సంపాదకీయం

సర్వమత సమభావం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్యులరిజమ్- అన్న ఆంగ్లపదానికి ‘సర్వమత సమభావం’ అన్నది సరైన అర్థమని సర్వోన్నత న్యాయస్థానంలోని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడం భారత జాతీయ స్వభావానికి అనుగుణమైన పరిణామం! ‘సెక్యులరిజమ్- అని అంటే మతం నుంచి దూరంగా ఉండాలని అర్థం కాదు, అన్ని మతాలకూ సమాన ఆదరణ లభించడం’ అని రాజ్యాంగ పీఠం న్యాయమూర్తులు స్పష్టం చేయడం ‘వక్రీకరణ’కు విరుగుడు! వాస్తవ దర్శనానికి సరికొత్త వెలుగు! ‘సెక్యులరిజమ్’ అని అంటే మతాన్ని ధర్మాన్ని సాంస్కృతిక జాతీయ వారసత్వాన్ని నిరాకరించడమన్న ప్రచారం మన దేశంలో దశాబ్దుల తరబడి జరుగుతోంది. ‘సెక్యులరిజమ్’ అన్న పదానికి ‘్ధర్మ నిరపేక్ష’, ‘మత నిరపేక్షత’, ‘లౌకికవాదం’ అన్న విచిత్ర పదజాలం కూడా ప్రచారవౌతోంది. ‘అపేక్ష’ అని అంటే ఆసక్తి.. ‘నిరపేక్షత’ అని అంటే ఆసక్తి లేకపోవడం! ఇలా ధర్మం పట్ల ఆసక్తి లేకపోవడం ‘సెక్యులరిజమ’ని, మతం పట్ల అనురక్తి లేకపోవడం ‘సెక్యులరిజమ’ని జరిగిన ప్రచారం సామాజిక సాంస్కృతిక జాతీయ చారిత్రక వాస్తవానికి ఘోరమైన వక్రీకరణ! ‘వక్రీకరణ’ వాస్తవంగా చెలామణి అయింది! స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతున్న వైపరీత్యం ఇది! ‘్ఫలానా ప్రధానమంత్రి గుడికి వెళ్లవచ్చునా? సెక్యులరిజమ్ స్ఫూర్తికి వ్యతిరేకం కదా!’ అన్న దుర్‌వ్యాఖ్యలు వేదికల మీద, మాధ్యమాలలోను దశాబ్దులుగా వినబడుతున్నాయి. లోకానికి లేదా సమాజానికి చెందినది లౌకికం! ఈ లౌకికతత్త్వంలో మతాలు, భాషలు, భావాలు, ఆలోచన రీతులు భాగం. నిజానికి ప్రతి దేశంలోను ఆ దేశపు ‘జాతీయత’ లౌకికతత్త్వం. ఆ దేశపు సంస్కృతి లౌకికతత్త్వం. కానీ, మన దేశంలో మాత్రం ‘లౌకికతత్త్వం’ అంటే జాతీయతకు, సంస్కృతికి భిన్నమైనదన్న ప్రచారం కూడా జరిగింది! మతాలు, భాషలు, ఆహార, ఆహార్య పద్ధతులు మన దేశంలో అనాదిగా అనేకం. కానీ. ఈ వైవిధ్యాలనన్నింటినీ సహజంగా సమన్వయం చేస్తున్న సనాతన సంస్కృతి మాత్రం ఒక్కటే. సనాతన జాతీయత కూడా ఒక్కటే! అనాదిగా పరిఢవిల్లుతున్న ఈ ‘జాతీయ సంస్కృతి’ సహజంగానే ‘సర్వమత సమభావం’, సర్వభాషా సమభావం.. సర్వ వైవిధ్య సమభావం! కానీ, ఈ వాస్తవాన్ని వక్రీకరించిన వారు స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిర్వాహకులుగా, రాజకీయపక్ష నిర్వాహకులుగా, విద్యావ్యవస్థల నిర్వాహకులుగా చెలామణి అవుతున్నారు! అందువల్ల ‘సెక్యులరిజమ్’ అన్న పదం వక్రీకరణకు గురి అయినది! ‘జాతీయత’ను, ‘జాతీయ సంస్కృతి’ని ‘మతం’గా చిత్రీకరించడం మొదలైంది. ఫలితంగా జాతీయతత్త్వం మతతత్త్వంగాను, జాతీయతా నిష్ఠకలవారు మతోన్మాదులుగాను విక్రృత చిత్రీకరణలు చోటుచేసుకున్నాయి. సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం గురువారం చేసిన వ్యాఖ్యలు ‘వక్రీకరణ’ ఊబి నుండి జాతి ప్రజలు బయటపడడానికి దోహదం చేయగల మార్గదర్శకాలు..
