సంపాదకీయం

ఉత్తరప్రదేశ్ నాటకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయమన్న భయం సమాజ్‌వాదీ పార్టీకి పట్టుకుంది! అందువల్లనే ఏదో విధంగా ప్రాధాన్యం నిలబెట్టుకొని, అధికారాన్ని కాపాడుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం! ఇందుకు పార్టీ అధినేత, యుపి మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిత్రమైన నాటకాన్ని ఆడిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ఇందులో ప్రధాన పాత్రధారులు.. లోక్‌సభ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించిన భారతీయ జనతాపార్టీకి ఇంకా ‘సమాజ్‌వాదీ పార్టీ’ ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తుండడం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో మరో విచిత్రం! సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ ఎక్కడ గెలుస్తుందోనన్న భయంతోనే ‘్భజపా’ వారు అన్ని ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుస్వభావులను తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. ఇలా ‘్భజపా’లోకి వస్తున్న వారందరూ గతంలో ఈ పార్టీని మతతత్త్వ పార్టీగాను, జాతీయ మహాపురుషుడైన రఘురాముడిని మత నాయకుడిగాను చిత్రీకరించిన వారు, అవినీతిపరులు, అవకాశవాదులు.. ఈ ఫిరాయింపుదారుల పరంపరలో గతంలో యుపి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ‘్భజపా’ను తిట్టిన ఋతా బహుగుణ సరికొత్తగా చేరింది. కాంగ్రెస్‌లో రాష్టస్థ్రాయి, కేంద్ర స్థాయి పదవులు రావడం కార్యకర్తల మద్దతు, ప్రజలలో పలుకుబడి, సిద్ధాంతాలు, నైతిక నిబంధనలు వంటి వాటిపై ఆధారపడ లేదు! కేవలం పార్టీ ‘అధిష్ఠాన కుటుంబం’ వారి దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఈ పదవులు ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఋతా బహుగుణ కాంగ్రెస్ రాష్టశ్రాఖ అధ్యక్షురాలుగా చెలామణి అయిన కాలంలో ఆమె గొప్ప నాయకురాలు కాదు.. రాజకీయ ప్రత్యర్థులను నీచమైన పదజాలంతో నిందించిన చరిత్ర ఆమెకుంది. నోరు పారేసుకోవడంలో బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఈ ఋతా బహుగుణ పరస్పరం పోటీ పడడం చరిత్ర! ఇలాంటి బహుగుణను తమ పార్టీలో చేర్చుకొనడం ద్వారా ‘్భజపా’ అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా సాధించే ప్రయోజనం లేదు. ఋతా బహుగుణ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ పటిమను చూసి మురిసి ముగ్ధులై వోటువేసే వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో లేరు! అయినప్పటికీ ఇలాంటి అవకాశవాదులను చేర్చుకొనడం ద్వారా ‘సమాజ్‌వాదీ పార్టీ’పై మరింత ఆధిక్యతను సాధించాలని ‘్భజపా’ భావిస్తోంది! ఐదేళ్లుగా అవినీతిని, అరాజకాన్ని, హింసాకాండను, అవకాశవాదాన్ని పెంచిపోషించడం ద్వారా 2012 నుంచి అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిత్వంలోని సమాజవాదీ ప్రభుత్వం అప్రతిష్టపాలైంది! అయినప్పటికీ ‘్భజపా’కు ‘సమాజ్‌వాదీ పార్టీ’ పట్ల ‘గుబులు’ తొలగలేదు! అందుకే అవకాశవాదులందరినీ ‘్భజపా’ ఇలా స్వాగతిస్తోంది..
