత్మకంగా ఆయర తీర్చిదిద్దాడు. ఆ బంగళా అయిదు నక్షత్రాల బంగళాగా ఖ్యాతి పొందింది. రాజ్యసభ సభ్యత్వం ముగిసినప్పటికీ ఆయన ఆ బంగళాను ఖాళీచేయలేదు. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేక బాధపడుతూనే ఖాళీచేసాడు. ఆ బంగళాను చేజిక్కించుకొనడానికి పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు మల్లాగుల్లాలయ్యారు. బిహార్ ఎంపీ గిరిరాజ్ సింగ్‌ను ఆ బంగళా వరించింది. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు అజిత్‌సింగ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. అంతకుముందు ఎంపీగా ఉన్నపుడు ఆయనకు విలాసవంతమైన బంగళా కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోయాక ఆయనను బంగళా ఖాళీ చేయమన్నారు. ఒత్తిడి అధికం కావడంతో ఆ బంగళాను తన తండ్రి చరణ్‌సింగ్ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయకపోవడంతో అజిత్ సింగ్ నివాసానికి కరంటు, నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆయన వేరే చోటకు మకాం మార్చక తప్పలేదు. ఇక, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ జూలై 2002నుంచి ప్రభుత్వ బంగళాలోనే తిష్ట వేశాడు. పశువుల దాఖా కుంభకోణంలో అతనికి అయిదు సంవత్సరాల జైలు శిక్షపడింది. ఆ కారణంగా అతడు 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. 12ఏళ్లు అదే బంగళాలో ఉంటూ వేరే చోటకు వెళ్లేందుకు లాలూ నిరాకరించాడు. చివరికి 2014లో బంగళాను బలవంతంగా ఖాళీచేయించారు.
లోక్‌సభలో గానీ, రాజ్యసభలో గానీ సభ్యత్వం లేకున్నా గతంలో కేటాయించిన బంగళాలను వదులుకునేందుకు చాలామంది మాజీ ఎంపీలు, మంత్రులు సుముఖత చూపడం లేదు. యుపిఎ ప్రభుత్వంలో కొనసాగిన మంత్రులు అంబికాసోనీ, కుమారి షెల్జా కూడా బంగళాలు ఖాళీచేయడానికి ఎంతో హంగామాచేసారు. నిబంధనలను అతిక్రమించడం అపరాధం అని వీరికి తెలియదా? మరి బంగళాలను ఖాళీచేయడానికి వీరెందుకు బాధపడతారు?

-గుమ్మా ప్రసాదరావు