ఎన్నికల ప్రచారం సందర్భంగా మతాన్ని దుర్వినియోగం చేయడాన్ని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని నిరోధించవలసిన అవసరం గురించి విచారణ జరుపుతున్న ధర్మాసనం న్యాయమూర్తుల వ్యాఖ్య దశాబ్దులుగా జాతీయతావాదులు చెబుతున్న దానికి అనుగుణంగా ఉంది! ‘సెక్యులరిజమ్’ ఈ దేశపు ‘జాతీయత’-నేషనలిజమ్-లో నిహితమై ఉంది! అందువల్లనే ‘సర్వమత సంపుటం’గా కొనసాగుతున్న అనాది భారత జాతీయతకు ‘సర్వమత సమభావం’ మరో రూపం మాత్రమే! ‘సర్వమత సమభావం’- నిజమైన సెక్యులరిజమ్. ఈ దేశంలో అనాదిగా ఉన్నది జాతీయత మాత్రమే. కానీ సెక్యులరిజమ్ పేరుతో జాతీయతా వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రచారం జరిగిపోయింది. నిజమైన ‘సెక్యులరిజాని’కి లేదా ఈ దేశపు వౌలిక జాతీయతకు ప్రచారం లభించక పోవడం, నకిలీ సెక్యులరిజానికి లేదా వౌలిక జాతీయతను మతోన్మాదంగా చిత్రీకరించిన వారికి విపరీతమైన ప్రచారం లభించడం నడచిపోతున్న కథ! సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్, న్యాయమూర్తులు మదన్ లోకుర్, ఎన్‌ఎ బాబ్టే, ఆదర్శ గోయల్, యు.యు.లలిత్, డివై చంద్రచూడ్,ఎల్‌ఎన్ రావ్ గురువారం చేసిన వ్యాఖ్యలు ఈ ‘కధా’ గమనాన్ని సరైన దిశగా మలుపు తిప్పడానికి దోహదం చేయగలవు. ‘జాతీయత’ను ప్రస్తావించడం, ‘మతా’న్ని ప్రస్తావించడం ఒకటి కాదు. ఈ అంతరం గురించి స్పష్టీకరణ జరుగవలసి ఉంది. అయితే రాజకీయ పక్షాలు ‘మతం’ పేరు చెప్పడమే మహాపాపమని భావించడం సరైన పద్ధతియేనా? అన్నది ప్రస్తుతం న్యాయమూర్తులు సంధించిన ప్రశ్న. ఒక మతం వారి గాయపడిన మనోభావాలకు ఉపశమనం కలిగిస్తామని ‘్ఫలానా’ రాజకీయ పార్టీ హామీ ఇవ్వడం మతం పేరుతో వోట్లు వేయమని కోరినట్టేనా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు! ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత రాజ్యాంగ కోవిదులది!
