సబ్ ఫీచర్

మాట..విశ్వసనీయతకు పెట్టనికోట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట్లాడితే మనసేమిటో తెలుస్తుంది తప్ప పోయేదేమీ వుండదు. అవసరం వుంటే తప్ప పెదవి కదపనివారు వౌనమునులుగా చెలామణవుతారా? అవకాశవాదులుగా మిగిలిపోతారా? సందర్భం కాకపోయినా ఏదిపడితే అది మాట్లాడేవారు అధిక ప్రసంగానికి చిరునామాగా వుండిపోతారా? ఒక్కొక్క ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు సైతం మాటల రూపంలోనే వినిపిస్తుంటాయి. యదార్థం ఏదైనప్పటికి ఎవరికి తోచినట్లువారు అర్థం చేసుకునే తీరు ఆక్షేపణీయం కాకపోయినా ఎదుటివారిని వున్న దానికి విరుద్ధంగా చూడటం అభ్యంతరకరమే! మాటల్లో మర్యాదలు ఒలకబోసే వారందరు మర్యాదస్తులుగా చెలామణి కాగోరేవారే తప్ప మర్యాదల పట్ల మర్యాద కలిగిన వారెంతమాత్రం కాదని నిత్యజీవితంలోని ఎనె్నన్నో సంఘటనలు కళ్లకు కడుతుంటాయి. ఈ ధోరణి మారనంతవరకు ఎవరెంత అభినయాన్ని శక్తివంచన లేకుండా చూపగలిగినా జీవితాన్ని చేజేతులా సంతృప్తికి, సంతోషానికి దూరం చేసుకున్నవారవుతారు. అదే సంతృప్తి, అదే సంతోషం ఎదుటివారికి దక్కకుండా చేయడంలో కీలకపాత్ర పోషించిన వారవుతారు.
నరం లేని నాలుక మాట్లాడటం మొదలెడితే ఏదైనా మాట్లాడుతుంది. ఎంతైనా మాట్లాడుతుంది. తాను మాట్లాడేదే జీవితమని సమర్ధించుకుంటుంది తప్ప ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏదిపడితే అది మాట్లాడటం అజ్ఞానానికి సంకేతమని ఎంతమాత్రం అంగీకరించదు. ఎదుటివారు ఎన్ని పనికొచ్చే మాటలు మాట్లాడినా వాటిలో పసలేదన్నట్లు, పనికిమాలిన మాటలెన్నో మాట్లాడుతూ ఎదుటివారిని కించపరచడమే జీవిత ధ్యేయమన్నట్లు కనిపిస్తుంది. కుక్క కాటుకు చెప్పుదెబ్బన్నట్లు ఎదుటివారు గుణపాఠం చెబితే బలవంతంగా వౌనాన్ని ఆశ్రయిస్తుంది. అప్పటికే జరగవలసిన అనర్థాలన్నీ జరిగిపోతాయి. సరిదిద్దుకునేందుకు పెద్దగా అవకాశాలు కనిపించవు. కనిపించినా అంత తేలిగ్గా మారడానికి మనసు మొరాయిస్తుంది. మాటలతో కోటలు కట్టేవారి తీరెలావున్నా మాట సంతోషాల మూట కాకపోయినా ఫర్వాలేదు కాని ఎదుటివారి మనసుల్ని గాయపరిచేది కాకూడదు.
సొమ్ములేనిది జీవితంలో సుఖమెక్కడ? అంటూ ప్రశ్నించేవాళ్లు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లాలన్నా ఏమిచెయ్యాలన్నా సొమ్ముదే కీలకపాత్రగా తేల్చి చెబుతుంటారు. సంకల్పబలం లేని ఆలోచన కాని, మరొకటి గాని అంతగా రాణించవన్న విషయాన్ని ముందుగా గ్రహించలేరు. అసలు ఆ ప్రయత్నమే చెయ్యరు. కార్యదక్షత లేని మాటలు ఎంత సొమ్ముతో కలిసి కదిలినా ప్రయోజనం ఏముంటుంది? చెయ్యగలిగేదే చెప్పాలని, చెప్పింది చెయ్యటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలనుకున్నపుడు మాటలు చేతలుగా చేతలు మరెందరికో స్ఫూర్తిదాయకమవుతుంటాయి.
ఏ ఇద్దరి ఆలోచనలు ఒకటిగా వుండనపుడు వారి మాటలు సైతం ఒకలా వుంటాయని ఎవరూ ఆశించరు. ప్రతి నిత్యం ప్రతి క్షణం కనిపించిన మనిషిని ఏదోఒకటి చెప్పి విసిగించేవారు వేధించేవారు సమాజంలో లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తుంటారు. చెప్పేవారికది కాలక్షేపం కావచ్చుగాని వినేవారికది నసగానే తోస్తుంది. అందుకే తెలివైనవారు మధ్యలోనే ఒకటిరెండు మాటలతో వీలునిబట్టి అవకాశం దొరికినపుడు మరొకసారి కలుద్దామని తప్పించుకుంటారు. వేదికలపై మాట్లాడేవారు సమయంసందర్భం ఏదైనా తమ మాటలతో ప్రేరణ కలిగించడంకన్న విసుగుపుట్టించే ధోరణులే ఎక్కువ- ఏమి చెబుతున్నది ఎందుకు చెబుతున్నది చెప్పేవారిలోనే స్పష్టత లోపిస్తే శ్రోతల పరిస్థితెలా వుంటుంది? ఎన్నికలప్పుడు మాత్రమే దర్శనమిచ్చే నేతాజీల కబుర్లుగాని ముఖ్యంగా హామీలుగాని ఎన్ని అడ్డదారుల్లో వీలైతే అన్ని అడ్డదారుల్లో సభలకు జనాల తరలింపు కాని ఏ ప్రజాస్వామ్య పునాదికి దోహదపడుతుందో, ప్రజాస్వామ్య సౌధాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వుపకరిస్తుందో ఆలోచనాపరులకు ఎంతమాత్రం అర్థంకావడం లేదు. విశ్వసనీయత లోపించిన మాటలుకాని, బలవంతపు ప్రదర్శనలు కాని కొందరిని కొన్నివేళ్లల్లో ఎంతగా మోసగించినా అందరినీ అన్నివేళల్లో ఎంతమాత్రం మోసగించలేవు. అన్నివైపుల నుండి మూటలకే ప్రాధాన్యతిచ్చేవారికి మాట విశ్వసనీయతకు పెట్టనికోటని తెలిసేదెలా?

- డా. కొల్లు రంగారావు