మిర్చిమసాలా

ఇక హోదా ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంపై కొన్ని నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆడంబరంగా జీవిస్తారని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ నిజం. ప్రజలు ఆడంబరంగా జీవించే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే సమస్య. ముఖ్య మంత్రి చంద్రబాబు కూడా కృష్ణా, గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరగని రీతిలో అద్భుతంగా, ఆడంబరంగా నిర్వహించారు. దాదాపు రూ.1,600 కోట్లను పుష్కరాలకు ఖర్చుపెట్టారట! ఎపి జనం దేశంలో ఏ రాష్ట్రాలకు వెళ్లిన రిచ్‌గా కాలక్షేపం చేస్తారనే టాక్ కూడా ఉంది. ఆంధ్ర ప్రజలు మంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల అమరావతిలో చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ప్రత్యేక హోదాపై ఆశ వదులుకోవడం మంచిది. -శైలేంద్ర

అసెంబ్లీ అంటేనే హడల్!
ఎపి శాసనసభ శీతాకాల సమావేశాలను డిసెంబర్‌లో ఆరు నూరైనా.. వెలగపూడిలోని నవ్యాంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలోనే నిర్వహించాలని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన దగ్గరుండి మరీ తాత్కాలిక శాసనసభ, శాసన మండలి భవనాల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సచివాలయం ఇప్పటికే పూర్తిగా తరలివచ్చింది. దీంతో తెలంగాణ సిఎం కెసిఆర్ అక్కడి సచివాలయ భవ నాలను తమకు అప్పగించాలంటూ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎస్ నరసింహన్ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో- ఎపిలో ఒక్కసారి శాసనసభ సమావేశాలు జరిగితే చాలు, అక్కడి భవనాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల విలువైన క్వార్టర్లనూ వెంటనే తమకు అప్పగించమని కెసిఆర్ ఎక్కడ పట్టుబడతారోనని ఎపి నేతలంతా భయపడుతున్నారట! కాగా, వీరెవరికీ హైదరాబాద్‌లో అధికారికంగా పనులేవీ లేకపోయినా- వారి బంగళాలను ఎంచక్కా నేతలు అనుభవిస్తున్నారు కదా!
- నిమ్మరాజు చలపతిరావు

లేనోడే గొప్పోడు..!
500 నోట్లు, 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత తొలుత సంతోషించిన వారు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలే. తమకు తగినంత సంపద లేదని అనునిత్యం బాధపడే భారతీయులు- తమ చేతుల్లో మొదటిసారి డబ్బు లేనందుకు సంతోషపడ్డారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చిల్లర కోసం దిల్లీలో ఎటిఎం వద్ద లైన్లో నిల్చున్నారనో, బాలీవుడ్ భామ బిపాసా బసు కోడిగుడ్ల కోసం అప్పు తీసుకుందనో వార్తలు విన్న ప్రజలకు తొలి సారి తమలో తాము తెగ సంతోష పడిపోయారు. నిజంగా.. లేనోడే గొప్పోడు కదా..- అనుకుంటూ తెగ తృప్తిపడుతున్నారు.
-బివి ప్రసాద్

‘గాలి’ శుభలేఖ చూశాకే..
శ్రీకాకుళం‚జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఆలస్యంగా రావడంతో మంత్రుల మధ్య- పెద్దనోట్ల రద్దుపై రసవత్తరమైన చర్చ సాగింది. గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం సందర్భాం బళ్లారి వెళ్లి రావడంతో తాను ఇక్కడికి ఆలస్యంగా చేరుకున్నానని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత సహచర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లతో అన్నారు. గాలి జనార్దన రెడ్డి ఇంట పెళ్లి వాయిదా పడిందట? అని విప్ రవికుమార్ ఆమెను ఆరా తీశారు. పెళ్లి వాయదా పడిందని సునీత అన్నారు. ఇదే సమయంలో- ‘గాలి’ వారి పెళ్లి శుభలేఖను చూసిన వెంటనే ప్రధాన మోదీ పెద్దనోట్లు రద్దు చేశారని ఓ జిల్లా అధికారి మాట జారారు. అక్కడే ఉన్న మంత్రి అచ్చెన్న- ‘ పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు, సంపన్నులు బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సివస్తున్నద’ని అన్నారు.
-వురిటి శ్రీనివాస్

కిడ్నాప్‌లు ఉండవేమో?
సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలను కిడ్నాప్ చేసి లక్షలు, కోట్లు డిమాండ్ చేసే కిడ్నాపర్ల నోళ్లలోనూ పెద్దనోట్ల రద్దుతో మట్టికొటినట్టు అయింది. ఒకవిధంగా పెద్ద నోట్ల రద్దు వల్ల కిడ్నాప్‌లు తగ్గే అవకాశం లేకపోలేదు. గతంలో అయితే నల్లధనం కోట్లకు కోట్లకు పేరుకుపోయిన వారు తమ పిల్లలను కాపా డుకునేందుకు కిడ్నాపర్లు కోరినంత ఇవ్వడానికి వెనుకాడే వారు కాదు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం నిలువలు తరిగి పోనుండటంతో ఇక నుంచి కిడ్నాపర్లు కట్టలకు కట్టలకు డబ్బు కాకుండా- కిలోల చొప్పున బంగారు డిమాండ్ చేస్తారేమో చూడాలి మరి..!
-వెల్జాల చంద్రశేఖర్