‘బ్రాహ్మణ్ జోడో’ అన్న నినాదంతో మాయావతి 2002 నాటి ఎన్నికలలో శాసనసభలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అంతవరకు బ్రాహ్మణ-తిలక్- క్షత్రియ- తల్వార్, వైశ్య-తరాజ్-లను ద్వేషించిన మాయావతి ఈ కులాలను మాత్రమేకాక హిందూ సంప్రదాయాల పట్ల సైతం అనురక్తిని ప్రకటించింది! ‘ఏ హాథీ నహీ గణేశ్ హై’- ఇది ఏనుగు కాదు గణేశుడు- అంటూ తమ పార్టీ గుర్తయిన ఏనుగును ‘బహుజన్ సమాజ్ పార్టీ’వారు ప్రస్తుతించారు! అలా 2007లో ఘన విజయం సాధించినప్పటికీ ‘అవినీతి పాలన’ ఫలితంగా మాయావతి పార్టీ 2012లో ఘోర పరాజయం పాలైంది. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ గతంలో అధికారం చెలాయించినప్పుడు ములాయం ముఖ్యమంత్రిగా ఉండేవాడు. కానీ 2012లో ఆయన తన కుమారుడు అఖిలేశ్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాడు. ‘అఖిలేశ్ విద్యావంతుడని సంస్కారవంతుడని అతని పాలనలో అవినీతి, అరాజకం మచ్చుకైనా కనిపించబోవ’ని 2012లోప్రచారం జరిగింది! కానీ జరిగింది దీని పూర్తిగా భిన్నమైన పాలన.. అవినీతికి, అరాజకానికి తోడుగా జిహాదీ ఉగ్రవాద శక్తులు కూడా ఉత్తరప్రదేశ్‌లో విజృంభించడం అఖిలేశ్ పాలన ఫలితం! అందువల్ల ఎన్నికల సమయంలో ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి వీలుగా ములాయం కుటుంబం వారు ‘విభేదాల’ వింత నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అఖిలేశ్‌కు, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌కు మధ్య పార్టీలోను,ప్రభుత్వంలోను ‘ఆధిపత్య’ ఘర్షణ మొదలైందన్న ప్రచారం ఏడాదిగా జరుగుతోంది. ఇప్పుడు ములాయంకు, అఖిలేశ్‌కు మధ్య ‘్భకర సంకుల సమరం’ జరుగుతోందన్నది ప్రచారం. కుటుంబ సభ్యులు కొందరు అటువైపు, కొందరు ఇటువైపుగా చేరి తండ్రీ తనయుల మధ్య పోరాటపు నాటకాన్ని మరింత రక్తికట్టిస్తున్నారు! పార్టీ చీలిపోతుందని, అఖిలేశ్ కాంగ్రెస్‌తో జట్టుకడతాడని కూడా ప్రచారమైంది! ఈ ‘అంతర్గత’ యుద్ధాన్ని సాగించడం ద్వారా ములాయం సింగ్ పార్టీవారు గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు మరచిపోవడానికి వీలైన వ్యూహాన్ని రచించారు! ఫలితం దక్కదు.
ఇలా, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నది మాత్రమే స్పష్టమైంది! మిగిలిన రాజకీయం గందరగోళంగా మారి ఉంది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో తొంబయి శాతం స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతాపార్టీకి రానున్న శాసనసభ ఎన్నికలలో పూర్తి మెజారిటీ లభిస్తుందా? అన్న ప్రశ్నకు ‘లభిస్తుంది’ అన్న భవిష్యవాణి కూడా స్పష్టంగా వినిపించడం లేదు! నాలుగువందల స్థానాల శాసనసభలో ‘్భజపా’కు స్పష్టమైన మెజారిటీ కంటే తక్కువ స్థానాలు లభిస్తాయని ఇటీవల జరిగిన ‘సర్వే’లు నిర్ధారించినట్టు ప్రచారవౌతోంది!
భారతీయ జనతాపార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడల్లా ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడానికి లేదా అధికార కూటమిలో చేర్చుకున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని దక్కకుండా చేయడానికి మాత్రమే ఇతర పార్టీలు ప్రయత్నించడం చరిత్ర. ‘్భజపా’ రెండుసార్లు బహుజన సమాజ్ పార్టీ- బసపా-తో జట్టుకట్టవలసి రావడానికి కారణం ‘్భజపా’కు ఆయా సందర్భాలలో స్పష్టమైన మెజారిటీ లభించకపోవడమే! ఈ రెండు సందర్భాలలోను నష్టపోయి నాలుక కరుచుకున్నది ‘్భజపా’మాత్రమే! ‘సమాజ్‌వాదీ పార్టీ’ని అధికారానికి దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో రెండు సందర్భాలలోను ‘్భజపా’- ‘బసపా’ నాయకురాలు మాయావతిని ముఖ్యమంత్రి గద్దెపై కూర్చుండపెట్టింది! కానీ రెండు సందర్భాలలోను ‘్భజపా’ వ్యూహం బెడిసికొట్టింది, జాతీయతా నిష్ఠను పెంపొందించడానికి రూపొందించిన వ్యూహం విఫలమైంది. అయోధ్య రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోనేకాక దేశవ్యాప్తంగానూ జాతీయతాభావ నిష్ఠను పెంపొందించగల పరిణామం! ఈ లక్ష్యం నెరవేర లేదు! ఇంతకాలం రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ‘సమాజ్‌వాదీ పార్టీ’ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఇప్పుడు తన తప్పును అంగీకరించాడు! ఇలా అంగీకరించడం ‘్భజపా’ వోట్లకు గండికొట్టే వ్యూహం..
మాయావతి 2007లో అవలంబించిన వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తాము విజయం సాధిస్తామని కాంగ్రెసు పగటి కలకంటోంది! అందుకే రాజకీయాల నుంచి విరమించి విశ్రాంతి తీసుకుంటున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను రంగంలోకి దింపింది! కుల రాజకీయాలు ఎన్నికల విజయం కూర్చే కాలం గతమైందని 2014 లోక్‌సభ ఎన్నికల ద్వారా ధ్రువపడింది! ఉత్తరప్రదేశ్ వోటర్లు కులాలకు, మతాలకు అతీతంగా జాతీయ నిష్ఠతో వోట్లు వేయనున్నారు. ఈ జాతీయతా నిష్ఠకు కేంద్ర బిందువు అయోధ్య రామమందిరం నిర్మాణం! మందిర నిర్మాణ సమర్థకశక్తులకు మాత్రమే వి జయం లభించనుంది! కుల రాజకీయాలకు కాదు...