సంపాదకీయం

నరేంద్ర ‘నవాజీయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్రమోదీ నవాజ్ షరీఫ్ జన్మదిన మహోత్సవానికి హాజరు కావడం నాటకీయతకు పరాకాష్ఠ. భారత ప్రధానమంత్రి జరిపిన రష్యా పర్యటన ప్రాధాన్యానికి గ్రహణం పట్టించిన ఘటన ఇది. రష్యా రాజధాని మాస్కోలో మన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో గురువారం జరిపిన చర్చల విశేషాలను లాహోర్ విమానాశ్రయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేసిన దృశ్యం మింగేసింది. ‘‘మన ప్రధాని రష్యా పర్యటన ముగింపు సందర్భంగా చోటు చేసుకున్న నాటకీయత ఇదంతా’’ అన్న విశేలషణలు వెలువడడం ప్రారంభం..నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిత్వం ఆవిష్కరించిన అనూహ్య పరిణామాలకు ఇది పరాకాష్ఠ అన్నది విశే్లషణ ప్రహసనంలోని రెండవ ఘట్టం. ఈ సంవత్సరం మొత్తంలో జరిగిన సంచలనాత్మక పరిణామాలకు ఇది తలమానికం వంటిదన్నది విశే్లషణ పర్వంలో కొనసాగింపు. ‘‘్భరత-పాకిస్తాన్ సంబంధాల విచిత్ర చరిత్రలోనే ఇది అప్వూ సంభ్రమాశ్చర్య కారకమైన సంఘటన’’ అన్నది ముక్తాయింపు. అందువల్ల లాహోర్ ఉత్సవం మాస్కో చర్చల ప్రాధాన్యాన్ని మరుగుజ్జుగా మార్చివేసింది. భారత-రష్యాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడం కంటె పాకిస్తాన్ ప్రధాని జన్మదిన సంరంభంలో మన ప్రధాని పాల్గొనడం మోదీ పర్యటనలోని అతి ప్రధానమైన అంశం. నరేంద్ర మోదీ మాస్కో నుండి నేరుగా ఢిల్లీకి తిరిగి వచ్చివుండినట్టయితే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంత ప్రచారం లభించి ఉండేది కాదు. డిసెంబర్ 25న ఈ నవాజ్ షరీఫ్ పుట్టినట్టు మన దేశంలోని సామాన్యులకు తెలిసి ఉండేది కాదు. నవాజ్ షరీఫ్ అని అంటే నయవంచకుడు అని మాత్రమే మనదేశ ప్రజలకు తెలిసిన వాస్తవం. ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 25న మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన ఉత్సవం జరపడం మాత్రమే జనానికి తెలుసు. స్వాతంత్య్ర సమరయోధుడు భారతరత్న మదన మోహన మాలవీయ కూడ ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 25న జన్మించిన సంగతి కొందరికి మాత్రమే తెలుసు. కానీ నరేంద్ర మోదీ ఢిల్లీకి తిరిగి వస్తూ లాహోర్‌లో దిగడంతో నవాజ్ షరీఫ్ పుట్టినరోజు ప్రసిద్ధికెక్కింది..మనదేశంలో! అటల్ బిహారీ వాజ్‌యి లాహోర్‌కు బస్సు యాత్ర చేసినప్పుడు కూడ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని. బస్సుయాత్ర విజయవంతమైనట్టు ప్రధాని వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రభుత్వం వారు మురిసిపోతుండిన సమయంలోనే 1999లో నవాజ్ షరీఫ్ మన కార్గిల్ లోకి కిరాయి గూండాలను, సైనిక బీభత్సకారులను ఉసిగొల్పాడు. నరేంద్ర మోదీ లాహోర్‌లో నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేసిన సందర్భంలో దేశ ప్రజలకు షరీఫ్ గతంలో పొడిచిన వెన్నుపోటు గుర్తుకురావడం సహజం. శివసేన వారు ఈ జ్ఞాపకాన్ని ఆవిష్కరించారు కూడ..నరేంద్ర జాలంలో నవాజ్ షరీఫ్‌లో పరివర్తన వస్తే ఈ నాటకీయతకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. జిహాదీ మతోన్మాదం సర్వమత సమభావంగా పరివర్తన చెందితే అది చరిత్రలో విప్లవాత్మక నూతన అధ్యాయం..జిహాదీ బీభత్సం మాత్రమే ఉభయ దేశాల మధ్య ఏకైక సమస్య...
