సబ్ ఫీచర్

తరగతి గది.. వేరులాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్క పైకి పెరుగుతున్న కొద్దీ దానిని స్థిరంగా ఉంచటానికై లోపలికి వేరు కూడా పెరగాలి కదా. అదే విధంగా తరగతి గది పెరిగినకొద్దీ దానిని స్థిరంగా ఉంచటానికై సాధించబడిన జ్ఞానాన్ని నిలకడగా ఉంచాలంటే సమాజంతో సమ్మతం కూడా పొందాలి. అందుకే ఉపాధ్యాయుడు, విద్యార్థి కలిసి ప్రతి రోజూ, ప్రతివారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం సాధించిన పరిజ్ఞానాన్ని స్థిరపరచుటకై దానిని ఎస్సెస్‌మెంట్ చేసుకుంటుంటారు. ఇలా ప్రతి రోజూ జరిగే ఎస్సెస్‌మెంటుకు ఒక లక్ష్యం ఉంటుంది. చదివినదంతా కూడా జ్ఞానం కాదు. దీనిలో ప్రధానమైంది ఏమిటో కనుక్కోవాలి. అంటే- చల్ల చేసేటప్పుడు కవ్వంతో చిలకరించి, చిలకరించి వెన్న తీస్తాం. అదే మాదిరిగా తరగతి గదిలో జరిగిన కార్యక్రమానికి ఎస్సెస్‌మెంట్ అనే కవ్వంతో ప్రధానమైన అంశాలను తీస్తాం. అది ఉపాధ్యాయుడే చేయవలసిన అవసరం లేదు. పిల్లలు కూడా చేయవచ్చును. అనగా వ్యక్తిగతమైన పరిజ్ఞానాన్ని సామాజికీకరణ చేస్తారు. అది అందరికీ అర్థం అవుతుందా? లేదా? అని కనుక్కుంటాం. అంటే బాటలో కంకర వేయగానే రోడ్డుకాదు. మొదట ఆ కంకరను మట్టి లేదా తారుపైన వేసి రోడ్డు రోలర్‌ను నడిపించాలి. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని అంటే జ్ఞానాన్ని సమత్వం చేసే కార్యక్రమాన్ని సమాజంలో ఏర్పడినటువంటి శక్తులు దీనికి వివిధ నామకరణాలు చేశాయి. కొందరు మూల్యాంకనం అన్నారు. కొందరు పరీక్ష అన్నారు. కొందరు పునశ్చరణ అన్నారు.
ఎవరు ఏమన్నా మొత్తంగా తరగతి గది తాను చేసిన పనిని చల్ల నుంచి వెన్న తీసినట్లు వస్తుంది. ప్రతివారు దీనిని తమ దృష్టికోణం నుంచి చూసి ఉపయోగించుకున్నారు. ఉపాధ్యాయుడు తాను అనుకున్న విషయాన్ని బోధన చేయటంలో ఏమైనా అంతరాలు వచ్చాయా? అపార్థాలు వచ్చాయా? కనుక్కునేందుకు ఈ ఎస్సెస్‌మెంట్ అనే పరికరాన్ని ఉపయోగించుకున్నారు. దీనివల్ల పిల్లలకు ఎంతమేరకు అవగాహన జరిగింది? అన్నది తెలుసుకున్నారు. దీనిపైన ఏర్పడ్డ అనుమానాలు, అపార్థాలను తొలగించుకోవటానికి ఈ ఎస్సెస్‌మెంట్ ఉపయోగపడింది. అదే తల్లిదండ్రులైతే నెలకొకసారో, సంవత్సరానికొకసారో తమ పిల్లలకు చదువు ఎంతవరకు వచ్చిందో కనుక్కోవటానికి వారి ప్రోగ్రెస్ కార్డును చూస్తారు. దానిలోవున్న మార్కులతో, గ్రేడ్‌లతో, ర్యాంకులతో తన పిల్లలకు ఎంతగా చదువువస్తుందో తెలుసుకుంటారు. నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అంకెలలోకి మార్చి, గ్రేడ్‌లలోకి మార్చి తరగతి గదిలో తమ పిల్లల స్థానం ఏమిటో ర్యాంక్ అనే అంకెతో తెలియచేయబడుతుంది. అదే పబ్లిక్ పరీక్ష అయితే ప్రతి విద్యార్థి గ్రేడ్‌లను పేర్లతో కొలమానం చేసి సమాజం యొక్క సమ్మతి సంపాదిస్తారు.
తమ బిడ్డకు నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు సంతోషిస్తారు. రవీంద్ర భారతికి తీసుకువచ్చి సాక్షాత్తూ ముఖ్యమంత్రి, విద్యామంత్రి ర్యాంకర్లయిన పిల్లలకు, తల్లిదండ్రులకు శాలువలు కప్పుతారు. ఈ విధంగా తరగతి గది చదువుకు మొత్తం సమాజం సమ్మతి లభిస్తుంది. ర్యాంకులు రాని పిల్లలు మరోసారి ఆ మెట్లెక్కటానికి ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా తరగతి గదిని స్థిరపరుస్తుంది. అందుకే పరీక్ష అనేది సమాజం అనే చెట్టుకు వేరులాంటిది. తరగతి గది నిర్వహించే పరీక్షలకు ఒక్కొక్కరు ఒక కోణంతో చూస్తారు. తరగతి గది.. పెంపకంలో, నర్సరీలో పరీక్షల చదువుకు వేరులాంటిది.

-చుక్కా రామయ్య