మిర్చిమసాలా

ఆమ్యామ్యాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీత బాధ పీతది అన్నది తెలుగులో బహుళ ప్రచారం పొందిన సామెత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ వారు గత 50 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారట. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం అనంతరం వీరికి బాధలు మొదలయ్యాయట. ప్రతి రోజూ ఠంచనుగా ఉదయం ఆఫీసుకు వచ్చేవారు.. సా యంత్రం ఇంటికి వెళ్లే సమయం వరకు ‘పదో పాతికో’ టేబుల్ కింద నుండి తీసుకుని ఆనందపడేవారు. ఇప్పు డు టేబుల్‌పై నుండి కానీ, కింది నుండి గాని ఇచ్చే నాథుడే లేడని మోదీ చేసిన పనిపట్ల వీరంతా ఆగ్రహంగా ఉన్నారట. అందుకే ఎవరి బాధ వారిది..!
-పి.వి. రమణారావు

కెసిఆర్ పెద్దమనసు
గతంలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలంటే వారం రోజులు జరిగితే గొప్ప. కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొదటి విడత కింద 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా, ప్రజా సమస్యలపై చ ర్చ కు వీలు కల్పిస్తూ మరో ఏడు రో జుల పాటు అ సెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించా రు. దీంతో బిఏసి సమావేశం నిర్వహించి జనవరి మొదటి , రెండు వారాల్లో ఏడు రోజుల పాటు వివిధ సమస్యలపై చర్చించాలని ప్రతిపాదించారు. అసెంబ్లీ సమావేశాలు ఇటీవల కాలంలో 18 రోజుల పాటు నిర్వహించడం రికార్డనే చెప్పవచ్చు. చట్టసభలో అర్థవంతమైన చర్చలు జరగడం లేదని బాధపడే ప్రజాస్వామ్య ప్రియులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయం ఉపశమనం కలిగించింది. నిజంగా కెసిఆర్‌ను ప్రతి ప్రజాస్వామ్య వాది అభినందించాల్సిందే.
-శైలేంద్ర

ఇంట్లో పడుకున్నరంట!
‘నా తెలంగాణ, నా తెలంగాణ బిడ్డలు అంటూ మాట్లాడటం సబబు కాదు. మన తెలంగాణ, మన తెలంగాణ బిడ్డలు అనండి’- అని అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి టిఆర్‌ఎస్‌కు హితవు పలికారు. ‘తెలంగాణ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించగానే ఆంధ్రా ఎమ్మెల్యేలంతా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించగా, కెసిఆర్ మా ఇంటికి పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు తాను ఇంట్లో పడుకొని ఉండగా కెసిఆర్ వచ్చి నిద్ర లేపార’ని జానారెడ్డి వివరించారు. ఆంధ్రా నేతలు రాజీనామాలు చేసినా, తాను ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా ఇంట్లో పడుకొని ఉన్నట్టు జానారెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత అయి ఉండి అలాంటి క్లిష్ట సమయంలో జానా నిద్రపోవడం ఏమిటి? తెలంగాణను తామే ఇచ్చామని డపపు కొఢుతున్న కాంగ్రెస్‌ను కాదని, ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టడానికి కారణం ఇదేనేమో..!
- వెల్జాల చంద్రశేఖర్