ఈ పరివర్తనకు అంకురార్పణ జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే దావూద్ ఇబ్రహీంను పట్టి బంధించి మనదేశానికి తరలించాలి. 1993లో ముంబయిలో భయంకర హత్యాకాండను జరిపి పాకిస్తాన్‌కు పారిపోయిన జిహాదీ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం... పరివర్తనకు అంకురార్పణ జరిగితే హఫీజ్ సరుూద్‌ను నవాజ్ షరీఫ్ మనదేశానికి అప్పగించాలి. 2008 నవంబర్‌లో ముంబయిలో జరిగిన బీభత్సకాండకు సూత్రధారుడు జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబాలను నడిపిస్తున్న హఫీజ్ సరుూద్. కానీ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావంలో మార్పు రావడం దాదాపు అసాధ్యం అనడానికి అసంఖ్యాక ఉదాహణలున్నాయి..మచ్చునకొక్క ఉదాహరణ ఇదీ...గత సంవత్సరంగస్టు 18వ తేదీన పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకని..? కశ్మీర్‌లోని దేశ విద్రోహి షబీర్ షా అనేవాడిని మనదేశంలోని పాకిస్తానీ రాయబారి అబ్దుల్ బాసిత్ అనేవాడు అదేరోజున కలుసుకొని చర్చలు జరిపాడు. ఇలా చర్చలు జరపడం మనదేశపు అంతర్గత వ్యవహారాలలో పాకిస్తాన్ తలదూర్చడం...మనదేశ వ్యతిరేకులను ప్రోత్సహించడం. మన ప్రభుత్వ చర్యను మనదేశ ప్రజలు ప్రశంసించారు. ఇలా బీభత్సపు తోడేళ్లను మనదేశం పైకి ఉసిగొలిపే నవాజ్ షరీఫ్ విధానంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పు రాలేదనడానికి ఉదాహరణలు కోకొల్లలు. కానీ మన ప్రభుత్వం మాత్రం జిహాదీ బీభత్స వ్యతిరేక నిష్ఠను సడలించింది. రష్యాలోని ఊఫాలో గత జూలైలో నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్‌తో చర్చించారు. మళ్లీ నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉభయులూ ముచ్చట్లు చెప్పుకున్నారు. విదేశాంగ మంత్రిణి సుషమా స్వరాజ్ ఈనెల 8న పాకిస్తాన్‌కు వెళ్లివచ్చారు. ప్రభుత్వాల మధ్య సమగ్ర చర్చలు జరగడానికి రంగం సిద్ధమైందని 14వ తేదీన సుషమక్క పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించింది. అదే సమయంలో అబ్దుల్ బాసిత్ న్యూఢిల్లీలో మళ్లీ కశ్మీర్‌లోని విచ్ఛిన్న కారులతో చర్చలు జరిపాడు..ఇలా చర్చలు జరిపినందుకు గత ఏడాది ఆగస్టులో నిరసన.. ఇప్పుడు నవాజ్ షరీఫ్‌కు మోదీ ప్రత్యక్ష అభినందన! ఇదేం విధానం? ఇదేమి విజ్ఞత? మోదీ రష్యాలో ఉన్న సమయంలో కూడ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు కశ్మీర్‌లో మన సైనికులపై దాడులు చేశారు..
పాకిస్తాన్ ప్రభుత్వ విధానంలో 1993 నాటి ముంబయి హత్యాకాండ తరువాత ఈ క్షణం వరకు ఇలా ఎలాంటి మార్పు రాలేదు. కానీ మన ప్రభుత్వ విధానంలో మాత్రం సగటున ఏడాదికి రెండుసార్లు మార్పు వస్తోంది. మొదటిదశలో పాకిస్తాన్ ప్రభుత్వం మనదేశ ప్రజలను హత్య చేయించడానికై జిహాదీలను ఉసిగొల్పడం పట్ల గొప్ప నిరసన..ఈ నిరసనలో భాగంగా పాకిస్తాన్‌ను టెర్రరస్ట్ రిజీమ్-బీభత్స ప్రభుత్వ వ్యవస్థ-గా ప్రకటించడానికి ఇతర దేశాల చేత ప్రకటింపజేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నించిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఈ దశలో మళ్లీ చర్చలు, విందులు, కరచాలనాలు, దరహాసాలు! ఇలా ‘పునరపి విరసం, పునరపి సరసం’ లాగా మన ప్రభుత్వ విధానం పునరావృత్తం అయిపోతోంది. ఈ పునరావృత్తి కారణంగా మనదేశం పాకిస్తాన్‌కు తేలికయిపోయింది. ప్రపంచ దేశాలకు మన ప్రభుత్వ విధానం అపహాస్యంగా మారింది. కనీసం ఏడాది పాటైనా బీభత్స పాకిస్తాన్‌ను గట్టిగా ప్రతిఘటించని మన ప్రభుత్వం మాటలను, అవి వాస్తవాలు అయినప్పటికీ, అంతర్జాతీయ సమాజం ఎలా విశ్వసించగలదు? నేరస్థునితో బాధితుడు రాజీపడడం మన విధానానికి మూల సూత్రమా?
అందువల్లనే చైనా, అమెరికా, రష్యా-ఈ మూడు అగ్రరాజ్యాలూ ఇప్పుడు పాకిస్తాన్‌కే ఎక్కువ ప్రాధానం ఇస్తున్నాయి. ఇది మన వ్యూహాత్మక పరాజయం. చరిత్రలో మొదటిసారిగా రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌తో గత ఏడాది నవంబర్‌లో రక్షణ ఒప్పందం కుదుర్చుకొంది. ఇప్పుడు మన ప్రధాని రష్యాలో జరిపిన పర్యటన రష్యాతో మన రక్షణ సహకారం పెరిగి వుండవచ్చు. కానీ రష్యా ప్రభుత్వం గతంలో వలె కాక, పాకిస్తాన్‌నూ మనదేశాన్ని కూడా దాదాపు సమానంగా చూస్తోంది. పాకిస్తాన్ స్వభావంలో వౌలిక పరివర్తన రానంతవరకు ఇలాంటి ‘సంచలనాల’వల్ల ఆర్భాటాల వల్ల లాభం ఏమిటి?