సబ్ ఫీచర్

కోఆపరేటివ్ లెర్నింగ్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కో ఆపరేటివ్ లెర్నింగ్ అన్నది ఉపాధ్యాయునికి కత్తిమీద సాములాంటిది. దాని విశిష్టత తెలియనివారికి విశ్రాంతి సమయం. విద్యార్థులను నాలుగు గ్రూపులుగా కూర్చుండబెట్టి ఒక ప్రాజెక్టు చేయండి అనడం, ఆ ప్రాజెక్టుపై తీర్పు చెప్పడం లేక డాక్యుమెంటేషన్ చేయండని చెప్పడం ఉపాధ్యాయుడి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. కానీ కొంతమంది ఉపాధ్యాయులు దాన్నొక దీక్షగా తీసుకుంటారు. టాపిక్ నిర్ణయమే మొదటి నాందీవాచకం. టాపిక్‌ను నిర్ణయం చేసేటప్పుడు అతని అధ్యయనం, సామాజిక దృష్టి దార్శనికత వీటన్నింటికీ అద్దంపడుతుంది. ఉపాధ్యాయుడు లేక మెంటార్...తను అనుకున్న టాపిక్‌ను పిల్లలపై రుద్దడు. టాపిక్ విశిష్టతను పిల్లలకు చెప్పి వారి దగ్గరనుంచి సూచనలు అడుగుతాడు. పిల్లలు కూడా ఉపాధ్యాయుడ్ని పరీక్షిస్తూ టాపిక్ మీరే చెప్పండని ఉపాధ్యాయులను అడుగుతారు. అదే ఉపాధ్యాయులకు మొదటి పరీక్ష. తాను టాపిక్ చెప్పకుండా తను చెప్పిన టాపిక్స్‌పైన ఒక్కొక్కసారి అభిప్రాయం అడగాలి. అభిప్రాయాలన్నీ క్రోడీకరించడం, అందరు కలిసి ఒక టాపిక్‌ను నిర్ధారణ చేయడం, పిల్లల్లో తామే నిర్ణయించామని భావన కలిగించడం, ఉపాధ్యాయుని యొక్క ప్రజాస్వామీకరణకు అద్దం పడుతుంది. ఆ టాపిక్‌ను విశే్లశించాలి. చిన్న చిన్న సబ్‌టాపిక్స్‌గా చేయాలి. ఎవరు ఏ సబ్ టాపిక్స్‌పైన పనిచేస్తారో అడగాలి. అందుకు వారి సలహా తీసుకోవాలి. వారికి కొంత సమయం కూడా ఇవ్వాలి. ప్రతి సబ్ టాపిక్‌కు ఏ పుస్తకాలను చదవాలి, ఎవరితో సమాలోచనలు చేయాలి అని కొన్ని సూచనలు కూడా ఇవ్వాలి. 15రోజుల్లో ఆ సబ్ టాపిక్‌పై మర్దన జరిగిన తర్వాత ఒక్కొక్కరిని తను ఏం చేయాలనుకున్నాడో అడగాలి. ఈ సూచనల్నింటినీ రికార్డు చేయాలి. వారం రోజుల తర్వాత ఒక సమావేశం ఏర్పాటుచేసి ఎవరు ఏ సబ్ టాపిక్‌పై పనిచేస్తారో వారి అభిప్రాయం తీసుకోవాలి. ప్రతి విద్యార్థిసామర్ధ్యాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలించి ఎవరు ఏ సబ్ టాపిక్‌పైన పనిచేస్తారో, లేదా చేయాల్నో నిర్ణయించాలి. తర్వాత ఒక్కొక్క విద్యార్థితో ఒంటరిగా మాట్లాడాలి. తర్వాత పదిరోజులకు సమష్టిగా మాట్లాడాలి. ప్రతివారి వ్యక్తిగత బాధ్యతలు, సమష్టి బాధ్యత ఏమిటో పిల్లలకు విడమర్చి చెప్పాలి. ప్రతి విద్యార్థి తన పనిని రెండు నెలలు చేసిన తర్వాత సమష్టి సమావేశంలో తను తీసుకున్న బాధ్యతపై సమీక్ష చేయాలి. ప్రతివారు సమీక్షను మిగతా సభ్యుల వ్యాఖ్యానాలు కూడా తీసుకోవాలి. పనిని విభజించడం ఎంత ప్రధానమో, విభజించిన టాపిక్‌లో కూడా అందర్నీ భాగస్వాములను చేయడం అంత ప్రధానం. దానినే సమష్టీకరణ చేయడమంటారు. టాపిక్‌ను సమష్టీకరణ చేయాలి. ప్రతి విద్యార్థి తన బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు ఒంటరిగా ఆలోచిస్తూ ప్రాసెస్‌లో సమష్టిలో భాగస్వామ్యం కావాలి. ఆ ప్రాసెస్‌లో ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుడు ఇచ్చే సలహాలు ఒకవైపున ప్రోత్సాహం, రెండోవైపున గైడన్స్‌లాగ వుండాలి. ఉపాధ్యాయుడు ప్రాసెస్‌లో కూడా ప్రతి విద్యార్థికి సహాయకారి కావాలి. కొన్నిరోజుల తర్వాత సమావేశపరిచి ప్రాసెస్ గమనాన్ని సమీక్షించుకోవాలి. ఆ సమీక్షపై ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ సమీక్షను పవర్‌పాయింటుగ సమావేశంలో ప్రజెంటేషన్ చేయాలి. ప్రతివిద్యార్థి తనది కాకుండా ఇతరుల సబ్ టాపిక్‌ను ప్రజెంటేషన్ చేయాలి. ప్రతివిద్యార్థి ఇతరుల ప్రాసెస్‌లో భాగస్వామి కాదు కానీ ప్రజెంటేషన్‌లో భాగస్వామి అవుతారు. ఆ ప్రజెంటేషన్ కోఆర్డినేటర్ దగ్గర సమష్టి సమావేశం జరగాలి. ఏ సభ్యుని ప్రజెంటేషన్‌నైనా ఇతర సభ్యులతో ప్రజెంటేషన్ చేయించవచ్చు. అనగా మొత్తం ప్రాజెక్టు జట్టు ప్రాజెక్టుగా మారుతుంది. ఇదే కోఆపరేటివ్ లెర్నింగ్
‘‘అందరి పని నా పని/ నా పనే అందరి పని’’
అనే భావన ఆ జట్టులో కలిగించాలి
అదే కోఆపరేటివ్ లెర్నింగ్

-చుక్కా రామయ్య