మిర్చిమసాలా

పోలీసుల జాలిగుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఓ గజదొంగ తన పెళ్లి రిసెప్షన్‌కు సహచర దొంగలందరినీ ఆహ్వానించాడు. భారీ ‘సౌండ్ బాక్సు’లతో పాటలు పెట్టించి దొంగలతో కలిసి డాన్సు కూడా చేశాడు. ఇదంతా బహిరంగంగా జరుగుతుంటే స్థానికులు దొంగల సందడి గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, వారిని పట్టుకునేందుకు ఇదే మంచి అవకాశమని చెప్పారట. అందుకు సదరు పోలీసు అధికారి స్పందిస్తూ- ‘పోనీలే పాపం.. ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు అరెస్టు చేయడం బాగుండదు..’ అని అన్నాడట! అదీ పోలీసుల ఉదారగుణం. ఉత్తరాదిన జరిగిన ఈ సంఘటన గురించి తెలిశాక మన పోలీసులు కూడా దొంగలపై జాలి చూపిస్తారా..?
-వి.ఈశ్వర్ రెడ్డి

వెంకయ్యకిది తగునా?
‘అంతా నా ఘనతే’ అని ఏపి సిఎం చంద్రబాబు తరచూ చెప్పుకుంటారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఓ అడుగు ముందుకేసి- ‘నా వల్లే బాబుకు ఇంత బలం’ అని దండోరా వేస్తుంటారు. ‘నేనున్నాను కాబట్టే చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. లేకపోతేనా..’ అంటూ వెంకయ్య తన ఆధిక్యత చాటుకుంటారు. ‘దావోస్‌ను అమరావతికి తీసుకు వస్తా.. ప్రపంచాన్ని అనుసంధానిస్తా..’ అని బాబు ఒకవైపు చెప్పుకుంటుంటే, ‘ఆయన అసలు ధైర్యం నేనే..’ అని వెంకయ్య తన మనోగతాన్ని బహిర్గతం చేస్తుంటారు. ప్రపంచాన్ని అనుసంధానిస్తానని బాబు చెప్పిన ముచ్చట ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే టిడిపి వారు విస్తుపోయేలా వెంకయ్య అసలు సంగతి చెప్పారు. మిత్రపక్షమై ఉండి కూడా వెంకయ్య ఇలా బాబుగారి గాలి తీసేయడం తగునా? - మురళి

చిన్నబాబుకు పెద్దశాఖలు?
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్లు తెలంగాణలో ఒక పథకమో, కార్యక్రమమో చేపడితే చాలు.. దాదాపు అదే దారిలో ఏపిలోనూ ఏవో కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. సిఎం చంద్రబాబు కుమారుడైన లోకేష్‌కు మంత్రి పదవి ఖరారు కావడంతో ఆయనకు ఏ శాఖ ఇస్తారన్న విషయమై అప్పుడే తర్జన భర్జన జరుగుతోంది. తెలంగాణ సిఎం కెసిఆర్ కుమారుడైన కెటిఆర్ మంత్రిపదవి చేపట్టాక ఇప్పుడు కీలకమైన మున్సిపల్, ఐటి శాఖలను చూస్తున్నా రు. దీంతో ‘చిన్నబా బు’కు మున్సిపల్ లేదా ఐటి శాఖ ఇస్తారన్న ప్ర చారం జరుగుతోంది. మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణను మార్చడం ఇష్టం లేకపోతే లోకేష్‌కు ఐటి లేదా విద్యుత్ శాఖ ఇస్తారట! ఇక, లోకేష్ కెటిఆర్‌ను తలపిస్తారో, అంతకు మించి ఉత్సాహం చూపిస్తారో చూడాలని ‘తెలుగు తమ్ముళ్లు’ అంటున్నారు.
- బివి ప్రసాద్

ఈ గోల అక్కడ చేయండి..
ఉద్యోగాల క్రమబద్ధీకరణకు తమ పార్టీ అడ్డుతగులుతోందని కాంట్రాక్టు లెక్చరర్లు ‘గాంధీ భవన్’ వద్ద ఆందోళనకు దిగడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. అధికార పార్టీ బదులు, విపక్ష కాంగ్రెస్ ఇలా తమ ఉద్యోగాలకు అడ్డుపడడం దారుణమని కాంట్రాక్టు లెక్చరర్లు మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో తెరాస ప్రభుత్వం గత హామీలను నిలబెట్టుకోలేదని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలన్నీ దాడికి దిగాయి. అయితే, కాంగ్రెస్ వల్లే నియామకాలు ఆగిపోయాయని కాంట్రాక్టు లెక్చరర్లు ఆరోపించడం విశేషం. కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ మల్లన్నసాగర్ కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ ఆగిపోలేదే! మరి.. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఎందుకు ఆగినట్లో..? ప్రభుత్వంతో పోరాడడానికి బదులు ‘గాంధీ భవన్’పైకి దండయాత్ర ఎం దుకని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

ఇదేం ‘మిత్రధర్మం’?
‘విభజన’తో అన్యాయానికి గురైన ఏపికి సాయం చేయడంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంక య్య నాయుడు నిరంత రం కృషి చేస్తుండగా ఆయనకు త గిన గౌరవం ద క్కడం లేదని ‘కమలనాథులు’ వా పోతున్నారు. మిత్రపక్షమై ఉండి కూడా టిడిపి మం త్రులు ఇలా ప్రవర్తించడం తగునా? అని వారు నిలదీస్తున్నారు. ఏపిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రధాని మోదీ, వెంకయ్య ఫొటోలు ఉండడం లేదన్నది బిజెపి నేతల ఫిర్యాదు. గృహనిర్మాణం, స్మార్ట్‌సిటీలు, స్వచ్ఛ్భారత్ వంటి అనేక పథకాలకు వెంకయ్య నిధులిస్తుండగా పోస్టర్లపై సిఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రుల ఫొటోలే దర్శనమిస్తున్నాయట! ‘కష్టపడుతున్న వెంకయ్యకు గౌరవం ఇదేనా?’ అని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరసన గళం విప్పారు. మిత్రపక్షం కాకున్నా తెలంగాణలో పల్స్ పోలియో పోస్టర్లపై సిఎం కెసిఆర్ సహా ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ఫొటోలు వేస్తున్నారని బిజెపి నేతలు గుర్తుచేస్తున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు