సబ్ ఫీచర్

స్వీయ లోపాలను సరిదిద్దుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య అనేక వ్యాసాలలో ఉత్తరాలలో హిందూ మతం నశించిపోవటానికి ఆ మతంలోని లౌకిక వాదులతో సహా ఇతర మతాల ప్రచారం, ప్రలోభాలూ కారణమనీ అనేక మంది తమ ఆవేదనని వ్యక్తం చేశారు. అవన్నీ చదివినప్పుడూ చదువుతున్నపుడూ నన్ను వేసుకున్న ప్రశ్న, ‘దీనికి నిజంగా కారణమెవర’ని. ‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటూ ధర్మప్రచారకులూ, పండితులూ నిరంతరం ప్రజలకి బోధించడానికి శ్రమపడుతున్నారు. ఏ సనాతన ధర్మాన్ని ఋగ్వేద కాలపు ధర్మాన్ని, ఆ తర్వాత అనుసరించిన ధర్మాన్ని దేన్ని పునరుద్ధరించాలన్నది నా ప్రశ్న.
హిందూ మతంలో విడదీయరాని, లేని అంశం- కుల (వర్ణ) వ్యవస్థ. ఋగ్వేద కాలంలో వృత్తులను అనుసరించి ఏర్పడిన ఈ వ్యవస్థ. బలవంతులైన స్వార్థపరులవల్ల కులాల మధ్య అడ్డుగోడలు ఏర్పడటానికి కారణమైంది. ఈ 21వ శతాబ్దంలో ఆ అడ్డుగోడలు తొలగిపోవడానికి బదులు మరింత బలపడుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రసంగాలూ, ఛాందసవాదుల ప్రలాపనలూ కులాల మధ్య విద్వేషాలని మరింత రెచ్చగొడుతున్నాయి. హిందూ ధర్మాన్ని నిజంగా ఉద్ధరించాలనుకొంటే ఛాందసవాదులని అరికట్టండి. ఇప్పటికీ కొన్ని కులాల వారిని దేవాలయాల్లోకి అనుమతించడం లేదన్నది చదివి. హిందూ మతంలో ఉన్నది ఇదా అని హేళన చేస్తే ఉడికిపోవడమెందుకు? అవమానానికీ, అవహేళనకీ గురైనవారు, ఎవరైనా చేరదీస్తే, ఆర్థిక సహాయం చేస్తే వారి మతానే్న అంగీకరిస్తారు. మతం సమానత్వాన్నీ, సహనాన్నీ, ఆర్థిక ఆలంబననీ అందించనపుడు వేరే మతాన్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయమిచ్చిన మతాన్ని కాదు తిట్టవలసింది, ఆశ్రయం కల్పించలేని మతాన్ని.
ఇక హిందూ మతం స్ర్తిలని ఎంతగా అవమానించిందో, అవహేళన చేసిందో చెప్పనవసరం లేదు. సతీ సహగమనం, బాల్య వివాహం, కన్యాశుల్కం- అనాదినుంచీ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు స్ర్తిని పూజిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూనే మరొక వైపు రాజకీయ నాయకులతో సహా, ఈ సనాతన వాదులూ, అభ్యుదయవాదులూ అవకాశం దొరికితే చాలు స్ర్తిల గురించి వక్రభాష్యాలూ, వంకర మాటలూ, స్ర్తిలు గీతదాటితే... అంటూ సుభాషితాలూ. ముందు తమ మతంలోని ఛాందస భావాలనీ, మూర్ఖపు ఆచారాలనీ, అసమానతనీ తొలగించుకోవడం మంచిది. ఇతర మతాల దాడులకంటే స్వమతంలోని లోపాలవల్లహిందూమతం అవహేళనకి గురవుతూందని గ్రహిస్తే మంచిది. హిందూమతం కంటే, మరికొన్ని మతాలు ఇంకా మూర్ఖంగా, అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించే ముందు, ఆ మతాలలోని అమానుషత్వాన్నీ, మత విద్వేష భావాలనీ మనకి తెలియకుండానే అనుసరిస్తున్నామేమో ఆలోచించండి.
ఇదంతా చదివి మరేదో మతానికి చెందిన దాన్ని కాబట్టి, హిందూ మతాన్ని దుయ్యబడుతున్నానే అభిప్రాయం రావచ్చు. స్వమతాభిమానం వల్లనే- నా మతం, అవహేళనలకీ, అవమానాలకీ, మూర్ఖత్వానికీ గురికాకూడదన్నదే నా అభిప్రాయమని తెలియచేస్తున్నాను. సమాజాన్నీ, దేశాన్నీ ప్రేమించే వారికి ఆ వ్యవస్థలలో చీడపురుగుల్లా ప్రవేశిస్తున్న అనాచారాలని ప్రశ్నించే అధికారం ఉంటుంది. ముందు మనమతంలోని లోపాలను సరి చేసుకోవాలి. ప్రశ్నించేవారు ఉన్నప్పుడే లోపాలు సరిదిద్దబడతాయ. లోపాలు క్రమంగా ఎప్పుడైతే కనుమరుగవుతాయో అప్పుడే ఉత్తమమైన మార్గదర్శిగా మతం భాసిల్లుతుంది. ఇది కేవలం ఏ ఒక్కమతానికో చెందినది కాదు. అన్ని మతాలకు వర్తించే సత్యం. ప్రతి మతం తనలోని లోపాలను సరిచేసుకుంటే, మానవాళి ఉత్తమంగా రూపొందుతుంది.

- మహీధర సుగుణ