తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఉద్దండ కవిత్వ పిండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటి శుక్రవారం హైదరాబాదు విశ్వవిద్యాలయం హిందీ శాఖ 3‘వేణుగోపాల్‌కి కావ్య-చేతన’2 అం శంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నాను. విన్న విషయాల వల్ల మతిపోయింది. అక్కడ చర్చించిన విషయాలు, శనివారం సదస్సు ముగింపు సమావేశంలో నేను మాట్లాడబోయే విషయాలు కలిపి మీతో పంచుకోవాలని ఉత్సుకతతో రాస్తున్న ముచ్చట్లు ఇవి.
వేణుగోపాల్‌శర్మ హిందీ సాహిత్య దిగ్గజం. ము ఖ్యంగా కవిత్వంలో అత్యంత సుప్రసిద్ధ కవి. అతను హైదరాబాదు వాస్తవ్యుడు. కిషన్‌బాగ్‌లోని ఒక ఆలయ పూజారి కుటుంబంలో డెబ్బైనాలుగేళ్ళ కింద జన్మించాడు. అతను మరణించి ఎనిమిదేళ్ళయ్యింది. ఏ విశ్వవిద్యాలయంలోనైతే ఉద్యోగం నిరాకరించారో అదేచోట అతని సాహిత్యంపై రెండు రోజుల సదస్సు ఏర్పాటైంది. ఒక వక్త అన్నట్లు విద్యాత్మికరంగం ప్రాయశ్చిత్తంగా ఏర్పాటుచేసిన సదస్సు. అదేశాఖలో సుమారు మూడేండ్లు పార్ట్‌టైం అధ్యాపకునిగా పనిచేసిన వాడిపై మరణించిన ఎనిమిదేళ్ళ తర్వాత ముప్పై మంది వక్తలతో సదస్సు జరపడం విచిత్రం. అతడి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. కాబట్టే అప్పటికప్పుడు ఈ నాలుగు మాటలు.
వేణుగోపాల్ నాకు పరిచయం. చాలాసార్లు కలిశాం. నా ఆత్మీయ మిత్రులు చాలామందికి వేణు అత్యంత ఆత్మీయుడు. ప్రొ.షరీఫ్, ఎంటీ ఖాన్, సూర్యవంశి, నిఖిలేశ్వర్ వంటి వారికి మరీ దగ్గరివాడు. ఐతే వేణు జీవితం ఒడిదుడుకుల మయం. కాని, సాహిత్య జీవితం అ త్యంత సాఫల్యం. ఉత్తర భారతదేశం నుండి వచ్చిన సుప్రసిద్ధ పరిశోధకులు, రచయితలు వేణు మా గురువుగారని గర్వంగా పదే పదే చెప్పుకుంటుంటే విచిత్రం అనిపించింది. అతని జీవితం గురించి మాట్లాడిన ప్రతివారి నుండి, మాకు చాలా తెలుసు అనుకున్నవారు కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పడం విశేషం. తెలుగులో అలాంటి కవికి ఉదాహరణగా ఎవరిని పోల్చాలా అని ఆలోచిస్తే ఏమీ తోచడం లేదు. ఆయన జీవన విస్తృతిని శ్రీశ్రీతో పోల్చవచ్చు. కాని శ్రీశ్రీ బతుకులో తానే స్వయంగా రాసుకున్న బలహీనతల చిట్టా తెలిసిన వాడిగా పోల్చలేకపోతున్నాను. తెలుగు కవిత్వంలో అత్యంత శక్తిసంపన్నుడైన శివసాగర్‌తో వేణు కవిత్వాన్ని పోల్చవచ్చు. కాని వ్యక్తిత్వాన్ని కాదు. శివసాగర్‌కన్నా ముందుగా కవిత్వాన్ని విప్లవీకరించాడు వేణు.
3వసంతమేఘ గర్జన2అని దేన్నయితే అంటున్నామో, ఆ భారతీయ విప్లవాన్ని నక్సల్బరీ అని పేర్కొంటామో, ఆ విప్లవ ఉద్యమం మొదటి రోజుల్లో సంబంధాలున్న వ్యక్తి. తెలంగాణ నేలపై నుండి అరుణ స్వరాన్ని దేశవ్యాప్తంగా వినిపించాడు. ఉద్యమ గర్జనని అక్షరాలలో వెనువెంటనే ప్రతిఫలించిన వారిలో వేణు తొట్టతొలుత కవి. చాలామంది వక్తలు ఈ విషయాన్ని పేర్కొనడం చూస్తే ఆశ్చర్యపడక మానం. మొత్తం హిందీ సాహిత్యంలో కూడా ఈ కోవలో అతనే మొదటి వాడిగా విమర్శకులు గుర్తిస్తారు. తెలుగులో విప్లవ కవిత్వం తొలినాళ్ళలో నినాదప్రాయంగా వచ్చిందని అంటారు. ఐతే దానికి భిన్నంగా వాస్తవ విప్లవ భావుకతతో, కవిత్వ విలువలు ఎక్కడా చెడకుండా రాసిన మొదటి హిందీ కవి హైదరాబాదీనే.
