సబ్ ఫీచర్

ఏ విధ్యార్థిలో ఏ ప్రతిభ ఉందో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడి చిత్తశుద్ధికి నిజమైన ప రీక్ష- ఒక్కొక్క విద్యార్థిలో దాగివున్న ప్రతిభను చూడగలిగిన శక్తి కలిగి వుండాలి. అదే ఆ ఉపాధ్యాయుడి నైపుణ్యానికి అసలు పరీక్ష. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది అందరిలో ఒకే రకంగా ఉండదు. చేపకు నీళ్లల్లో ఈదే శక్తి, పక్షిలో ఎగిరే శక్తి, కోయిలలో రాగం ఆలపించే శక్తి ఉంటుంది. ఏ విద్యార్థీ ఉపాధ్యాయుడి వద్దకు వచ్చి తనకీశక్తి ఉందని చెప్పడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చూపించిన శ్రద్ధ ఆ విద్యార్థిలో అంతర్గతమైన ప్రతిభను చూడటానికై శక్తి వస్తుంది. ఆ శక్తి ఎంతటిదో, అతనికి ఏ పని అప్పగిస్తే సమర్ధవంతంగా చేయగలుగుతాడో ఉపాధ్యాయునికి తెలుస్తుంది.
ఉపాధ్యాయుడు పిల్లలకు పనిచ్చి హాయిగా కుర్చీలో కూర్చుంటే విద్యార్థిలో ఉన్న శక్తి కనపడదు. ప్రతి విద్యార్థినీ స్వయంగా పరిశీలించాలి. ఆ విద్యార్థితో సంభాషించాలి. ఇంటరాక్ట్ కావాలి. అప్పుడు ఆ పిల్లల్లో దాగివున్న ప్రతిభ అంకురాలు కనిపిస్తాయి. దాని ఎదుగుదలకు కావల్సిన అవకాశాలను ఉపాధ్యాయులు సృష్టించాలి. అలా అవకాశాలు కల్గించేటప్పుడు ఎవరికి ఏ పని ఇస్తున్నాం ? ఎవరికి ఏ పనిని చేయించేందుకు పురమాయిస్తున్నాం? అని విశే్లషించుకుంటూ విద్యార్థిలో దాగివున్న ప్రతిభను గమనంలోకి తీసుకోవాలి. చేపను ఎగరమంటే ఎగురుతుందా? పక్షులు నీళ్లల్లో మునిగి ఈదగలుగుతాయా? ఇచ్చే పని విద్యార్థి ప్రతిభకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోవలసి ఉంటుంది. విద్యార్థులందరికీ ఉపాధ్యాయుడు ఒకే రకమైన పని అప్పగించడు. ఇదే ఉపాధ్యాయునికి పెద్ద పరీక్ష.
ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏ దీక్షతో పనిచేస్తాడో ఆ దీక్షే ఆ అతడికి మూడో నేత్రాన్ని ప్రసాదిస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థిలోని లోతుపాతులు గమనించగలగాలి. ఏ విద్యార్థి నుంచి ఏమి ఆశించాలో అన్నది ఉపాధ్యాయుడు గమనించాలి. తరగతి గది అన్నది ఒక సామూహిక ప్రక్రియ. సంబంధిత విద్యార్థి దగ్గరకు ఉపాధ్యాయుడు వెళ్లగానే సమష్టిలో నుంచి వ్యక్తిగత ప్రతిభను వేరుచేసి చూడటం, దానికి అనుగుణమైన పనిని ఉపాధ్యాయులకు అప్పగించటం, ఇది ఉపాధ్యాయునికున్న విశేషమైన అధికారం. అప్పుడే వైవిధ్యాల నుంచి ఏకత్వం వస్తుంది.

-చుక్కా రామయ్య