సబ్ ఫీచర్

ఎవరు సంస్కరణవాదులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువ్యవస్థితమైన సమాజాన్ని నిర్మాణం చేయుటకు రమ్యమైన, రసమయమైన, మధురమైన భావావేశముతో మానవ సమాజాన్ని సర్వాంగీణ వికాసం చేసే ప్రయత్నంలో తమస్సునుండి ఉషస్సు వైపు మానవ మస్తిష్కాలకు పదునుపెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వాటిని తరతరాలుగా కొనసాగించేందుకు ఉపయుక్తంగా ఉండే విధంగా రచనలు చేసేవారే రచయితలు, కవులు, పండితులు. ఆయా సమాజంలోని సంఘటనలను, సన్నివేశాలను పామరుల నుండి పండితుల వరకు ఒకరి భావాలను ఒకరు పంచుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ సభ్య సమాజాన్ని తీర్చిదిద్దడమే రచయితల బాధ్యత. సంస్కారవంతమైన సమాజాన్ని వివిధ రూపాలలో అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు కృషిచేస్తున్న వారికి గుర్తింపుగా విజ్ఞులైనవారు పురస్కారాల పరంపరను ప్రవేశపెట్టినారు. వాటిని కొనసాగింపుగానే సాసితీవేత్తలకు, రచయితలకు చరిత్రకారులకు, శాస్తవ్రేత్తలకు అనేక రంగాల వారికి పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతున్నది. ఒక సమాజం స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కోల్పోయినప్పుడు, ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు, సంస్కృతి అవమానించబడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ప్రజలకు ఊరట పరిచే, ఉత్తేజపరిచే, కార్యోన్ముఖులను చేయడం రచయితల బాధ్యత. సమాజ హితం కోరుతూ జాతిని నిర్మాణం కొరకు చేయబడే రచనలు అట్టి రచనలను చేసే రచయితలే స్వాభిమానవంతులు. జాతీయవాదులు. కోట్ల మంది హిందువులు పవిత్రంగా భావిస్తూ పూజించే గోవును చంపినారన్న నెపంతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో జరిగిన హత్యను, హిందూ దేవీదేవతల విగ్రహాలపై మూత్రం పోయండి అని పిలుపునిచ్చి హిందువుల మనోభావాలను కించపర్చిన కర్ణాటకలోని ‘కల్బర్గి’ హత్యను పూచిగా చూపిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేసి మాట్లాడటం వారి సంకుచిత స్వభావానికి తార్కాణం. హత్యలను సమర్థించటం సమంజసనీయం కాదు.
ఒరిస్సాలో గిరిజనులకు సేవచేస్తున్న స్వామి లక్ష్మణానంద సరస్వతీ అతనితోపాటు మరికొందరు దారుణంగా హత్య చేయబడ్డారు. మహారాష్టల్రో నరేంద్ర దబోల్కర్ హత్య చేయబడ్డాడు. ఇప్పుడు పురస్కారాలను తిరస్కరిస్తున్న వారికి అప్పుడు సోయిలేకపోయిందా! పురస్కారాలు తిరస్కరిస్తున్నవారు ఎం నిజాయితీపరులో ఆలోచించండి. ప్రతి నిత్యం అనేకమంది ముక్కుపచ్చలారని అమ్మాయిలపై అత్యాచారం జరుపుతూ హత్య చేస్తున్న సంఘటనలు వీరి దృష్టిలో సాంప్రదాయమా లేదా జాతరలోని సంబరాలుగా కనిపిస్తున్నవా? కోట్ల మంది హిందువులు వేల సంవత్సరాలుగా ‘రామాయణాన్ని’ పవిత్ర గ్రంథంగా భావిస్తూ, పూజిస్తూ, అనుసరిస్తూ వారి జీవన విధానం గడుపుతున్నవారి మనోభావాలను కించపరుస్తూ, అవమానపరుస్తూ ‘రామాయణ విషవృక్షం’ పేరుతో రచన చేయడం వీరికి భావస్వాతంత్య్రంగా కన్పిస్తున్నదా? ఆవుపాలు, బఱ్ఱెపాలు తెల్లగా ఉంటాయి. హిందువులకు ఆవు ఎందుకు పవిత్రం? బఱ్ఱె ఎందుకు కాదు. వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయండి. క్రైస్తవులు, దళితులు బ్రాహ్మణులతో పోరాడండి, ఈ దేశంలో హిందుత్వం ఉండకూడదు అంటూ వేదికలపై నుండి, ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే చెప్పే వీరు సమాజ విచ్ఛిన్నకారులా? లేదా సంఘ సంస్కర్తలా?
హిందువులను కించపరిచే వారిని ప్రశ్నించినవారు ఆర్.ఎస్.ఎస్., విహెచ్‌పి, హిందూ మతతత్వవాదులని అంటూ వారిపై అభాండం వేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? విజ్ఞులైనవారు ఆలోచించండి.
- బలుసా జగతయ్య