సంపాదకీయం

మళ్లీ తగ్గిన వడ్డీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వ్ బ్యాంక్ వారు వాణిజ్య బ్యాంకులకిచ్చే రుణాలపై మళ్లీ వడ్డీలు తగ్గాయి. వడ్డీశాతం తగ్గడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయన్నది దశాబ్దుల తరబడి జరుగుతున్న ప్రచారం! అయితే వడ్డీలు తగ్గడం వల్ల ‘ద్రవ్యోల్బణం’ పెరుగుతుందన్నది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట! ద్రవ్యోల్బణం పెరగని రీతిలో వడ్డీ శాతాన్ని తగ్గించడానికి వీలుందా? అన్న మీమాంస జరిగిపోతునే ఉంది! అంటే ద్రవ్యోల్బణం పెరగని రీతిలో పెట్టుబడులను కూడా పెంచడం సాధ్యమేనా? అన్నది సరైన సమాధానాలు లభించని మీమాంస! అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానమన్నది ప్రవర్ధమాన దేశాల జనజీవనాన్ని నిరంతరం అస్తవ్యస్తం చేస్తున్న విచిత్రమైన మాయాజాలం. ఈ ‘అంతర్జాతీయ అనుసంధానం’ వాణిజ్య ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- వ్యవస్థలోని ప్రధానమైన వైపరీత్యం. అంతర్జాతీయ అనుసంధానానికి గురి అయి ఉన్న దేశాలలో ‘వస్తువుల పంపిణీ’, ‘్ధరల పెరుగుదల, తరుగుదల’- వంటి ప్రధాన వాణిజ్య పరిణామాలు ఆయా సార్వభౌమ ప్రభుత్వాల నియంత్రణలో లేవు, ప్రభుత్వ నియంత్రణ పరిధి నుంచి అవి తప్పిపోయాయి. అందువల్లనే ఆహారం ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం వంటి వౌలిక జీవన నిర్దేశకాలను ప్రభుత్వాలు కాక బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నియంత్రిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా ఉప్పు, కందిపప్పుల ధరలు పెరగడం అందువల్లనే! రవాణా జరగడానికి, పొలం నుంచి వినియోగదారుని వంట ఇంటి వరకూ ఆహార ఉత్పత్తులు సరఫరా కావడానికి పెట్రోలియం ఇంధనం అవసరం. అందువల్ల రిజర్వ్ బ్యాంకు వారు వాణిజ్య బ్యాంకులకిచ్చే నిధులపై వడ్డీ తగ్గడం వల్లకాక బహుళజాతి వాణిజ్య సంస్థలు నిర్థారిస్తున్న పెట్రోలియం ఇంధనం ధరల వల్ల మాత్రమే ఆహారం ధరలు, ఆహోర ద్రవ్యోల్బణం ప్రభావితం అవుతున్నాయని అనేకమంది ఆర్థికవేత్తలు చెప్పుకొస్తున్నారు. విభేదించే వారు లేకపోలేదు! ఈ ‘వాద ప్రతివాదాల సారాంశం’ వడ్డీలు తగ్గినందువల్ల బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోగలిగిన పెట్టుబడిదారులకు, పారిశ్రామిక ఉత్పత్తిదారులకే అర్థం కావడం లేదు! సామాన్య వినియోగదారులకు ఏమర్థమవుతుంది?? అర్థం కాని వినియోగదారులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు?? దుకాణం దారుడు చెప్పిన ధరలను చెల్లించి కొనుక్కొని పోతున్నారు.. ద్రవ్యోల్బణ నియంత్రణ కంటే పెట్టుబడుల పరిమాణం పెరగడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసమే రిజర్వ్‌బ్యాంక్ వారు ఇప్పుడు వడ్డీని తగ్గించారు!
