సబ్ ఫీచర్

ఉద్యోగాల్లో మహిళల ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అది ఇది ఏలన.. అన్ని రంగముల..’ అన్నట్టు ఆధునిక మహిళలు సత్తా చాటుతున్నారు. దేశంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు సాధించేవారిలో పురుషుల కన్నా మహిళలే పైచేయి సాధిస్తారని తాజా సర్వే తేల్చిచెప్పింది. గడచిన రెండేళ్లుగా భారతీయుల్లో ఉద్యోగాలు పొందుతున్నవారి శాతం గణనీయంగా పెరుగుతున్నదని, వారిలో అతివలకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయని ఆ సర్వే స్పష్టం చేసింది. ‘ఇండియా స్కిల్స్’ అనే సంస్థ 2014లో దేశంలో ఉద్యోగాల తీరుతెన్నులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. గడచిన నాలుగేళ్లకు సంబంధించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత సర్వే చేసింది. 2014 అంచనాల ప్రకారం ఉద్యోగాలు సాధించగలిగిన విద్యార్థుల శాతం 33.9 శాతం నుంచి 40.4 శాతానికి పెరిగింది. ఉద్యోగాల కల్పన శాతం గతేడాది 37.2 శాతం ఉంటే, ఈ ఏడాది 38.1 శాతానికి పెరిగింది. దాదాపుగా 41 శాతం మంది మహిళలు ఉద్యోగాలు పొందగలుగుతున్నారని, పురుషులు 40 శాతం మంది మాత్రమే అవకాశాలు దక్కించుకుంటున్నారని తేలింది.
దేశంలో ఉద్యోగాలు సాధిస్తున్నవారి సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబంగ, తమిళనాడు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, ఉద్యోగార్థులు పనిచేసేందుకు ఇష్టపడుతున్న నగరాల్లో బెంగళూరు, పూణె మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. పీపుల్ స్ట్రాంగ్, కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, లింక్‌డ్‌ఇన్, యుఎన్‌డిపి, వీబాక్స్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్, ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి.
జూలై 15 నుంచి అక్టోబర్ 30 మధ్య ఉద్యోగాల కల్పనకు సంబంధించిన పరీక్షలు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించారు. దాదాపు 5.2 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైనారు. ఇంగ్లీషు, గణితం, కొత్త విషయాలు నేర్చుకోగలగడం, సునిశిత పరిశీలన, ఆలోచన, వ్యక్తిత్వం, నైపుణ్యం, చొరవ, నేర్పు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హ్యుమానిటీస్, ఐటిఐ తదితర విద్యార్హతలున్నవారు ఈ పరీక్షలకు హాజరైనారు. వారిలో ఇంజనీరింగ్, ఎంబిఎ, పాలిటెక్నిక్ చేసినవారి ఎక్కువగా ఉద్యోగాలు పొందగలిగారు. ‘్భరత ఆర్థిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దశలో ఉద్యోగాల సృష్టి మొదలైంది. నైపుణ్యం ఉన్నవారికి ఇపుడు పుష్కలంగా అవకాశాలు వరిస్తున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగాలంటే ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి’ అని వీబాక్స్ సిఇఒ నిర్మల్ సింగ్ అంటున్నారు.
ఉద్యోగార్థుల నైపుణ్యాలను అంచనా వేయడంలో ‘వీబాక్స్’కు ప్రత్యేకస్థానం ఉంది. దేశవ్యాప్తంగా 11 ప్రధాన ఉద్యోగ కల్పనా రంగాల్లో కీలకమైన 125 సంస్థల ఉద్యోగావసరాల ఆధారంగా సర్వే నిర్వహించారు. ‘హైరింగ్’ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించే విధానంలో కూడా పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 7 నుంచి 10 శాతం మేర ‘హైరింగ్ సెంటిమెంట్’ నమోదైంది. వీబాక్స్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి తరువాత గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఆశాజనకంగానే ఉంటుంది.

-కృష్ణతేజ