‘సెక్యులరిజమ్’ అన్న పదం మనకు బ్రిటన్ దురాక్రమణదారులు ప్రసాదించి వెళ్లిన భాషాజాలంలో భాగం! పాశ్చాత్య దేశాల, భారతదేశానికి పడమట నెలకొన్న దేశాల మతోన్మాద చరిత్ర. ఆ దేశాలలో ప్రధానంగా ఐరోపాలో సెక్యులరిజమ్ అన్న పదం పుట్టుకొని రావడానికి కారణం! ఈ అన్ని దేశాలలో దాదాపు ఒకే మతం శతాబ్దుల కాలంలో స్థిరపడడం ఒక వైపరీత్యం! మతాధిపతులు ‘పరిపాలన’లోను, ‘రాజ్యాంగ వ్యవహారాల’లోను జోక్యం చేసుకోవడం రెండవ వైపరీత్యం! అందువల్ల మతాధిపతులు మతేతర వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని నిరోధించడానికి ఆయా దేశాలలో ఉద్యమాలు జరిగాయి. మత- రిలిజయన్- వ్యవహారాలకు, మతేతర- సెక్యులర్- వ్యవహారాలకు మధ్య సరిహద్దును గీచుకోవలసిన అవసరం ఆ దేశాలలో ఏర్పడింది. మతాధిపతులు మతానికి పరిమితం కావాలని, రాజ్యాంగ, పరిపాలన వ్యవహారాలలో తలదూర్చరాదని నిర్దేశించడానికి ఐరోపాలో ఈ ‘సెక్యులరిజమ్’ అన్న పదం వాడారు. పశ్చిమాసియాలో ‘ఖలీఫా’- మతాధిపతి- రాజ్యాధికారం చెలాయించరాదన్న ఉద్యమం కూడా జరిగింది. అందువల్ల మతానికి, ఇతరానికి మధ్య ‘రేఖ’ ఏర్పడింది! అనేక మతాలు సమాంతరంగా ఒకే దేశంలో ఒకే జాతిగా కొనసాగడం ఐరోపాకు, పశ్చిమాసియాకు తెలియని వ్యవస్థ! ఒక దేశంలో ఒకటే మతం ఏర్పడింది. మరో మతం ఎదురైనపుడు రెండు మతాల మధ్య భయంకరమైన ఘర్షణ జరిగింది, ఒక మతం మిగిలింది. మరో మతం తొలగింది. అందువల్ల సర్వమత సమభావం అన్నది ఈ దేశాల వారికి తెలియని వ్యవహారం.. ఫలితంగా సెక్యులరిజమ్ ఆ దేశాలలో పుట్టుక నుంచీ వక్రీకరణకు గురి అయింది!
కానీ, మన దేశంలో అనాదిగా అనేక మతాలు సమాంతరంగా పరిఢవిల్లాయి. ‘సమన్వయం’ ఈ దేశపు సంస్కృతికి, జాతీయతకు సహజమైన ప్రాతిపదిక అయింది. అసంఖ్యాక దేవతలందరినీ సమానంగా ఆరాధించి, అర్చించే ‘సనాతన’- శాశ్వత- మతం ఈ దేశపు ప్రధాన మతం. దీనికి వేదవాజ్మయం ప్రాతిపదిక. కానీ, వేద వాజ్మయం ప్రాతిపదికగానే పరిమిత సంఖ్యలోని దేవతలను ఆరాధించి అర్చించే శైవ, వైష్ణవ, శాక్తసౌర, గాణాపత్య, స్కాంద మతాలు సమాంతరంగా పరిఢవిల్లాయి. వేద ప్రామాణికతను నిరాకరించిన బౌద్ధ, జైన మతాలు వచ్చాయి. ఆధునిక కాలంలో విదేశాల నుంచి యూదు, పారసీ, క్రైస్తవ, ఇస్లాంలు మన దేశంలోకి వ్యాపించాయి. సిక్కు, ఆర్యసమాజం మతాలు పుట్టాయి. అందువల్ల ఈ మన జాతీయత అనాదిగా సర్వమత సంపుటం, సర్వమత సమభావం! ఇది ‘్భరత జాతీయత’ లేదా ‘హైందవ జాతీయత’...