నక్సల్‌బరీ ఉద్యమగర్జన ఆదిలాబాదులోని కాగజ్‌నగర్‌లో ప్రతిధ్వనించింది. రాజాదూబే, వేణు ఇద్దరు కాగితం మిల్లు, కార్మికనగరం అని పిలవబడే కాగజ్‌నగర్‌లోని బిర్లా కంపెనీ నడిపే స్కూల్‌లో పంతుళ్ళుగా పనిచేయడానికి వెళ్ళారు. వందల మైళ్ళకావలి బెంగాల్ లోని మెరుపుల తళుకులు వారి రాకతో ఇక్కడ ప్రతిధ్వనించాయి. అక్కడి ఆలోచనలకు ఒక చిన్న రిసీవర్ ఇక్కడ తయారైంది. అంతే. తరగతి గదుల్లో చదువుకునే విద్యార్థులు కలం పట్టి కవితలు రాయడం మొదలుపెట్టారు. ఆ కవితల్ని లిఖిత మాస పత్రికలో వేశారు. వేణు కలం ఆ వెలుతురు కణాల్ని సిరాగా మలిచి చీకటి నుదుటి మీద ఎర్రని కాంతులు చేసింది. హైస్కూలు విద్యార్థులపై లాఠీ పడింది. కొత్తగా వచ్చిన టీచర్లపై అరెస్టువారెంటు వెలువడింది. ఆగ్రహం చెందిన కరాలు కొన్ని బూర్జువా విగ్రహాల పునాదుల్ని కదిలించాయి. అంతే.
వేణు హైదరాబాదు చేరినా, అక్కడ అరెస్టుకాక తప్పలేదు. జైలుశిక్ష అనుభవించాడు. పూజారి తల్లిదండ్రులు విస్తుపోయారు. సంప్రదాయ కుటుంబం విప్లవ రాజకీయాలతో వణికిపోయింది. ఐనా వేణు భయపడలేదు. తన పాళీని మరింత సానపెట్టాడు. కలంలో జన రాజకీయ పోరాటాలను దట్టించాడు. నల్లసిరా ఆవిరైంది. కొత్త సూర్యోదయకాంతి అందులో చేరిపోయింది. వచనం శక్తిమంతమైన మాధ్యమం అయ్యింది. కొత్త వామపక్ష భావాలు అత్యంత ఆధునిక వస్తుశైలులు అయ్యాయి. మనిషిని నిర్వచించడం, చరిత్రని పరీక్షకు గురిచేసి చూడ్డం, రాజకీయ నిస్సారతని అధిగమించడం, ఎన్నడూ లేని విధంగా మనిషికి మనిషి మధ్య లింకు కలిపి ముందుకు తరలించడం కవితా వస్తువయ్యంది.
వచన కవిత సంభాషణ స్వరంగా వేణునాదమైంది. పాఠకుడు ఉలిక్కిపడేట్లుగా అతడిని కవిత్వంలో సంబోధించాడు. తెలుగు కవిత్వంలో లాగా బోధించే లక్షణం లేదు. చిలకపలుకులు లేవు. పాఠకుడికి పాఠ్యంలో సగ/ సహ భాగస్వామిని చేసి వెన్నుతట్టాడు. కవిత్వంలో వేగం, హాస్యం, వ్యంగ్యం జొప్పించి వినడానికి, చదవడానికి, చదివి ఆలోచించడానికి అనువుగా ఒక చక్కని సాదాసీదా శైలిని పొందించాడు. రోజూ చూసే వస్తువులతో కవిత్వ సాంద్రత మీద పండించిన తీరు అద్భుతం అని పెద్ద పెద్ద విమర్శకులు మెచ్చుకున్నారు. తెలుగులో అలాంటి ఒక్క కవి పుట్టినా విప్లవ కవితని నినాద కవిత్వమనే బ్రాండు పడకుండా తప్పించుకునేది.
