సంపాదకీయం

ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పో తుండడం భయాందోళనలకు గురిచేస్తోంది. కార్లు, వ్యా న్లు, బైకులు, లారీలు, బైకులు తదితర వాహనాలను మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురిఅవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అడుగడుగునా ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటుచేయాలి. నిరంతర పర్యవేక్షణ జరగాలి. పరిమితికి మించి వేగంగా వాహనాలను నడిపే వారిని కఠినంగా శిక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ఉత్తరాంధ్రలో వలసలు
వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలకు నిలయంగా రాష్ట్రాన్ని మారుస్తామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలతో హోరెత్తిస్తుండగా, మరొకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక పరిశ్రమలు మూతబడుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెరుగుతున్నందున పరిశ్రమలు మూతబడి వేలాది కార్మికులు వలసబాట పడుతున్నారు. ఒకప్పుడు పరిశ్రమలతో కళకళలాడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇపుడు ఉపాధి లేక ఇప్పుడు కళావిహీనమయ్యాయి. గత రెండేళ్లలో 10 జూట్ మిల్లులు, 8 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతబడగా, గరివిడి ఫెర్రో అల్లాయిస్ కంపెనీ, కొత్తవలస జిందాల్ కంపెనీ, ఆంధ్రా ఫెర్రో కంపెనీలు నేడో, రేపో అన్నట్లున్నాయి. పరిశ్రమలతోపాటు నిర్మాణ రంగం కూడా సంక్షోభంలో చిక్కుకోవడంతో వేలాది కార్మికులు వలసబాట పడుతున్నా , ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవడం బాధాకరం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
విజయవాడ పేరు మార్చొద్దు
కృష్ణా జిల్లా వాసులు కోరుకుంటే విజయవాడ పేరును ‘బెజవాడ’గా మార్చడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సరికాదు. నగరాలకు, పట్టణాలకు పేర్లను మార్చడం వల్ల ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. అయితే, కొద్దిమంది మాత్రం విజయవాడ పేరును బెజవాడగా మార్చాలని ముఖ్యమంత్రికి సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రిటిష్ వారి కాలంలో విజయవాడను బెజవాడ అనే వారు. కనకదుర్గమ్మ కొలువై, విజయాలకు మూలమైన విజయుడు (అర్జునుడు) తపస్సు చేశాడన్న పురాణ కథనం మేరకు ఈ నగరాన్ని విజయవాడగానే కొనసాగించాలి. ఒకప్పటి రాజమహేంద్రవరం ఆ తరువాత రాజమండ్రిగా, మళ్లీ ఇపుడు రాజమహేంద్రవరంగా మారింది. ఇక, రైల్వేశాఖ కూడా విజయవాడకు ‘బిజెడ్‌ఎ’ అనే కోడ్‌కు బదులు ‘విజెడ్‌ఎ’ అనే పదాన్ని వాడాలి. ప్రజలకు అలవాటైన పేర్లను మార్చి లేనిపోని గందరగోళం సృష్టించడం ఎందుకు?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
‘మెట్రో’తో కష్టాలు తీరవు
హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు సమసిపోతాయన్న వాదనలో నిజం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ రోడ్లను వెడల్పు చేయకుండానే మెట్రోరైల్ పనులను చేపట్టడం వల్ల రహదారులు మరింత ఇరుకైపోయాయి. ప్రస్తుతం భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. వాహనాల సంఖ్య నానాటికీ పెరగడంతో మెట్రోరైల్ వచ్చిన తరువాత కూడా ట్రాఫిక్ సమస్య కొనసాగక తప్పదు. మెట్రో పిల్లర్లకూ అటూ, ఇటూ రహదారులు మరింతగా వెడల్పు చేయాలి. ఆక్రమణలను పూర్తిగా తొలగించకుండా రోడ్లను వెడల్పు చేయడం అసాధ్యం. వాహనాల సంఖ్యను చూస్తుంటే ట్రాఫిక్ సమస్యకు మెట్రోరైల్ ఒక్కటే పరిష్కారం అని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు.
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్
శిథిలావస్థలో హైస్కూలు
మహబూబ్‌నగర్ జిల్లా ఉరవకొండలోని ప్రఖ్యాత అరబిక్ హైస్కూల్ నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఒకప్పుడు ఈ హైస్కూల్‌లో చదివేందుకు సమీప గ్రామాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వచ్చేవారు. ఉన్నత విద్యా ప్రమాణాలను అందించిన ఈ పాఠశాల ఇపుడు గత వైభవాన్ని కోల్పోతోంది. గదులన్నీ పూర్తిగా దెబ్బతిని హైస్కూలు శిథిలమైపోతున్నా నేతలుగానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. పిచ్చిమొక్కలు పెరగడంతో హైస్కూల్ ఆటస్థలం అందుబాటులో లేకుండా పోయింది. భవనం శిథిలం కావడంతో విద్యార్థులకు భద్రత లేకుండా పోయింది. పాడైన గదులను తొలగించి ఇక్కడ కొత్త భవనాన్ని నిర్మించాలి. ఆటస్థలాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
మొక్కల సంరక్షణ ఎక్కడ?
హరితహారం పేరిట తెలంగాణలోను, మనం-వనం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోను ఇటీవల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా చేపడుతున్నారు. ఒకే రోజు పాతిక లక్షలు, ఏభై లక్షలు, కోటి మొక్కలు నాటాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటడం మంచిదే. అయితే, నాటిన మొక్కలను పరిరక్షించేందుకు మాత్రం అంతగా చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని చోట్ల ట్రీగార్డులు లేకుండానే మొక్కలను నాటేసి వెళ్లిపోతున్నారు. పశువుల నుంచి వీటికి రక్షణ లేకుండా పోతోంది. మొక్కలను పరిరక్షించే పనిని అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు, విద్యార్థులకు అప్పగించాలి.
-వౌనిక, విజయనగరం