మిర్చిమసాలా

వెంకయ్య పనిలో చంద్రన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్నెళ్లు సావాసం చేస్తే ‘వారు వీరు.. వీరు వారవుతార’ని పెద్దలంటారు. కేంద్ర మంత్రి వెంకయ్య , సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తరచూ చెట్టపట్టాలేసుకొని తిరగటం ఎక్కువైంది. సాధారణంగా ఏ సభలోనైనా ముందుగా సభికులకు క్రమశిక్షణపై వెంకయ్య ‘క్లాస్’ తీసుకుంటారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు వెంకయ్య పాత్రను పోషించి అందర్నీ విస్మయపరచారు. ‘అంతా నిశ్శబ్దంగా వుండాలి.. సెల్‌ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయాలి.. ఫొటోగ్రాఫర్లు నిలబడవద్దు.. వెనుకవారికి కనబడటానికి అందరూ కూర్చోవాలి.. వేదికపై వున్నవారిని పేరుపేరునా వక్తలు ప్రస్తావించవద్దు.. సభకు నమస్కారం అంటే చాలు..’ ఇలా బాబు క్లాస్ తీసుకుంటుంటే అవాక్కవటం వెంకయ్య వంతయింది.
- నిమ్మరాజు చలపతిరావు

సినిమాకు వెళ్లారో..
కాలక్షేపానికి సినిమాకు వెళితే ‘క్లాస్’ పీకుతున్నారేంట్రా బాబూ.. అని అనుకోవద్దు. రోడ్డు భద్రతపై తీసిన లఘు చిత్రాన్ని విధిగా సినీ ప్రేక్షకులు వీక్షించాల్సిందే. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం. రహదారి భద్రతపై జాగ్రత్తలు, నియమ నిబంధనలకు సంబంధించి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సినిమా ప్రదర్శనకు ముందు లఘు చిత్రాన్ని చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని థియేటర్లకూ లఘు చిత్రాలను పంపించారు. దేశంలో ఏటా లక్షా 47 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారట. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఈ సంఖ్య భారీగానే ఉంది. ఆ లఘు చిత్రాన్ని చూసైనా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఎవరికివారు అప్రమత్తం కావాలన్నది తెరాస సర్కారు ఇస్తున్న సందేశం. మంచి చెబితే మనమూ వినాలి కదా!
- ఈశ్వర్ రెడ్డి

విధి నిర్ణయం..!
రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి పాత సంఘటనలు గుర్తుకొస్తే అంతా ‘విధిలీల’ అనుకోక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఇలాంటి విషయానే్న అంతా గుర్తు చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్య ఉప ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించలేదు. అధికార పీఠంపై కుదురుకుంటున్న దశలోనే ఏవో ఆరోపణలు రావడంతో ఆయన హఠాత్తుగా పదవిని కోల్పోయారు. అదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరి టిఆర్‌ఎస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైనా, ఎమ్మెల్సీగా నామినేట్ కావడం , డిప్యూటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి అసెంబ్లీలో వౌనంగా కూర్చోగా, లోక్‌సభలో ఉండాల్సిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా శాసనసభలో కూర్చోవడం.. విధి నిర్ణయం అనాలా? రాజకీయ వైకుంఠపాళి అనాలా? అంటూ అసెంబ్లీ సమావేశాలు చూసిన నేతలు నివ్వెరపోయారు. - బివి ప్రసాద్

వెన్నుపోటు దినోత్సవం!
దివంగత సిఎం ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమా లు జరిగినపుడు టిడిపి నేతలు వి ధిగా ఓ డిమాండ్ వినిపిస్తుంటారు. ఎన్టీఆర్‌కు ‘్భరతరత్న’ పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ గత ఇరవై ఏళ్లుగా క్రమం తప్పకుండా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఈమధ్య మరో కొత్త డిమాండ్ చేరింది. ఎన్టీఆర్ జయంతి, వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత ఏడాది ఈ డిమాండ్ వినిపించే బాధ్యతను ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఆయన పార్టీ మారడంతో ఇపుడు రేవంత్ వంతు వచ్చింది. రేవంత్‌రెడ్డి ఆ మాట అనగానే, ‘సరే.. దాంతోపాటు వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాల’ని నెటిజన్లు సలహాలిస్తున్నారు.
-మురళి
అమరావతికి పోతా..
హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రతిపక్ష నేత జగన్ హైదరాబాద్ వదిలి అమరావతికి వస్తానన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాను సొంతంగా ఇల్లు కట్టుకుని ఉంటానని, ప్రజల సమస్యలపై పోరాడుతానని ఆయన చేసిన ప్రకటనను వైకాపా శ్రేణులు స్వాగతిస్తున్నాయి. ఎపికి సంబంధించి కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, బిజెపి కార్యాలయాలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లాయి. అమరావతి నుంచే ఆ పార్టీలన్నీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర ఏళ్లు గడిచినా వైకాపా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. ఇటీవల పార్టీ కార్యకలాపాలను విజయవాడ, గుంటూరు నుంచి కొంతమేరకు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రకటనతో ఎపిలో తమ పార్టీకి ఇక మంచిరోజులొస్తాయంటూ వైకాపా కార్యకర్తలు సంబరపడుతున్నారు.
- శైలేంద్ర