ఉత్తరాయణం

హిందువులపై దాడులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హిందూ సంస్థల సానుభూతిపరులు వరుసగా హత్యలకు గురికావటం చూస్తుంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లయినా లేదనిపిస్తోంది. ఈ రాష్ట్రాలలో హిందువుల ఐక్యతకు, రక్షణకు పాటుపడుతున్న వారిని అంతం చేయటం గత దశాబ్దకాలంగా పెచ్చరిల్లిపోయింది. వీటిని సాధారణ హత్యలుగా భావించకుండా ఒక మతం పట్ల వైరంతో కూడి చేస్తున్నవిగా భావించాలి. ఈ రెండు రాష్ట్రాలు మత మార్పిడులకు అడ్డాగా మారాయని చెప్పటంలో సందేహపడనక్కర లేదు. ‘లవ్ జిహద్’ పేరు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. వామపక్షవాదులు, కుహనా లౌకికవాదులు ఈ దమనకాండను ఖండించకపోవటం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని, హిందువుల మనోభావాలు వీరికి అవసరం లేదని తేటతెల్లం అవుతోంది.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికిందరాబాద్
ఆగని చైన్ స్నాచింగ్‌లు
జంట నగరాల్లో రోజురోజుకీ చైన్‌స్నాచర్ల ఆగడాలకు అంతే లేకుండా పోవడం మహిళలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళల మెడలోంచి బైక్‌పై వెళ్తున్న దుండగులు గొలుసులు తెంపుకుని వెళ్తున్నారు. ఈ ఘటనల్లో మహిళలు ఖరీదైన గొలుసులు కోల్పోవడమేగాక తీవ్రంగా గాయపడుతున్నారు. చైన్ స్నాచింగ్‌లను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అడుగడుగునా నిఘా ఉంచి, చైన్‌స్నాచర్లను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అనుమానితులను పోలీసులకు అప్పజెప్పాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
చైనా వస్తువుల బహిష్కరణ
జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నేత మసూద్ అజర్‌పై నిషేధం విధించాలన్న భారత ప్రతిపాదనను చైనా ఐరాస భద్రతా మండలిలో వీటో చేసింది. తీవ్రవాదులకు, మావోలకు ఆయుధాలు, నిధులు ఇస్తూ మన దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. పాక్‌లోని ఉగ్రవాద అడ్డాలను పోషించటానికై చైనా సహాయం చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా తన సైనికులను దించి క్రమంగా ఆక్రమించుకుంటోంది. బలూచిస్థాన్‌లో ఎకానమిక్ కారిడార్‌ను ఆశచూపి అక్కడ కూడా పాగావేసింది. మన దేశానికి చౌకబారు వస్తువులు అమ్ముతూ మన విదేశీ మారకద్రవ్య నిల్వలను కొల్లగొడుతున్నది. అక్రమంగా అనేక వస్తువులను దొంగదారిన మన దేశంలోనికి ప్రవేశపెడుతూ మన కుటీర పరిశ్రమలను, స్వదేశీ పరిశ్రమలను దెబ్బతీస్తున్నది. గనుక ప్రతి భారతీయుడు చైనా వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను కొని చైనా ఆర్థిక స్థితిని దెబ్బతీయాలి.
- కానుకొల్లు మురళీధర్, వైదేహీనగర్
పోస్ట్ఫాస్ స్థాయి పెంచండి
మహబూబ్‌నగర్ జిల్లా శాంతినగర్ పోస్ట్ఫాస్ స్థాయిని పెంచాలి. ప్రస్తుతం చాలా పోస్ట్ఫాస్‌లు కంప్యూటరీకరణ అయిపోయాయి. ఈ పోస్ట్ఫాస్ మాత్రం కంప్యూటరీకరణకు నోచుకోలేదు. శాంతినగర్ మండల కేంద్రం కావడంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు ఉన్నాయి. చాలామంది పోస్టల్ సేవలు వినియోగిస్తున్నారు. దీని స్థాయి తక్కువ కావడంతో చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పోస్ట్ఫాస్‌లో మనిఆర్డర్ కానీ రిజిస్టర్ పోస్ట్‌కానీ చేస్తే మరుసటి రోజున రశీదు ఇస్తున్నారు. ఏ రోజు రశీదు ఆరోజే యివ్వాలి. పోస్ట్ఫాస్‌కు శాశ్వత భవనం నిర్మించి అన్ని ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు వెసులుబాటుగా ఉంటుంది.
-ఎస్‌ఎ షరీఫ్, శాంతినగర్
పాక్ వింత ధోరణి
కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని అంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలను అందించడం లేదా? కాశ్మీర్ పాక్‌లో అంతర్భాగమని ఆ దేశ పార్లమెంటులో నిర్ణయం జరగలేదా? కాశ్మీర్ కోసమే ఉగ్రవాదులు దాడి జరుపుతున్నారని పాక్‌కు తెలియదా? వీరు ఉగ్రవాదులా? లేక తమ సైనికులా? అన్న వాస్తవం పాక్‌కు తెలియదనుకోవాలా? కాశ్మీర్‌ను తమ భూభాగంలో చేర్చుకోవాలనే తాపత్రయం పాక్‌కు ఉన్నట్టేకదా! మనం ఇంకా ఉపేక్షించక వెంటనే కార్యోన్ముఖులం కావాలి. ఎవరి ఇంటిని వారే చక్కదిద్దుకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
జవాన్లపై చిన్నచూపు..
హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ముస్లింల కుటుంబాలకు పది లక్షల చొప్పున, నాటుసారా తాగి ప్రాణాలు కోల్పోయిన వారికి నాలుగేసి లక్షల చొప్పున పశ్చిమ బెంగాల్ సర్కారు నష్టపరిహారం ఇచ్చింది. కానీ, ఉగ్రదాడుల్లో ప్రాణాలర్పించిన ఇద్దరు బెంగాలీ జవాన్లకు మాత్రం రెండు లక్షలే విదిలించింది. ‘మెరుపుదాడి’ అనంతరం చాలామంది ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పగా బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మాత్రం అలా చెప్పలేదు. పాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింల మనోభావాలు దెబ్బతిని, ఫలితంగా తమ పార్టీకి ఓట్లువేయరేమోనని మమతా సంకోచం అని విశే్లషకుల అంచనా. విద్రోహ చర్యలను ఖండించకపోతే ఇలాంటి నేతలు దేశభక్తులని ప్రజలు ఎలా భావిస్తారు? -స్నేహమాధురి, పెద్దాపురం