రిజర్వ్‌బ్యాంక్ వారు వాణిజ్య బ్యాంకులకు సమకూర్చుతున్న నిధులపై వడ్డీలు తగ్గడం వల్ల వాణిజ్య బ్యాంకుల వారు ఖాతాదారులకు సమకూర్చే రుణాలపై కూడా వడ్డీలు తగ్గుతాయి. అందువల్ల పారిశ్రామిక వాణిజ్య వేత్తలు అతి ఉత్సాహంగా అప్పులు తీసుకుని పెట్టుబడులను పెట్టి ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తులను పెంచుతారు. ఇలా ఉత్పత్తులు పెరగడం వల్ల ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరిగిపోయి ఆర్థిక సౌష్టవం విస్తరిస్తుందట! సమాంతరంగా బ్యాంకులలో డబ్బు దాచేవారికి తమ ‘సమర్పణ’- డిపాజిట్-లపై లభించే వడ్డీ శాతం కూడా తగ్గడం సహజం! అందువల్ల డబ్బును బ్యాంకులలో డిపాజిట్ చేసేవారు నిరుత్సాహపడి తమ డబ్బును బ్యాంకులలో దాచరు. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టడమో లేదా పెట్టుబడులను పెట్టేవారికి అప్పుగా ఇవ్వడమో జరుగుతుంది. అందువల్ల కూడా పెట్టుబడులు పెరిగి ఉత్పత్తులు పెరిగి స్థూల జాతీయ ఉత్పత్తి- జిడిపి- పెరుగుదల వేగం పుంజుకొంటుందట! మన దేశం ఈ ఏడాది కనీసం ఎనిమిది శాతం జిడిపి వృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందువల్లనే రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న సమయంలోను, ఊర్జిత్ పటేల్ ఇటీవల గవర్నర్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత కూడా రిజర్వ్‌బ్యాంక్ వారు పదే పదే వడ్డీని తగ్గించారు. 2015 జనవరిలో ఏడుమ్ముప్పాతిక శాతం ఉండిన రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ శాతం, మంగళవారం నాటి తగ్గింపుతో ఆరుంపాతిక శాతానికి దిగి వచ్చేసింది! ఇలా మాటిమాటికీ వడ్డీ శాతం తగ్గించి ‘జిడిపి’ని పెంచాలన్న విధానాన్ని 2014 వరకూ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరిపింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అమలు జరుపుతోంది! ప్రభుత్వం మారినప్పటికీ విధానాలు మారవన్నది ‘ప్రపంచీకరణ’ యుగంలో మరింతగా వ్యవస్థీకృతమైపోయిన నీతి..
అందువల్లనే రిజర్వ్‌బ్యాంక్ వారు వడ్డీని తగ్గించబోమని మొరాయించినప్పటికీ ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం వారి అభీష్టాన్ని అమలుజరుపుతున్నారు. 2015 జనవరి నుంచి రిజర్వ్‌బ్యాంక్ వారు ఆరుసార్లు వడ్డీ శాతం తగ్గించడం ఇందుకు తార్కాణం. కానీ, ఇలా వడ్డీ శాతం తగ్గిపోవడం అత్యధిక సంఖ్యలోని బ్యాంకు ఖాతాదారులు హర్షించడం లేదు. ఎందుకంటే చిన్న మొత్తాలను ‘కాలపరిమితి’కి లోబడిన ‘సమర్పణ’లు- డిపాజిట్-ల రూపంలో బ్యాంకులలో దాచుకునే వారికి తమ డిపాజిట్‌లపై లభిస్తున్న వడ్డీ శాతం తగ్గిపోతుంది. రిజర్వ్‌బ్యాంక్ సమకూర్చే నిధులపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ- రిపో రేట్- తగ్గినపుడల్లా వాణిజ్య బ్యాంకులు రిజర్వ్‌బ్యాంక్ వద్ద జమ చేసే నిధులపై ఆ వాణిజ్య బ్యాంకులకు లభించే వడ్డీ- రివర్స్ రిపో రేట్- కూడా తగ్గిపోతుంది. ఫలితంగా బ్యాంకులిచ్చే రుణాలపై ఖాతాదారులు చెల్లించే వడ్డీతో పాటు సమాంతరంగా చిన్నమొత్తాలను, పెద్దమొత్తాలను బ్యాంకులో దాచేవారికి లభించే వడ్డీ కూడా తగ్గిపోతుంది! ఇదీ వైపరీత్యం! తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తున్నాయని మురిసిపోయే పెట్టుబడిదారుల, గృహనిర్మాతల సంఖ్య కంటే తమ డిపాజిట్లపై తమకు బ్యాంకులిస్తున్న వడ్డీ తగ్గిపోయినందుకు మనసునొచ్చుకొనే సామాన్య ఖాతాదారుల సంఖ్య చాలా ఎక్కువ..
ఇలాంటి సామాన్య ఖాతాదారుల మనోభావాల కంటే, పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని పెంచే ఖాతాదారుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం మర్యాద మన్నన లభిస్తుండడం ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ ప్రధాన లక్షణం! ఈ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- వ్యవస్థీకృతం కావడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వ్యూహం.. వడ్డీ రేట్లు తగ్గినందువల్ల సమాజంలో చెలామణి అయ్యే డబ్బు పరిమాణం పెరిగి, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరగడం ప్రధాన సమస్య కాదన్నది ‘మార్కెట్ ఎకానమీ’ నిర్వాహకుల వాదం! నాలుగు శాతం స్థాయికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది 2018 నాటికి ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ సాధించదగిన లక్ష్యమని ఇంతకాలం ప్రచారమైంది! కానీ, ఈ లక్ష్యాన్ని 2021 నాటికి మాత్రమే సాధించగలమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఇప్పుడు వివరిస్తున్నారు. పెట్టుబడులకు ప్రాధాన్యం.. అధికధరల అదుపునకు ప్రాధాన్యం కాదు!!