సంపాదకీయం

న్యాయ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిప్పుకు చెదలు పట్టడం అసంభమైన వ్యవహారం. నిప్పు పవిత్రతకు చిహ్నం, అగ్ని పంచభూతాలలో ఒకటి. భారతీయ న్యాయవ్యవస్థ నిప్పు వంటిదన్నది ప్రజల విశ్వాసం. నేరప్రవృత్తిని కాల్చి సామాజిక సౌశీల్యాన్ని నిరంతరం పరిరక్షించి పెంపొందిస్తున్న రాజ్యాంగ విభాగం న్యాయ వ్యవస్థ. న్యాయవ్యవస్థకు ‘అక్రమ ప్రవర్తన’ అన్న చెదలు అంటదు, అంటరాదు. కానీ, గత కొనే్నళ్లుగా ఈ సముత్కర్ష వ్యవస్థలో అక్కడక్కడ ‘చెదలు’ పారాడుతుండడం దృశ్యమానమవుతున్న కఠోర వాస్తవం! ఈ అనుచిత ప్రవర్తనకు సరికొత్త సాక్ష్యం కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ సర్వోన్నత న్యాయస్థానంపై బహిరంగంగా చేస్తున్న తిరుగుబాటు! న్యాయవ్యవస్థను కించపరచడం న్యాయ ధిక్కారం! న్యాయధిక్కారానికి పాల్పడడం ఘోరమైన నేరం. ఇలా న్యాయధిక్కారానికి పాల్పడే నేరస్థులను శిక్షించవలసిన ఉన్నత న్యాయమూర్తి స్వయంగా న్యాయధిక్కారానికి పాల్పడడం దేశ ప్రజలను విస్మయపరస్తున్న విపరిణా మం. న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ క ర్ణన్ మద్రాసు హైకోర్టు నుండి కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యాడు. ఈ బదిలీ వల్ల తనకు ఘోరమైన అన్యాయం జరిగిపోయినట్టు కర్ణన్ చిందులు తొక్కాడు. న్యాయపాలనా సౌలభ్యం కోసం న్యాయమూర్తులను బదిలీ చేయవచ్చునని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. పైగా బదిలీవల్ల ఉన్నత అత్యున్నత పదవులలో ఉన్నవారికి జరిగే అసౌకర్యం లేదు. సామాన్య ఉద్యోగులలో సైతం బదిలీల వల్ల అతి తక్కువమందికి స్వల్పకాలిక అసౌకర్యాలు కలుగవచ్చు. తన బదిలీకి కారణభూతులన్న నెపంతో హైకోర్టు ప్రధానన్యాయమూర్తిని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని పరుష పదజాలంతో కర్ణన్ నిందించడం న్యాయమూర్తుల అనుచిత ప్రవర్తనకు పరాకాష్ఠ. సర్వోన్నత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ కుటుంబ సభ్యులు తమ కోట్ల రూపాయల ఆదాయాన్ని లెక్కలలో చూపలేదని భయపడడం సమాంతర విపరిణామం. గతంలో కలకత్తా ఉన్నత న్యాయమూర్తి సౌమిత్రి సేన్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పి.డి.దినకరన్ అక్రమార్జనకు పాలుపడినట్టు వెలువడిన అభియోగాలు వారిద్దరినీ పదవీచ్యుతులను గావించాయి! వారిద్దరూ అభియోగగ్రస్తులైన వెంటనే పదవులను పరిత్యజించి ఉత్కృష్ట సంప్రదాయాలను నెలకొల్పలేదు. పార్లమెంటు ఉభయ సభలు తమను అభిశంసించడం, రాష్టప్రతి తమను పదవినుంచి తొలగించడం అనివార్యమని స్పష్టమైన తరువాతనే వారు రాజీనామా చేశారు. సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చినప్పటికీ చివరి నిమిషం వరకూ పదవులను వదలిపెట్టని సౌమిత్రి సేన్, పి.డి.దినకరన్ పరోక్షంగా న్యాయధిక్కారానికి పాలపడ్డారు. ఇప్పుడు ప్రత్యక్షంగా బహిరంగంగా న్యాయధిక్కారానికి పాలుపడుతున్నారు.
