సబ్ ఫీచర్

తరగతి గధి.. ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదికి సమత్వమే లక్ష్యం. అందరికీ సమంగా సమత్వం వచ్చేలా బోధించటమే ఉపాధ్యాయుల ధ్యేయం. కొందరు విద్యార్థులకు స్వతహాగానే ఉపాధ్యాయుల బోధనతో విషయ జ్ఞానం లభిస్తుంది. మరి కొందరు విద్యార్థులు ప్రయత్నంతో విషయ జ్ఞానం పొందుతారు. ఇది పిల్లల లోపం కానే కాదు. దీనికి కారణం- అసమానతల సమాజం. తరగతి గది అందరికీ సమానమైన జ్ఞానాన్ని అందచేయాలి. దానిలో లోపం ఉంటే పిల్లలు ‘డ్రాప్ అవుట్’ అవుతారు. తరగతి గది అందరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి. కానీ, కొందరిలో వూహించలేనంత ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి వ్యక్తిగతంగా వారితో సంభాషించటమే అది వికసించటానికి దోహదపడుతుంది. ప్రతిభ పూర్తిగా వ్యక్తిగతమైనది. పిల్లల్లో ప్రతిభ వికసించటానికి ఉపాధ్యాయుల కృషి కూడా వ్యక్తిగతమైనది.
పిల్లల్లో ఏ అంశంపై వారికి ప్రతిభ ఉన్నదో దాన్ని పోషించటం కూడా ఉపాధ్యాయుల బాధ్యత. ఉపాధ్యాయుల పని బడిగంట కొట్టగానే పూర్తికాదు. పిల్లలు బోధన ద్వారా రాణించ గలిగితేనే తాము విజయం సాధించినట్లుగా ఉపాధ్యాయులు భావించాలి. పిల్లలు వారి ప్రతిభతోనే భవిష్యత్ మేధావులుగా నిలుస్తారు. ప్రతిభను మొదట పోషించాలి, అది వికసించాలి. ఆ తర్వాత దాన్ని సామాజికీకరణగా మార్చేయాలి.
వ్యక్తిగతమైన జ్ఞాన సంపదను సమాజపరం చేస్తేనే ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త అవుతాడు. అలా పోషించకుండా వదిలిపెడితే అది అడవిలో పూసిన పువ్వుగానే మారిపోతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను గుర్తించటంతోపాటు ఇంకా ఎం తో పనిచేయాల్సి ఉం టుంది. తరగతి గది ముగిశాక కూడా విద్యార్థులతో ఒంటరిగా కలిసి మాట్లాడాలి. పిల్లల్లో దాగివున్న ప్రతిభను వికసింపచేయటానికి- తోటను పెంచేటప్పుడు ఒక మొక్క పట్ల తోటమాలి తీసుకునే జాగ్రత్తలన్నీ ఉపాధ్యాయుడు చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న నైపుణ్యంతో ఈ పని చేయాలి. అదే విధంగా ఇతరులకు అప్పగించి కూడా ఆ పిల్లల్లో సమర్థతను, శక్తిని బైటకు తీసుకురావాలి. దీనినే సమస్యా పరిష్కారం అంటాం. కొన్నిసార్లు శిక్షణ ఇచ్చిన దానికన్నా శిక్షణ పొందినవాడు ముందుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల శిక్షణ నేర్చుకున్నది, పిల్లల్లో ప్రతిభ సహజమైనది. సహజమైన ప్రతిభకు పెరిగే శక్తి ఉంటుంది.
ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ నేర్చుకుంటారు. అప్పుడు విద్యార్థి ఉపాధ్యాయుడికి సహచరుడవుతాడు. దానివల్ల ‘ఎక్స్‌లెన్సీ’ బీజం మొక్కగా మారుతుంది. అందుకే ఏపి రెసిడెన్షియల్ స్కూళ్లను ‘స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ’ అంటారు. ఎక్స్‌లెన్సీకి, ఈక్విటీకీ తేడా ఉంది. ‘ఎక్స్‌లెన్సీ’ మొక్క నుంచి ఎదిగిన విద్యార్థి, ఎదిగి రీసెర్చ్‌చేసిన వాళ్లు ఎందరో ప్రొఫెసర్ వృత్తిలోకి వచ్చిన వారున్నారు. తరగతి గది ఎక్స్‌లెన్సీకి బీజం. ఆ బీజమే ఎక్స్‌లెన్సీని తట్టిలేపుతుంది. ఎక్స్‌లెన్సీ మొక్క పెరిగే కాలంలో విద్యార్థులను దగ్గరగా ఉపాధ్యాయులు చూసే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్‌లెన్సీ మరింత విస్తృతం కావటానికి, ఆ మొక్క ఎదుగుదలకు కావల్సిన వాతావరణాన్ని, ఎరువును, నీటిని ఉపాధ్యాయుడు అందిస్తారు. అప్పుడే ఆ మొక్క కావల్సినంత జ్ఞాన పంటను అందిస్తుంది. తరగతి గది అందించే ఆ జ్ఞానపంటే ప్రపంచానికి సంపద.

-చుక్కా రామయ్య