ఉత్తరాయణం

పీవీ పేరిట జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీమ్, సిరిసిల్లకు రాజన్న , భూపాలపల్లికి జయశంకర్ పేరిట తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. దేశదేశాల్లో కీర్తి గడించిన తెలుగుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ప్రభుత్వం విస్మరించడం విచారకరం. ప్రధానిగా, నూతన ఆర్థిక విధానాల రూపకర్తగా, ముఖ్యమంత్రిగా, బహుభాషావేత్తగా కీర్తి శిఖరాలను అందుకున్న పీవీని గతంలో కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కరీంనగర్ జిల్లా నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించి రాజకీయంగా ఎంతో ఎత్తులకు ఎదిగిన పీవీ స్మత్యర్థం ఓ జిల్లాను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. పెద్దపల్లి జిల్లాకు గాని, వరంగల్ అర్బన్ లేదా రూరల్ జిల్లాలలో ఒక దానికి గాని ఆయన పేరు పెడితే తెరాస ప్రభుత్వానికి జనం జేజేలు పలుకుతారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మంత్రాలకు అపచారం..
చాలాకాలం నుండి మన సినిమాల్లో దొంగ పెళ్లిళ్లకు మంత్రాలు చదవడం, మంగళ సూత్రాలు కట్టించడం, ఆశీర్వచనాలు వంటివి జరిగిపోతున్నాయి. టీవీ సీరియల్స్ వచ్చాక ఇవి మరీ ఎక్కువ అయిపోయాయి. అపరకర్మలు కూడా చూపిస్తున్నారు. వాటికి సంబంధించిన మంత్రాలు చదివిస్తున్నారు. శుభాశుభ కర్మలకు నిర్ణయించిన మంత్రాలు ఎంతో పవిత్రమైనవి. అవి ఆయా సమయాలలోనే చదవాలి. డబ్బుకోసం కక్కుర్తిపడి కొందరు ఈ మంత్రాలు ఇష్టానుసారం చదివేస్తున్నారు. నిశ్చితార్థాలు సైతం చేయిస్తున్నారు. ఈ మంత్రాలకు జరుగుతున్న అపచారాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వివిధ పీఠాధిపతులు సమావేశమై ఇలాంటి అపచారాలు తెరపై జరగకుండా చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడితేవాలి. టిటిడి వంటి ధార్మిక సంస్థలు ఈ విషయంలో ఒక తీర్మానం చేసి ఈ పద్ధతి నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలి.
- వేదుల సత్యనారాయణ, కాకరపర్రు
ఉమ్మడి పౌరస్మృతి అవసరం
కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని వున్నా, ఆడ మగ తేడాలున్నా దేశ ప్రజలందరూ ఒకటే! మనది సెక్యులర్ దేశం. చట్టాలనేవి ఏ మతంతోను ముడిపెట్టి వుండరాదు. ఏ మతస్తునికైనా ప్రత్యేకించిన చట్టం వుండటానికి వీలులేదు. ఏ మతస్థులైనా వారికిష్టమొచ్చిన ప్రదేశానికి వెళ్లటానికి స్వేచ్ఛ వుంది. ఒక ముస్లిం భర్త తన భార్యకు మూడుసార్లు ‘‘తలాక్’’ చెప్పటం ద్వారా విడాకులు ఇవ్వవచ్చు. అదే వ్యక్తి నలుగురు భార్యలను కలిగి వుండవచ్చు. ఇది తమ పట్ల వివక్ష చూపడమేనని ముస్లిం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయ. త్రిపుల్ తలాక్, బహుభార్యత్వం విషయంలో సంప్రదింపులకు తావులేదని కేంద్రం తెలిపింది. దేశంలో నూటికి తొంభై శాతం ప్రజలు దేశమంతా ఒకే చట్టపరిధిలో వుండాలనే కోరుకుంటారు. ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి దేశాన్ని కాపాడాలి. అన్ని మతాల వారూ చట్టం ముందు సమానమే.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
ఆగని అత్యాచారాలు
ఎన్ని కఠిన చట్టాలున్నా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన జిగీష హత్యోదంతం హృదయ విదారకంగా ఉన్నది. ‘నా డెబిట్ కార్డు తీసుకోండి, ఎటిఎం పిన్ నెంబరు చెపుతాను, నన్ను చంపకండి’ అని ఆమె ప్రాధేయపడినా ఆ నరరూప రాక్షసులు కనికరం లేకుండా ఆమెను ముక్కలు చేసి చంపేశారు. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవ జైలుశిక్షను న్యాయమూర్తి విధించారు. అయితే, కొందరు హేతువాదులు, మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం మానవతా కోణంలో మరణశిక్ష విధించకూడదని అంటున్నారు. మరి కొందరు మరణశిక్షను రద్దు చేయాలని అంటున్నారు. మరణశిక్ష అమలులో ఉన్నప్పుడే ఇటువంటి దుర్మార్గాలు కొనసాగుతున్నాయి. అది కాస్తా రద్దయితే స్ర్తిలకు రక్షణ ఉంటుందా? మానవ హక్కుల సంఘాల వారు- చాలా దేశాల్లో మరణశిక్ష లేదని అంటున్నారు. ఆ దేశాల్లో ఉన్న సంస్కారం ఇక్కడ మనవారికి ఉన్నదా? కఠిన శిక్షలను అమలుచేస్తే తప్ప నేరాలను నియంత్రించే అవకాశం లేదు.
-కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై
కల్తీని అరికట్టరా?
తాగే నీటిలో, పాలల్లో, నూనెల్లో, పప్పులలో ఉప్పులో, ఎరువుల్లో చివరకు అత్యవసర మందుల్లో కల్తీ. కల్తీ ఇంత ప్రమాదకరంగా మారుతున్నా అడిగేవారు కానీ, అడ్డగించేవారు గానీ కరువైపోయారు. అవినీతికి, కల్తీకి అవినాభావ సంబంధం వుంది. అందుకే పెరుగుతున్న అవినీతికి రెట్టింపు స్థాయిలో కల్తీ పెరిగి పోతున్నది. కల్తీని అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలనే చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి అధికారులను నియమించారు. ఆ అధికారులు కానీ, చట్టాలుకానీ ఈ కల్తీని నిరోధించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా లక్షలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతుండగా కొందరు దీర్ఘరోగాల బారిన పడుతున్నారు. సమస్య ఇంతగా విలయ తాండవం చేస్తున్నా పాలకులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు