సబ్ ఫీచర్

పెద్దలకు పట్టని పిల్లల సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కని భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన సర్కారీ బాల సదనాలు, శిశు విహారాలు పాలకుల, అధికారుల అలసత్వం కారణంగా నేడు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఈ సదనాలు, విహారాల్లో శిశు సంక్షేమం సంగతి దేవుడెరుగు! ఇవి నానాటికీ శిశువుల పాలిట నరక కూపాలుగా మారాయి. ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’ (ఐసిడిఎస్) అధికారుల చిత్తశుద్ది లోపం కారణంగా పలుచోట్ల శిశు విహారాలు, బాల సదనాల్లో అవినీతి కార్యకలాపాలు, అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో ఈ తరహా వ్యవహారం వెలుగు చూసినప్పటికీ శిశు సంక్షేమ అధికారుల వైఖరిలో మార్పు కానరావడం లేదు. కరీంనగర్ ప్రభుత్వ శిశుగృహంలోని అనాథ పిల్లల చేతులపై వాతలుపెట్టి అక్కడి సిబ్బంది క్రూరంగా వ్యవహరించిన సంఘటనపై ప్రభుత్వం ఇప్పటికీ సమగ్ర విచారణ జరిపించలేదు. అనాథ బాలలను క్రమశిక్షణతో పెంచి, వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే అమానవీయంగా ప్రవర్తించారు. పిల్లలు అల్లరి చేశారనే సాకుతో వారి చేతులపై శిశుగృహం సిబ్బంది వాతలు పెట్టిన ఘటన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాత తాలూకా కేంద్రాల్లో సుమారు 300 శిశుగృహాలు, బాల సదనాలను సంబంధిత ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ‘నేటి బాల బాలికలే రేపటి పౌరులు’ అనే నినాదాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తగినంత పర్యవేక్షణ లేనందున ప్రభుత్వ సిబ్బంది కూడా వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. అనాథ బాలలపై జాలి చూపించి వారికి అండగా నిలవడానికి బదులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం. వీటిలో కొన్ని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు తమ బాధలను చెప్పుకొనే పరిస్థితి లేకపోవడంతో బాలసదనాల్లో అవినీతి, అకృత్యాలు చాలావరకూ బహిర్గతం కావడం లేదు.
ప్రభుత్వ శిశు సదనాల్లో అనాథ పిల్లలకు పౌష్టికాహారం పెట్టి, వారి సంరక్షణ బాధ్యతలను ఐసిడిఎస్ ఉద్యోగులు చూసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి రెండు పూటలా భోజనం పెట్టాల్సి ఉంది. అయితే, చాలా చోట్ల పులుసు, పప్పుచారు, కారం ఎక్కువ వేసిన వంటలను మొక్కుబడిగా పెడుతున్నారు. ప్రభుత్వం ఏటా దండిగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ‘అక్రమార్కులు’ అనాథ పిల్లల పొట్ట కొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల బా గోగులను అనునిత్యం చూసుకుంటూ, వారికి ప్రేమను అందించటం లో కొంతమంది ఆ యాలు, మేనేజర్లు, సామాజిక కార్యకర్తలు వైఫల్యం చెందుతున్నారు. క్రమశిక్షణ ద్వా రా పిల్లల అలవాట్లలో మార్పు తేవాలి. వారు అల్లరి చేయకుండా కౌనె్సలింగ్ ఇవ్వాలి. కానీ, ఏ బాలసదనంలో నూ ఇటువంటి దాఖలాలు కనిపించడం లేదు. చాలావరకూ శిశువిహారాలు, బాలసదనాలు అద్దెకొంపల్లో అసౌకర్యాలతో కొనసాగుతున్నాయి. శిశువిహారాలకు ఎక్కడా శాశ్వత భవనాలు నిర్మించలేదు. జిల్లా కలెక్టర్లు, ఇతర పర్యవేక్షణాధికారులు శిశువిహారాలను ఆకస్మిక తనిఖీలు చేసిన సంఘటనలు చాలా తక్కువ. శిశువిహార్‌ల్లో కారం, ఉప్పు ఎక్కువ వేసిన అన్నం పెడుతున్నారని కరీంనగర్‌లో ఇటీవల ఓ రాజకీయ పార్టీ నాయకులు జరిపిన ఆకస్మిక తనిఖీలో బట్టబయలు అయ్యింది. శిశుగృహాలను సర్వాంగ సుందరంగా నిర్మించటానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. శిశువిహార్‌లలో పనిచేస్తున్న ఆయాలు, మేనేజర్‌లు, సామాజిక కార్యకర్తలు, ఇతర సిబ్బందికి తరచూ శిక్షణ తరగతులు నిర్వహించాలి. శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నందున విధి నిర్వహణలో వారు అలసత్వం చూపే అవకాశం ఉంది. గనుక వీరిని మూడేళ్లకు ఓసారైనా బదిలీలు చేస్తుండాలి. శిశు సదనాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇరవై నాలుగు గంటలూ పర్యవేక్షణ ఉండేలా తగినంత మంది సిబ్బందిని నియమించాలి. ఆరోపణలపై సస్పెండ్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించినపుడే శిశు సదనాలు సజావుగా నడుస్తాయి. మిగతా ప్రభుత్వ శాఖలవలే సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్)లోనూ అవినీతి, అలసత్వం పెచ్చుమీరుతున్నందున వీటి నిర్వహణకు నిజాయితీపరులైన అధికారులను నియమించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని శిశుగృహాలను ఆనంద నిలయాలుగా మార్చాలి.

-రావుల రాజేశం