సబ్ ఫీచర్

ఆరంభశూరత్వం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హడావుడిగా పథకాలను ప్రకటించడం తప్ప, వాటి అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంలో మన పాలకులు ఎంతో ప్రసిద్ధి చెందారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన క్రీడారంగాన్ని చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలకు మన దేశం నుంచి జుంబో జుట్టును పంపించడం, మన క్రీడాకారులు పతకాలు సాధించడంలో విఫలం కావడం, వెంటనే ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించేలా సూచనలు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, తరువాత సదరు కమిటీ సిఫారసులను బుట్టదాఖలు చేయడం పరిపాటైపోయింది. మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటమి చెందితే ఫలితాలు వెలువడగానే మేధోమథనం చేస్తాయి. ఓటమికి కారణాలను విశే్లషిస్తూ నివేదికను రూపొందించి, తమది చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొని, ఆపై ఆ నివేదిక గురించి మరచిపోతారు. మన పాలకులు క్రీడల విషయంలోనూ ఇదే పద్ధతిని ఆచరిస్తున్నారు. క్రీడలలో వైఫల్యాలపై కమిటీ వేయడం, నిపుణుల సిఫార్సులను గాలికి వదలివేయడం ఆనవాయితీగా మారింది.
ఇటీవలి రియో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల వైఫల్యంపై నిగ్గు తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అదే సమయంలో నీతి ఆయోగ్ కూడా దేశంలో క్రీడల అభివృద్ధికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మనవాళ్లు విశేష ప్రతిభ చూపే క్రీడలపై ప్రత్యేక దృష్టి కేటాయించాలని, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నీతి ఆయోగ్ పేర్కొంది. పలు దేశాలు ఈ విధానాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. ‘టార్గెట్- 2024 ఒలింపిక్స్’ పేరిట నీతి ఆయోగ్ ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను తయారుచేసింది. 2024 ఒలింపిక్స్‌లో కనీసం 50 పతకాలు సాధించాలన్నది లక్ష్యం. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశారు.
ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరిగా నియమించాలి. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. కోచ్‌లకు మంచి వేతనాలు ఇవ్వడంతో పాటు, క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రస్తుతం మనదేశంలో క్రీడారంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిధుల లేమి. ఇప్పటివరకు పాలకపక్షాలు క్రీడల పట్ల శీతకన్ను వేశాయి. మన దేశంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. అయితే వారికి లక్ష్మీకటాక్షం మాత్రం లేదు. అందువల్లనే వారు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రాణించలేకపోతున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అయినా నీతి ఆయోగ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుకు అవసరమైనన్ని నిధులు విడుదల చేసి క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.

-పి. భార్గవరామ్