సబ్ ఫీచర్

‘సహస్రాబ్ది లక్ష్యాలు’ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని రంగాల్లో ఇప్పటికే మంచి ప్రగతిని సాధించినా, పేదల కనీస అవసరాలను తీర్చడంలో మాత్రం విఫలమయ్యాయి. ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉండగా, ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి- మన ప్రణాళికల ప్రాధాన్యతలు సరిగా లేకపోవడం. రెండు-ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోవడం. నేతలు ఎంత గొప్పగా చెబుతున్నా ప్రజలు సుపరిపాలనకు నోచుకోలేదు. మన దేశంలో ఇంకా కోట్లాది మందికి విద్య, వైద్యం అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి 2000 సెప్టెంబర్‌లో 191 దేశాల ప్రతినిధుల సమక్షంలో ఎనిమిది ‘సహస్రాబ్ది లక్ష్యాల’ను ప్రకటించింది. వీటిని 2015 నాటికి సాధించాలి. ఈ లక్ష్యాలు దారిద్య్ర నిర్మూలనకు, సార్వత్రిక ప్రాథమిక విద్యకు, లింగ సమానత్వానికి, శిశు మరణాల తగ్గింపునకు, తల్లుల ఆరోగ్య పరిరక్షణకు, హెచ్‌ఐవి-ఎయిడ్స్, మలేరియా తదితర వ్యాధుల నిరోధానికీ, పర్యావరణ పరిరక్షణకు, అభివృద్ధి సాధనలో వివిధ దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలకు సంబంధించినవి. ఈ ఎనిమిది లక్ష్యాలను సాధించడంలో భారతదేశం సాధించింది తక్కువేనని చెప్పాలి.
మన దేశంలో పేదరికం తగ్గిందని అంటున్నా జనాభాలో సుమారు 22 శాతం మంది ఇంకా దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. ప్రపంచంలోని పేదలలో నాలుగోవంతు మంది భారత్‌లోనే వున్నారు. పేదరికం సమస్య కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతమై వుంది. సార్వత్రిక విద్య విషయంలో మనం కొంత ప్రగతిని సాధించినా, నాణ్యమైన విద్యను సమకూర్చుకోలేక పోయాం. విద్యారంగంలో విలువలను పూ ర్తిగా నిర్లక్ష్యం చేశాం. నైపుణ్యతను పెంచడంలో వెనుకబడి వున్నాం. అనేక రాష్ట్రాల్లో లింగ వివక్ష కొనసాగుతూనే వుంది. జనాభాలో స్ర్తి,పురుష నిష్పత్తి ప్రమాదకరంగా మారింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. చాలామంది బాలికలు విద్యకు, ఆరోగ్యానికి దూరంగా వున్నారు. మహిళా సాధికారిత విషయంలో కొంత ప్రగతి సాధించాం. శిశుమరణాల రేటు కొంత తగ్గినా ఇంకా ప్రమాదకరంగానే వుంది. ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 42 కంటే తక్కువగా వుండాలని ఐరాస లక్ష్యం. బాలింతల మరణాలను తగ్గించడంలో కాస్త ప్రగతి వుంది. లక్ష ప్రసవాలకు బాలింతల మరణాలను 103కి తగ్గించాలని ఐరాస నిర్దేశించింది. హెచ్‌ఐవి-ఎయిడ్స్, మలేరియా తదితర వ్యాధులను నియంత్రించడంలో మన దేశం సంతృప్తికరమైన ప్రగతినే సాధించింది. ప్రస్తుతం వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత ప్రమాదస్థాయికి చేరాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్యం విషయంలో మన దేశం ఇంకా వెనకబడి వుంది. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ఈ పరిస్థితిని రాబోయే కాలంలో మార్చవచ్చు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచడంలో మన దేశం వెనకబడి వుంది.
ఐరాస లక్ష్యాలను సాధించేందుకు ఏం చేయాలి? మన ప్రణాళికల్లో ప్రాధాన్యతలు మారాలి. విద్య, వైద్య రంగాలకు తగినన్ని నిధులు సమకూర్చాలి. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేయాలి. పేదల కనీస అవసరాలను తీర్చడంలో సమాజం బాధ్యత కూడా వుంది. స్వచ్ఛంద సంస్థల సేవలను ఉపయోగించుకోవాలి. ఆర్థికాభివృద్ధి, సాంఘిక న్యాయం సాధించడంలో సుపరిపాలనకు కీలక పాత్ర వుంది.

-ఇమ్మానేని సత్యసుందరం