ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అనుమానించటం అంటే అవమానించటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరీ సైనిక శిబిరంపై దాడికి ప్రతిగా భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు జరిపాయా? లేదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేయటం అంటే సైన్యంతోపాటు దేశాన్ని అవమానించినట్లే. భారత సైన్యం సర్జికల్ దాడులు జరపనేలేదంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు సాక్ష్యాలు బైట పెట్టాలని డిమాండ్ చేస్తున్న వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలి. ఎందుకంటే పాకిస్తాన్ పాలకులు, సైన్యం రెండూ కూడా మోసం, దగా, కుళ్లు,కుతంత్రాలకు ప్రతీకలు. వారు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్ట గట్టిగా గుణ పాఠం నేర్పించేందుకు సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఇతర సాక్ష్యాలను వెల్లడించాలని డిమాండ్ చేయటం దేశ ద్రోహంతో సమానం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై మెరుపు దాడులు చేయటం ద్వారా పాకిస్తాన్ విషయంలో కొత్త వ్యూహానికి తెర లేపింది. పాకిస్తాన్ పాలకులు ముఖ్యంగా సైన్యం ఇస్లామిక్ ఉగ్రవాదుల చేత దాడులు చేయించటం ద్వారా మనపై సైకలాజికల్‌గా విపరీతమైన భారాన్ని పెంచారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు చేయటం, కేంద్ర ప్రభుత్వం దీనిని ఖండించటం, దాడులకు సంబంధించిన సాక్ష్యాలను పాకిస్తాన్‌కు పంపించటం, వారు దానిని పరిశీలించిన అనంతరం తమకీ దాడులతో ఎలాంటి సంబంధం లేదని, తమ దేశానికి చెందినవారెవ్వరు ఈ దాడులు చేయలేదని, భారత ప్రభుత్వమే ఈ దాడులు సృష్టించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ పాకిస్తాన్ బుకాయంచడం ఒక అలవాటుగా మారింది. మన దేశంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన ప్రతి దాడికి ఇలాంటి ముగింపే జరిగింది. చివరకు పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై జైషె మహమ్మద్ చేసిన దాడి వ్యవహారం కూడా ఇలాగే ముగిసింది. పఠాన్‌కోట్ దాడి భారత దేశం సృష్టి అంటూ పాకిస్తాన్ కొట్టి వేసింది.
కంటి తుడుపు కోసం ఒక దర్యాప్తు బృందాన్ని పఠాన్‌కోట్‌కు పంపించి పాకిస్తాన్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఉరీ సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడి కూడా భారత దేశం సృష్టి అని అంటూ పాకిస్తాన్ ప్రత్యారోపణలకు దిగింది. ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడులు చేయించటం ద్వారా పాకిస్తాన్ మన దేశంతో ఆడుకుంటోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా సైన్యం కొనసాగిస్తున్న ఈ దురాగతాలకు ఏదోఒక చోట ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై మెరుపుదాడులు చేయటం ద్వారా పాకిస్తాన్ ఆడుతున్న అత్యంత ప్రమాదకర నాటానికి తెర దింపే ప్రక్రియకు నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. దాడికి ప్రతి దాడి చేస్తే తప్ప పాకిస్తాన్ దారికి రాదు. మనం ఓపిక పట్టినంత కాలం పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదులు మనతో ఆడుకుంటారనే నిజం సర్జికల్ దాడులను అనుమానిస్తున్న కాంగ్రెస్, ఆం ఆద్మీ పార్టీల నాయకులకు తెలియదా? సర్జికల్ దాడులకు సంబంధించిన సాక్ష్యాలను బైట పెట్టాలని డిమాండ్ చేయటం అంటే పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినట్లే. పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చేవారంతా దేశ ద్రోహులే అవుతారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు చేయటం ద్వారా పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం నేర్పించటంతోపాటు మాటిమాటికి అణు బాంబును ప్రయోగిస్తామంటూ పాక్ సైన్యం చేసే బెదిరింపులు ఉత్తిత్తివే అనేది రుజువు చేశారు. సర్జికల్ దాడులు జరిగాయనేది ఒప్పుకుంటే పాకిస్తాన్ పరువు, ప్రతిష్ట మంటగలుస్తుంది. ఆ దాడులకు జవాబు చెప్పవలసి ఉంటుంది. పాకిస్తాన్ ప్రతి దాడులు చేస్తే భారత సైన్యం మరింత గట్టిగా బుద్ధి చెబుతుంది, ఈ దాడులు ప్రతి దాడుల పరంపర చివరకు పాకిస్తాన్‌ను సర్వనాశనం చేస్తుంది. ఈ వాస్తవం పాక్ సైన్యానికి బాగా తెలుసుకాబట్టే సర్జికల్ దాడులు జరగలేదనే తప్పుడు ప్రచారం ప్రారంభించింది. తన ప్రచారానికి బలం చేకూర్చేందుకు దాదాపు యాభై మంది విదేశీ పత్రికలు, వార్తా సంస్థల విలేకరులకు ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను చూపించి సర్జికల్ దాడులు జరిగితే ఈ ప్రాంతం ఇలా ఉంటుందా? అంటూ అమాయకత్వం ప్రదర్శించింది.
అయితే ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారితోపాటు పలువురు స్థానికులు మెరుపుదాడులు జరిగాయని అంగీకరించారు. మెరుపుదాడుల్లో మరణించిన ఉగ్రవాదులు, సైనికులను పాక్ సైన్యం ఇతర ప్రాంతాలకు తరలించాయని వారు వెల్లడించారు. మృతులను తరలించి మెరుపుదాడులు జరిగిన ప్రాంతాన్ని సరిదిద్దిన అనంతరం విదేశీ విలేకరులను అక్కడికి తీసుకువెళ్లారనేది కూడా రుజువైంది. ఇదంతా పత్రికల్లో వచ్చినా ఆం ఆద్మీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం మెరుపుదాడుల సాక్ష్యాలను బైట పెట్టాలంటూ రాజకీయం చేస్తూ దేశ భద్రతతో ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటిమాదిరిగానే తన మూర్ఖత్వాన్ని బైట పెట్టుకుంటూ నరేంద్ర మోదీ సైనికుల రక్తంతో బ్రోకరేజ్ చేస్తున్నారంటూ మైనారిటీ రాజకీయం చేశారు. సైనిక దళాల మెరుపుదాడితో పెరిగిన బి.జె.పి ప్రతిష్ట వచ్చే సంవత్సరం జరిగే ఉత్తర ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బ తీస్తుందనే భయంతోనే ఆం ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు పాకిస్తాన్ పాట పాడుతున్నాయి. అధికారం కోసం సైన్యాన్ని రాజకీయాలలోకి లాగటం ఏ పార్టీకి మంచిది కాదు. సైన్యం ఏదైనా తప్పు చేస్తే నిలదీయవచ్చు కానీ వారి దేశ భక్తిని ప్రశ్నించటం సమర్థనీయం కాదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పాట పాడటం దేశ ద్రోహమే అవుతుంది.