సబ్ ఫీచర్

యాచకుల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సమాజంలో ఎక్కడ చూసినా యాచకుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. నడిరోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా యాచకుల బెడద తీవ్రమవుతోంది. రద్దీ రహదారులపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు అడ్డుపడుతున్నందున వాహన చోదకులు నానా ఇబ్బందులకు లోనవుతున్నారు. రహదారులపై కీలక జంక్షన్ల వద్ద యాచకులు ఇబ్బందులు సృష్టిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. చిన్న పట్టణాలు, నగరాల్లో యాచనను వృత్తిగా చేసుకుని సులభంగా డబ్బు సంపాదించేవారి సంఖ్య పెరుగుతోంది. అంగవైకల్యంతో ఉన్నవారే కాదు, ఎలాంటి శారీరక లోపం గానీ, అనారోగ్యం కాని లేనివారు సైతం యాచకుల అవతారం ఎత్తి ప్రజలకు చిరాకు కలిగిస్తున్నారు. భిక్షాటనను నిషేధించినట్టు ప్రభుత్వం చెబుతున్నా ఆ చట్టం అమలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
రహదారులపై ట్రాఫిక్ సమస్యకు బిచ్చగాళ్లు కొంత కారణం అవుతున్నారు. టీ స్టాల్స్, హోటళ్ల ముందు వీరు రోడ్డుపైనే తిష్ట వేస్తున్నారు. బజార్లలో అయితే వీరి బెడద గురించి చెప్పనక్కర్లేదు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు సైతం బిచ్చగాళ్లుగా రోడ్డెక్కడంతో నిజమైన బిచ్చగాళ్లను సైతం జనం కసురుకుంటున్నారు. ఇక నెలల నిండని పిల్లలను అద్దెకు ఇచ్చి బిచ్చగాళ్లను ప్రోత్సహిస్తున్న ముఠాలు నగరాల్లో ఉన్నాయి. బిచ్చమెత్తుకోవడానికి కొంతమంది రకరకాల కథలు వినిపిస్తుంటారు. వరదల్లో ఆస్తులు కోల్పోయామనో, అగ్నిప్రమాదంలో ఇల్లు తగలబడిందనో, ఆడపిల్లకు పెళ్లి చేయాలనో, అనారోగ్యంతో ఉన్న తమ బంధువులను ఆదుకోవాలనో, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నామనో... ఇలా వీరు పలురకాల కారణాలు చెబుతుంటారు. అయితే, ఆరోగ్యవంతంగా ఉన్న వీరిని చూసి జనం కూడా జాలి పడడం మానేస్తున్నారు.
సులభమైన సంపాదనకు సులువైన మార్గం కావడంతో యాచకులుగా మారే వారి సంఖ్య పెరుగుతోంది. యాచకుల మధ్య పోటీ పెరుగుతోంది. కొంతమంది యాచకులు ప్రజలను విసిగించడం, చేతులను పట్టుకోవడం వంటి పనులతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లలను యాచక వృత్తిలోకి దించుతున్నారు. పిల్లలను చూసి జాలిపడి ఎంతోకొంత డబ్బు ఇస్తారన్న ఆశతో కుటుంబ పెద్దలే యాచకవృత్తిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు, ప్రభుత్వ హాస్టళ్లకు పంపడానికి బదులు రోడ్లపై బిచ్చమెత్తుకోమని పేద తల్లితండ్రులే బరితెగిస్తున్నారు. పసిపిల్లలను యాచక వృత్తిలో దించే ముఠాల సంఖ్య పెరుగుతోంది. ఒక రకంగా పిల్లల చేత వీరు ఇష్టం లేని పనులు చేయిస్తున్నారు. యాచక వృత్తిలోనూ బాలకార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలున్నా అవి ఎందుకూ కొరగావడం లేదు. కార్మికశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి యాచకవృత్తిలో ఉన్న బాలలను రక్షించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యకరంగా ఉన్న వారి చేత ఆ వృత్తిని మాన్పించాలి. స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తే యాచకులు ఇతరులపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఉంది. సామాజిక సమస్యగా మారిన యాచకవృత్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. విఐపిలు వచ్చినపుడు రోడ్లపై నుంచి బిచ్చగాళ్లను తరిమేయడం కాదు, యాచక వృత్తి నుంచి వారు బయటపడేలా పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

-షేక్ అస్లాం షరీఫ్