మెయన్ ఫీచర్

‘భద్రత’లో విపక్షాలకు బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకరంగా మారిన పాకిస్తాన్ ప్రేరిత జీహాదీ తీవ్రవాదులను నిరోధించడం, హతమార్చడంలో భా రత సైన్యం చూపిన అసామాన్య ధైర్యసాహసాలను కించపరిచే విధంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రవర్తించడం అత్యంత దు రదృష్టకరం. కాశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రాయోజిత జీహాదీ తీవ్రవాదులు దొంగదాడి జరిపి 19 మంది జవాన్లను హతమార్చిన ఘటనను యావత్తు ప్రపంచం నిర్ద్వంద్వంగా ఖండించింది. అగ్రరాజ్యాలు సహా పలు దేశాలు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను మందలించడంతోపాటు తగు చర్యలు చేపడతామని హెచ్చరించాయి. పాక్‌ను తీవ్రవాద దేశంగా గుర్తించాలంటూ అమెరికా పార్లమెంట్‌లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు.
యూరీ ఘటనపై దేశ ప్రజల్లో ఆగ్రహవేశాలు పెల్లుబుకాయి. ఇంకా ఎంతకాలం పాటు పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదానికి మనం బలికావాలంటూ ప్రశ్నించారు. యూరీ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలంటూ నినదించారు.
దేశప్రజల ఆకాంక్షల మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులను సమర్థవంతంగా నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్ ఈమేరకు అధికారిక ప్రకటన చేస్తూ, సెప్టెంబర్ 28 అర్ధరాత్రి (తెల్లవారితే సెప్టెంబర్ 29) మెరుపుదాడులను నిర్వహించి తీవ్రవాదుల స్థావరాలను కొన్నింటిని ధ్వంసం చేశామని ప్రకటించారు. ఆత్మరక్షణలో భాగంగా, తీవ్రవాదుల దాడులను నిరోధించే చర్యల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించామని చెప్పారు. దాదాపు 100 మంది కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి జరిపిన ఈ మెరుపుదాడులను ప్రపంచ వ్యాప్తంగా శ్లాఘించారు. మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు మాత్రం తమ సంకుచిత స్వభావాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తూ సైన్యం నిర్వహించిన ఈ వీరోచిత దాడిని ఒక ‘కల్పితం’గా కొట్టిపారేశారు. శత్రువు చేతిలో పావుగామారి మన జాతిని, దేశ సార్వభౌమత్వాన్ని , సైనిక పాటవాన్ని, వారి ధైర్యసాహసాలను కించపరిచారు.
ఆక్రమిత కాశ్మీర్‌లోని జీహాదీ స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి దేశం యావత్తు ఆరాధ్యభావనను ప్రకటించింది. మెరుపుదాడులను నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అభినందించింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న రెండవ సాహసోపేతమైన నిర్ణయమిది. ఈశాన్య రాష్టమ్రైన మణిపూర్‌లో నాగా తీవ్రవాదులు జరిపిన ఊచకోతకు ప్రతీకారంగా భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించాలని గతంలో మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. భారత సైన్యానికి చెందిన 70 మంది కమాండోలు మయన్మార్‌లోకి ప్రవేశించి, నాగా తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి కేవలం 40 నిమిషాల్లో 38 మందిని హతమార్చి తిరిగివచ్చారు.
అనేక దశాబ్దాలుగా తీవ్రవాదం పట్ల చేష్టలుడిగిన దేశంగా భారత్‌ను పరిగణిస్తూ వచ్చినవారు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అన్ని రకాల చర్యలు చేపడదామన్న మోదీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాలేదని, తమ ప్రతిన నెరవేర్చేందుకు సంపూర్ణంగా సన్నద్ధమైందని ప్రపంచ దేశాలు గుర్తించాయి. మయన్మార్ సంఘటన జరిగిన కొద్ది నెలల్లోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై దాడులు చేయాలన్నది రెండవ ప్రధాన నిర్ణయం.
తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు మోదీ ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత, భారత సైన్యం శక్తిసామర్థ్యాల కలయికతో కేంద్ర ప్రభుత్వానికి అపారమైన ఆదరణ లభించింది. ప్రభుత్వం పట్ల రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ప్రతిపక్ష నాయకులకు కంటగింపుగా మారింది. ఈ ప్రజాదరణ రానున్న రోజులలో బిజెపికి, నరేంద్ర మోదీకి ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు సాధించి పెడుతుందోనన్న దుగ్ధ వీరికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. స్వార్థ రాజకీయ తత్వం అణువణువునా ఎక్కించుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రముఖ నాయకులు పి.చిదంబరం, సంజయ్ నిరుపమ్‌లతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ తదితరులు ‘మెరుపుదాడులు’ బూటకమని, కేంద్ర ప్రభుత్వంతోపాటు సైనిక అధికారులు అబద్ధాలు చెబుతున్నారని చిత్రీకరించే దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీని ‘ఖూన్ కా దలాలీ’ (సైనిక రక్తంపై ఆధారపడ్డ దళారీ) అని ఆరోపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడి జరగలేదన్న పాకిస్తాన్ ప్రభుత్వ, సైనిక అధికారుల ప్రకటనలకు కొనసాగింపుగా కేజ్రీవాల్ కూడా దాడులు జరగనేలేదని ప్రకటించారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి శత్రుదేశ ప్రతినిధిగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరం. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మన సైనిక రహస్యాలను బట్టబయలు చేయాలని, మెరుపుదాడులు జరినట్లు రుజువులు చూపించాలని కాంగ్రెస్ నాయకులు చిదంబరం, సంజయ్ నిరుపమ్‌లు కోరడం మన దేశాన్ని అప్పనంగా శత్రుదేశానికి అప్పగించడమే అవుతుంది.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవులు నిర్వహించిన కాంగ్రెస్, సిపిఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు జిహాదీ తీవ్రవాదులకు, శత్రుదేశానికి అనుగుణంగా ప్రకటనలు చేయడం దేశ ప్రయోజనాలను తాకట్టుకపెట్టడం ఏపాటి విజ్ఞతో అర్థం కాక ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.
గతంలో అమెరికా కూడా జిహాదీ తీవ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. వాటి వీడియోలు కానీ, ప్రమాణ పత్రాలు కానీ బయటపెట్టలేదు. అమెరికా కమాండోలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి అంతర్జాతీయ తీవ్రవాద నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చారు. వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఒక ప్రకటన చేస్తూ, గతంలో యుపిఎ ప్రభుత్వం కూడా 18 సెప్టెంబర్ 2011, 28 జూలై 2013, 14 జనవరి 2014లలో మెరుపుదాడులు నిర్వహించిందని చెప్పారు. వాటి వివరాలేవీ ప్రజలకు తెలియచెప్పలేదు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా, సైనిక రహస్యాలను బట్టబయలు చేసేలా- మోదీ ప్రభుత్వం నిర్వహించిన మెరుపుదాడుల ప్రమాణాలను, వీడియోలను బయటపెట్టాలని కోరడం దేశద్రోహం కాక మరేమిటి? ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు.
యూరోపియన్ యూనియన్ ఉపాధ్యక్షుడు రిచర్డ్ చార్‌నిక్ ఒక వ్యాసంలో- ‘సరిహద్దులకు అవతలి వైపు నుంచి ఎగుమతి అవుతున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయని, వివిధ దేశాలు భారత్‌ను సమర్థించాయ’ని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తోపాటు అమెరికా, రష్యా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలు భారత్ జరిపిన మెరుపుదాడులను సమర్థించాయి. తీవ్రవాద సమర్థక చర్యలను మానుకోవాలని లేదా మరిన్ని దాడులకు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్‌ను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ సహా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు మన సైనికుల మనోబలాన్ని కించపర్చడంతోపాటు శత్రు దేశాల వాదనలకు బలం కలిగించేలా ఉంటున్నాయి. పాకిస్తాన్ నాయకులు, సైనికాధికారుల ప్రకటనలకు- రాహుల్, ఆయన అనుచర బృందం ప్రకటనల మధ్య తేడా లేకుండా పోయింది.
భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన మెరుపుదాడులను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రచార సాధనంగా వాడుకుంటున్నదన్న ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు సత్యదూరం. మెరుపుదాడులపై భారత ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ కేవలం తీవ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని, పాకిస్తాన్‌పై ఎటువంటి దాడులు చేయలేదని చెప్పారు. మెరుపుదాడులపై ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి ప్రకటన చేయలేదు. తనకు అత్యంత ఇష్టమైన సోషల్ మీడియాలో కూడా దీనిపై ఆయన స్పందించలేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సంఘటనపై మూడుసార్లు ‘ట్వీట్’ చేశారు. ఈ మూడు కూడా దాడులు జరిగిన రోజున మాత్రమే. ఇందులో రెండు ట్వీట్‌లు సైనిక పాటవాన్ని మెచ్చుకున్నవే తప్ప మరే వివరాలు లేవు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెండుసార్లు ట్వీట్ చేశారు. ఇవి కూడా సైనికులను అభినందిస్తున్నవే. వీటన్నింటి సారాంశం ఒక్కటే. జీహాదీ తీవ్రవాదులు చేస్తున్న దాడుల నుంచి ఆత్మరక్షణలో భాగంగానే మెరుపుదాడులు నిర్వహించామని.
ఈ మెరుపుదాడులను కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకత్వం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నట్లు కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి పసలేకపోగా, ఆయా ప్రతిపక్ష నాయకుల కడుపు మంట కనిపిస్తున్నది. రాహుల్ సహా మిగతా కాంగ్రెస్ నాయకులు కోరుతున్నట్లుగా సాక్ష్యాధారాలు, ప్రమాణాలు చూపించడం దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తాయి. ఈ సంగతి తెలిసి కూడా ఇటువంటి డిమాండ్లు చేయడం కాంగ్రెస్ నాయకుల దేశ వ్యతిరేక భావాలకు అద్దం పడుతున్నది. మెరుపుదాడులు జరిగాయని డిజిఎంవో అధికార ప్రకటన చేసిన తర్వాత కూడా వీటికి సాక్ష్యాధారాలు అడగడం మన సైనిక నైతికతను, పాటవాన్ని శంకించడమే. మెరుపుదాడులు జరిగినట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పోలీసులు ఇంటర్వ్యూలు ఇచ్చిన తరువాత కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం కాంగ్రెస్ నాయకుల, కేజ్రీవాల్‌ల సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తున్నది.
ఈ ఘటనపై సాక్ష్యాధారాలు ఇవ్వడం వల్ల మన సైనికులు ఏయే ప్రాంతాల నుంచి సరిహద్దులు దాటారో, తిరిగి వచ్చారో, ఏయే ఆయుధాలు వాడారో తదితర కీలకమైన ఆధారాలను శత్రుసైన్యాలకు అప్పగించినట్లవుతుంది. త ద్వారా మన దాడుల పద్ధతిని మనమే శత్రువులకు తెలియజెప్పినట్లవుతుంది. ఫలితంగా శత్రుసైన్యాలు అప్రమత్తమై మన దాడులను తిప్పికొట్టే ప్రమాదాన్ని మనమే కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం.
ఇటువంటి సాక్ష్యాధారాల కారణంగా శత్రువులు మనపై తిరుగుబాటు చేయడానికి ఆస్కారం ఇవ్వడమే కాకుండా ఇరు దేశాలమధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదముంటుంది. రాజకీయ ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలు కాపాడడమే మనందరి ప్రథమ కర్తవ్యం. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు, కేజ్రీవాల్ తదితరులు ఈ అంశాన్ని విస్మరించడం దేశానికి శాపం.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం, సెల్: 09899 331113