వేణు కవే కాదు. గొప్ప ఉపాధ్యాయుడు. నాటక కర్త. అతనిలో బ్రాహ్మణ ఆధిక్య భావన ఏ రూపంలోనూ కనబడేది కాదు. అతడినే ఆ ప్రశ్న అడిగినప్పుడు ఇలా చెప్పాడు.. మేం మార్వాడి పూజారులం. తరాలుగా హార తి పట్టి నాలుగు డబ్బులు సంపాదించుకునే వాళ్ళం. తెలంగాణలో ఇతర గ్రామ కరణాలు, బ్రాహ్మణ అధికార గణం లాగా ప్రజలను పీడించలేదు. అధికారం కోసం జరిగే ప్రతి సంఘటనలో ప్రతిఘటనలో పాలక కుల పక్షాల కొమ్ముకాయలేదు. అట్టడుగు వర్గాల వారిని, బలహీనులని దోపిడి చేస్తుంటే దొంగ కరణీకాలు నెరపలేదు. అందుకే కింది వర్గాల వారంటే మా కుటుంబాలలో శత్రుత్వం లేదు అని కుండబద్దలు కొట్టాడు. అందుకేనేమో తన కెరీర్‌కోసం ఏనాడూ ప్రయత్నాలు చేయలేదు. జీవితమంతా ప్రతిపక్షంగానే ఉన్నాడు. అతనొక శక్తిగా మారాడు. అందుకనే అతడిని చాలామంది ప్రేమిస్తారు.
భోపాల్‌లో హిందీ ఎమ్మే చేశాడు. అవథ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. అక్కడ ఉన్న తక్కువ కాలంలోనే అనేక రచనలు చేసి విజయకేతనం ఎగరేసి తిరిగి హైదరాబాదు వచ్చాడు. పేదరికాన్ని ఏనాడు తలవంపు అనుకోలేదు. ఒక్క గదిలో పది మంది స్నేహితులు, శిష్యులు, అనుచరులతో హాయిగా గడిపిన ప్రజాతంత్ర కవి. పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో కేంటీన్లని, చెట్లకింద ప్రదేశాలను, బస్టాండ్లని తరగతి గదుల్ని చేశాడని అతని శిష్యులు చెబుతుంటే మన విప్లవ పిలక పంతుళ్ళ అదలింపు చప్పుళ్ళతో పోల్చిచూడక తప్పదు. అతడు ఎన్నడూ పిల్లలతో, పెద్దలతో వాదులాడలేదు. ఏకముఖ వాదన స్థానంలోనే చర్చ, సంభాషణ, ముచ్చట వంటి రీతులలో సంవదించాడు. అందుకే అతను తయారుచేసిన ప్రగతిశీల రచయితలు లెక్కలేనంత మంది. తెలుగులో సాహిత్య నేత అనగానే అహంకారులు మన కళ్ళకు కనబడతారు. అహంభావులు గోచరిస్తారు. వేణు స్వేచ్ఛా ప్రకటనకి మారుపేరు. అందుకే ఇంకా తొణికిసలాడే ప్రేమ, ఆప్యాయతలు సాహిత్యకారులందిరిలో కనబడతాయి.
వేణు కథకుడు, పరిశోధకుడు. మార్క్సిసు.్ట సౌందర్య శాస్త్రం మీద పిహెచ్.డి చేశాడు. అత్యున్నత డిగ్రీ ఉన్నా అతనికి విశ్వవిద్యాలయాలు ఉద్యోగం ఇవ్వడానికి జడిసాయి. ఇలాంటి ఒక విప్లవ కవికి ఉద్యోగం ఇస్తే అవి బూర్జువా సంస్థలు కాకుండా పోతాయి. అందుకే నాకు స్థానం లభించలేదని అంటాడు. ఏమాత్రం ద్వంద్వ నీతి, నటనలు లేని మంచి మనిషి. ఆర్థికంగా చిదికిపోయి, కాలు తీసివేయబడి, కేన్సర్‌తో బాధపడినా జీవితంతో పోరాడాడు. జీవితం గెలిచిందా లేదా అని కాదు. ఆ సంఘర్షణలో ఏ సందర్భంలోను, ఎన్ని ఆటుపోట్లలోను మానవీయతని మరవలేదు. గొప్ప సాహిత్యాన్ని సృష్టించి మనకోసం వదిలివెళ్ళాడు. మనం అతనికి ఏం చేయగలిగాం అనే ప్రశ్నని వేసుకోవలసిందే. కాని అటు దిశగా ఆలోచన చేయనివ్వకుండా తన కవిత్వానే్న చూడమని చెప్పి పోయాడు. వేణుల వంటి ఉద్దండుల ప్రసక్తి ఏనాడూ తీసుకురాకుండా ప్రగతిశీల రంగం కాలర్ ఎగరేయడం చూస్తుంటే ఎవరు ఏమని అనగలరు?
తాజాకలం:
ముగింపు సభ ఇప్పుడే ముగిసింది. వేణు హిందీ కవితల్ని తెలుగులో వేయాలని నిర్ణయంచాం. అలా ముగింపు సభ ఒక ఆరంభానికి తెరతీసింది. వేణు మరోసారి కవిత్వంలోంచి పునర్జీవించే పరిస్థితి ఏర్ప డింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులలో హిందీశాఖ అధిపతి ప్రొఫెసర్ సర్రాజు, సదస్సు సంచాలకులు డా. ఆత్మారాం గారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాం!
*