న్యాయధిక్కారానికి పాల్పడిన కర్ణన్ ఫిబ్రవరి పదమూడవ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో ఉప స్థితుడయి సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిజె.ఎస్.కేహర్, న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అచలమేశ్వర్, రంజన గగోయి, మదన్ బిలోకుర్, పిసి ఘోష్, కురియన్ జోఫెన్ ఈమేరకు ఎనిమిదవ తేదీన నిర్దేశించారు. కర్ణన్ పదమూడవ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో హాజరుకాలేదు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆయన అలా మరోసారి ధిక్కరించాడు. ఏ కారణం చూపకుండా ఇలా హాజరుకాని కర్ణన్‌కు సర్వోన్నత న్యాయస్థాన సప్తసభ్య ధర్మాసనం మళ్లీ గడువునివ్వడం వేరే సంగతి. కానీ పదకొండవ తేదీననే కర్ణన్ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని బహిరంగంగా దుయ్యబట్టాడు. తనపై వచ్చిన న్యాయధిక్కార అభియోగాన్ని విచారిస్తున్న ఏడుగురు సర్వోన్నత న్యాయమూర్తులు అగ్రకులాల వారని, దళితుడనైన తనను వేధించడంలో భాగంగా మాత్రమే ఈ విచారణ జరుగుతోందని కర్ణన్ బహిరంగంగా ప్రకటించాడు! తనను సర్వోన్నత న్యాయస్థానంలో సంజాయిషీ ఇచ్చుకోవాలని సర్వోన్నత న్యాయమూర్తులు నిర్దేశించడం చట్టానికి వ్యతిరేకమన్న విచిత్ర వాదనను సైతం న్యాయమూర్తి కర్ణన్ వినిపించడం మరింత దిగ్భ్రాంతికరం! అనుసూచిత కులాలకు, అనుసూచిత వనజన సముదాయాలకు- షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రయిబ్స్- వ్యతిరేకంగా అత్యాచారాలను జరిపే వారిని శిక్షించడానికి ప్రత్యేక చట్టం ఏర్పడడం సామాజిక సామరస్య పరిరక్షణకు, సామాజిక న్యాయసాధనకు జరుగుతున్న కృషిలో భాగం. కానీ న్యాయమూర్తి కర్ణన్ పాల్పడిన కోర్టు ధిక్కారాన్ని విచారించడం ఈ చట్టానికి ఎలా వ్యతిరేకమన్నది అంతుపట్టని వ్యవహారం. ఒక ఉన్నత న్యాయమూర్తి ఇలా బాహాటంగా కులతత్త్వాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం సిగ్గుచేటైన వ్యవహారం. ఈ అభియోగాన్ని పార్లమెంటుకు నివేదించవలసిందిగా కర్ణన్ ‘సుప్రీం’ న్యాయమూర్తులకు సలహా ఇవ్వడం మరీ విచిత్రం. ఏ చట్టంలోని ఏ నిబంధన కింద, ఏ రా జ్యాంగ అధికరణం కింద ఇలా నివేదించడానికి వీ లుంది?
కర్ణన్‌ను మద్రాసు హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థాన వరణమండలి- సుప్రీంకోర్టు కొలీజియం- రాష్టప్రతికి సలహాఇచ్చింది. కానీ, కర్ణన్ ఈ బదిలీని తాత్కాలికంగా నిలిపివేస్తూ 2016 ఫిబ్రవరి 16వ తేదీన ఉత్తర్వులను జారీచేశాడు. సుప్రీంకోర్టు పరమోన్నత అభికార పరిధికి లోబడి హైకోర్టులు పనిచేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టు ఉత్తరువులను నిలిపివేయడం కర్ణన్‌కు మాత్రమే ‘తెలిసిన’ న్యాయసూత్రం! ఇలా సుప్రీంకోర్టును బాహాటంగా ధిక్కరించిన కర్ణన్‌పై ప్రస్తుతం ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నారు. కలకత్తా కోర్టుకు వెళ్లకుండా ఇన్నాళ్లు మొండికెత్తిన కర్ణన్ ఆ తరువాత రాష్టప్రతి మళ్లీ ఆదేశించటంతో బదిలీకాక తప్పలేదు. కానీ ఆ సందర్భంగా ఆయన న్యాయవ్యవస్థకు, రాజ్యాంగ వ్యవస్థకు కూడ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశాడు. చివరికి మాతృదేశాన్ని నిందించే పతనావస్థకు చేరాడు. ఈ దేశంలో పుట్టడం తన దౌర్భాగ్యమని అందువల్లనే తనకు న్యాయం జరగడం లేదని బహిరంగంగా కర్ణన్ వ్యాఖ్యానించాడు! ఇలా గత ఏడాది బదిలీ జరిగిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించిన కర్ణన్ ఇప్పడు మరోమారు ధిక్కరించాడు. సుప్రీంకోర్టు తనను రమ్మని ఆదేశించడం దళిత వ్యతిరేక చర్య అని ఆయన ప్రకటించడం ఈ రెండవ ధిక్కారం. రాజ్యాంగంలోని 217వ, 124వ అధికరణాల ప్రకారం ఉన్నత, సర్వోన్నత న్యాయమూర్తులను పార్లమెంటు ఉభయ సభలు అభిశంసించడం వల్ల మాత్రమే పదవులనుంచి తొలగించడానికి వీలుంది. ఉభయ సభలు విడివిడిగా మూడింట రెండు వంతులు మెజారిటీలో అభిశంసన తీర్మానాలను ఆమోదించినప్పుడు మాత్రమే రాష్టప్రతి అవినీతి తదితర నేరాలకు పాల్పడిన న్యాయమూర్తులను తొలగించగలడు.
న్యాయమూర్తుల స్వేచ్ఛను, నిష్పక్ష న్యాయపాలనను రక్షించడానికి ఏర్పడిన ఈ జటిల రాజ్యాంగ నిబంధనను దినకరన్, సౌమిత్రి సేన్, కర్ణన్ వంటి న్యాయమూర్తులు దురుపయోగం చేయడం రాజ్యాంగ నిర్మాతలు ఊహించని వైపరీత్యం. తాము స్వయంగా అవినీతికి పాల్పడిన ఉన్నత న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పదవులను అడ్డం పెట్టుకొని అక్రమార్జన చేసిన కుటుంబ స భ్యులు.. న్యాయధిక్కారం చేస్తున్న న్యాయమూర్తులు.. నిప్పుకు చె దలెక్కుతోందా? నిప్పు బొగ్గుగా మారిందా?