ఉత్తరాయణం

కుహనా రాజకీయాలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనిదివరలో హంపీ దర్శించడం జరిగింది. అక్కడ రాయలవారి కోటను, అనేక భవనాలను పూర్వపు ముస్లిం రాజులు ధ్వంసం చేసిన శిథిలాలు కళ్ళారా చూసాను. అక్కడ ఇప్పటికీ పోలీసు పికెటింగ్‌లోనే పరిసరాలు నడుస్తున్నాయి. ఆ ముస్లి రాజులకు తీసిపోయిన వాడు కాదీ టిప్పుసుల్తాన్. కర్నాటక ప్రభుత్వం కుహనా రాజకీయాలకు స్వస్తిచెప్పకపోతే ప్రజలే భవిష్యత్తులో వారికి గుణపాఠం చెపుతారని గమనించాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
ఏది స్థానికం?
తరతరాల వాసులం
ఉన్నపళంగా రమ్మనడం, పొమ్మనడం
ఆస్తులు, ఉపాధులు వదులుకోం
చదువులకు చేస్తారు చరమగీతం
భాగ్యనగరం స్థానికం
వదులుకోవాలంట ఆంధ్రులం
ఆంధ్రకొస్తే మరల స్థానికం
ఇదేమి రాష్ట్రీయం
ఫైళ్ళకు నిలయం భాగ్యనగరం
విజయునివాడలో పరిపాలనం
అధికారానికి అయోమయం
ప్రజల పాలన అంతంతమాత్రం!!
-సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
అసౌకర్యాల నడుమ నల్లగొండ ఆసుపత్రి
నల్లగొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పలు సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా వుంటూ రోగులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు నెలకొని వున్నాయి. పిల్లులు, కుక్కలు,ఎలుకలు, పందులు ఆసుపత్రిలో యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. అవినీతి విలయ తాండవం చేస్తూ లంచం ఇచ్చేవారికే ముందుగా టెస్టులు చేయడం, ఇన్‌పేషెంట్లకు మంచాలు కేటాయించడం చేస్తున్నారు. అత్యవసర విభాగంలో సిబ్బంది రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఐసియులో పరికరాలు పనిచేయనందున అత్యవసర పరిస్థితిలో కూడా సాధారణ గదుల్లో వుంచేస్తున్నారు.
ఆసుపత్రిలో అపరిశుభ్రతవలన ఇన్‌ఫెక్షన్లు సోకు తూ రోగులకు క్రొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. డాక్టర్లు ఇచ్చే మందుల చీటిలో అధిక భాగం లభించనందునే బయట షాపుల్లో ఎక్కువ మొత్తం ఖర్చుచేసి చెల్లించాల్సి వస్తోంది. దళారులు రోగులను ఆకర్షిస్తూ, డబ్బు ఎంత ఎక్కువగా ఇస్తే అంత త్వరగా డాక్టరు దర్శనం అనుగ్రహించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసారు. ఆస్పత్రి రోగులకు ప్రత్యక్ష నరక కూపంలా మారింది!
- సాహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
మాదక ద్రవ్యాల ముప్పు
ఆధునిక సమాజం పాశ్చాత్య దేశాల నాగరికత, సంస్కృతి సంప్రదాయాలను అనుసరించే వికృత పోకడలో దేశంలో మాదక ద్రవ్యాల ముప్పు మన భారతీయ సమాజాన్ని చాపక్రింద నీరులా ముట్టిడిస్తోంది. ఒకప్పుడు మహానగరాలు, అందునా ధనవంతులకే పరిమితమైన అలనాటి ఈ దురలవాటు కాలక్రమేణా ఒక మోస్తరు నగరాలకు, మధ్యతరగతి యువతకు కూడా సంక్రమిస్తోంది. మత్తుపదార్థాలకు బానిసలైన యువతరం తమ బంగారు జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఆఫ్రికా, పొరుగు దేశాలనుండి పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేయబడుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పిల్లల భవిష్యత్తు దృష్టిలో వుంచుకొని తల్లిదండ్రులు వివరాలను గోప్యంగా వుంచడం మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నంచేసే ఈ మహమ్మారిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
మత విశ్వాసాన్ని గుర్తించాలి
ఆవులు ఉండే చోటును ‘గోష్ఠం’ అంటారు. వాటి సమీపంలో ఉండి ఉత్తమ వాక్యాలు పలకడానే్న ‘గోష్ఠి’ అంటారు. కాని నేడు టి.విల్లో వచ్చే ‘గోష్ఠి’లో మేం గోవులను చంపుకు తింటాం, మా వంటింట్లోకి ఎవరు రాగలరు? అని కొందరు అజ్ఞానంతో అరుస్తున్నారు. నిజానికి ఒక మతం వాళ్ళే ఆవులను చంపడం లేదు. ఇస్లాంలో ఆవు మాంసం దానం చేయమని చెప్పలేదు.