ఉత్తరాయణం

సీట్ల పెంపు అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్య పెంచడం కోస అవసరమైతే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణలు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. పదవీ అవకాశాలు పెరుగు తాయ కాబట్టి రాజకీయ నాయకులకు ఇది శుభవార్త కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజన కారి కాదు. పైగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ఇది ఆశనిపా తం వంటిది. లక్షల్లో ఉన్న ఎమ్మెల్యేల జీత భత్యాలు, వారి కార్యదర్శులు, డ్రయవర్లు, గన్‌మెన్‌లు, వీరందరికీ వసతి సౌకర్యాలు, వాహనాల ఇంధన ఖర్చు తడిసి మోపెడ వుతుంది. ఇది ప్రజలే శాశ్వతంగా మోయాల్సిన ఆర్థిక భారం. సదరు ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే ప్రభుత్వ, ప్రయ వేటు వాహనాలకోసం వాడే ఇధనం ఖర్చు దిగుమతుల పరిమాణం పెంచి, విదేశీ వాణిజ్య లోటుకి కారణమవు తుంది. 1990వ దశకం మొదట్లో పెట్రోలియం కొరత ఏర్పడినప్పుడు అప్పటి రాష్టప్రతి ఆర్. వెంకట్రామన్ విశాఖపట్నం రామకృష్ణ మిషన్ కార్యక్రమంలో ఆ కారణంగానే పాల్గొనకుండా పర్యటన రద్దు చేసుకోవడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
అర్థవంతమైన చర్చలు చేయకుండా..అత్యంత విలువైన సభాసమయాన్ని అనవసర, అప్రధాన్య రాజకీయ ప్రయోజనాలకోసం వృథా చేయడం...నేటి ప్రజాస్వామ్య వాస్తవం. ఇందులో అన్ని పార్టీలూ హెమాహెమీలే. అందుకే సీట్ల సంఖ్యను పెంచడం కన్నా, సమావేశాలు జరిగే రోజుల సంఖ్యను పెంచి..ఆ పెంచిన రోజులనైనా కేవలం చర్చలకే వినియోగించేట్టుగా చట్ట సభల నియమావళిని సవరించుకోవడం కొంతవరకైనా ప్రయోజనకారి కాగలదు.
- బొల్లాప్రగడ, వెంకటపద్మరాజు, విజయవాడ
లైబ్రరీలు ఏవీ?
గ్రంథాలయాలు అంటే అక్షర సంపదల్ని అందించే ఆలయాలు. పోటీ పరీక్షల పరంగా ఆలోచిస్తే..పేద విద్యార్థులకు ఇవి ఎంతో ప్రయోజనకారిగా ఉండాలి. గ్రంథాలయాలు విషయజ్ఞానాన్ని అందిస్తూనే ప్రతి వ్యక్తికీ వ్యక్తిత్వం నేర్పుతాయ. సంస్కారాన్ని పంచుతాయ. పోటీ పరీక్షలకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తాయ. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో గ్రంథాలయాల కొరత ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయనడం అతిశయోక్తి కాదు.
పుస్తకాలు భద్రపరచే గదులు లేవు. అలాగే గ్రంథపాల కులు లేని కళాశాలల్లో ఒక్కో దగ్గర ఒక్కో అధ్యాపకునికి అప్పగించిన సంఘటనలు ఎన్నో. అదే విధంగా శ్రీకాకు ళం జిల్లాలో పలాస జూనియర్ కళాశాలలో గ్రంథాలయ గది ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. ఉన్న పుస్తకాలు అమర్చేందుకు తగిన బీరువాలు కూడా లేవు. మండలకేంద్రమైన కంచిలిలో సిబ్బంది గది, గ్రంథా లయం కలిసే ఉంది. హీర మండలంలో గ్రంథపాలకుడి పోస్టు ఖాళీగా ఉంది. అంతేకాదు బారువా, ఎచ్చెర్ల, జి. సిగడాం, ఇచ్ఛాపురం (బాలికలు), కవిటి, నర్సన్నపేట, ఎల్‌ఎన్‌పేట, పాలకొండ (బాలికలు), సంతకవిటి, సారవకోట కళాశాలల్లో నేటికీ గ్రంథపాలకుల పోస్టులు మంజూరు కాలేదంటే... విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గిపోయంది. సెల్, నెట్‌ల మోజులో ఉన్నారు. గ్రంథాలయాలకు సంబంధించి, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పఠనాసక్తి మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు, ప్రత్యేక రీడింగ్ గదుల అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైన ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి మండలకేంద్రంలోని పాఠశాల, కళాశాల ల్లో గ్రంథాలయాలను ఏర్పాటుకు కృషి చేయాలి.
-ఈవేమన, శ్రీకాకుళం
బస్సులు పునరుద్ధరించాలి
అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట డివిజన్‌లలో రద్దీ బాగా పెరిగింది. అందుకని ఇక్కడ బస్సు సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం 3ఎస్‌ఎస్, 6ఎం, 113కెపిహెచ్‌బి...ఈ మూడు బస్సులు ఈ రూట్లలో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండేవి. మళ్లీ ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలి. ఇవి అన్ని వర్గాల వారికి ఎంతో సదుపాయంగా ఉండే సర్వీసులు. ఇవి లేకపోవడం వల్ల బస్సు కోసం చాలా దూరం నడవాల్సి వస్తున్నది.
- చోడవరపు నాగేశ్వరరావు, బాగ్ అంబర్‌పేట్
కక్షసాధింపు
సుప్రీంకోర్టు లాయరు, యుపిఎ ప్రభుత్వంలో మంత్రి పదవిని వెలగబెట్టిన కపిల్ సిబల్ 2జి కుంభకోణం భళ్లుమనగానే దానివల్ల ప్రభుత్వానికి నష్టమే కలుగలేదు, నష్టం అంతా భాజపా ప్రభుత్వంలో ప్రమోద్ మహాజన్ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందంటూ అతడు చనిపోయా డు కాబట్టి ఆ శాఖ కార్యదర్శి మీద కేసు పెట్టించాడు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టేసి ఆనాటి ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మహానుభావుడు కపిల్ సిబాల్ నేషనల్ హేరాల్డ్ వ్యవహారంలో రాహుల్, సోనియాలు లబ్ది పొందనేలేదని, ఇదంతా మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు అంటున్నాడు. మరి ఇతగాడు పదవిలో ఉన్నప్పుడు పెట్టిన కేసు కక్ష సాధింపు కాదా?
కె. గునే్నశ్, కొవ్వాడ, తూ.గో. జిల్లా
బాధితులకు న్యాయం జరగదా?
ఇటీవల విజయవాడలో ఒక బ్యాంక్ మేనేజర్ భార్యపై అత్యాచారం జరిపి హత్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. అయతే పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చూపెట్టకపోవడంతో కేసును కోర్టు కొట్టేసింది. మరి అసలు నేరస్థులెవరు? బాధితులకు న్యాయం జరగదా?
- తీగల పరమహంస, విజయనగరం