ఉత్తరాయణం

దుర్మార్గులకు మరణశిక్షే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యను ఎత్తుకెళ్లిన రావణుని మీదకు దండుగా వెళ్లి, వాడిని, వాడి కొడుకులను చంపి భార్యను తెచ్చుకున్నాడు రాముడు. అది త్రేతాయుగం. తన భార్యను వేధిస్తు న్నాడని తెలిసి కీచకుడిని రహస్యంగా నర్తనశాలకు రప్పించి గుట్టు చప్పుడు కాకుండా చంపి పోయాడు భీముడు. అది ద్వాపర యుగం. మరి ఈ కలియుగంలో ఎందరో మహిళలు కీచకుల బారిన పడి, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేక వేదనతో నలిగిపోతున్నారు. ఇప్పుడు కాల్‌మనీ పేరుతో వేధిస్తున్న వారిని బయటపెట్టినా, కోర్టు కేసులు అంటూ ఏళ్లకు ఏళ్లు గడిపి ఆనక నిర్దోషిగా వదిలేస్తారు. నలుగురు మహిళలు ఆవేదనతో చెప్పిన తర్వాత...నిజాయతీ ఉన్న పోలీసు అధికారి ఎవరైనా అటువంటి దుర్మార్గులను ఎన్‌కౌంటర్ చేసెయ్యాలి. ఇటువంటి దుర్మార్గులను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఒకవేళ అటువంటి వాడికి శిక్షపడినా జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత బాధితులను వదులుతాడా? అటువంటి వారికి మరణశిక్షే ఉత్తమం.
- కె. సరస్వతీ దేవి (టీచర్), నేలకొండపల్లి
తక్షణం చర్యలు తీసుకునే వ్యవస్థ అవసరం
అన్ని చానళ్లూ కాల్‌మనీ గురించే వార్తలు, వార్తా కథనాలు ప్రసారం చేశాయ. మరో ఉపద్రవం జరిగేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాల్‌మనీలో గొప్పోళ్లకు ఒక నీతి, బీదోళ్లకు ఒక నీతి. లక్షలకు లక్షలు మింగినవాళ్లు దర్జాగా అసెంబ్లీలో, పార్లమెంట్‌లో కాలర్ ఎగరేసుకొని మరీ కూర్చుంటున్నారు. అదే కేవలం రూ.20 వేలు లంచం తీసుకున్న మధ్యతరగతి వాడు, ఉద్యోగం పోగొట్టుకొని రోడ్లపై పడుతున్నాడు. అవినీతిపై సిబిఐలు, కమిషన్లు జరిపే విచారణలు కేవలం కాలయాపన కోసమే. బాధితులకు న్యాయం జరగాలంటే, తక్షణం నిర్ణయం తీసుకునే వ్యవస్థ ఉండాలి. అంతేకాని దర్యాప్తు వేగవంతం చేయాలని సుత్తి కబుర్లు చెబుతూ, కేసులను చల్లగా నిర్వీర్యం చేస్తున్నారు. కొన్ని పోయనవి తిరిగి ఇవ్వలేనివి ఉంటాయ. కాల్‌మనీ వ్యవహారంలో కనీసం కొంతమందికైనా న్యాయం జరిగేలా చూడండి.
- చిట్టా లోకపావని, విజయవాడ
చల్లని కబురు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభు త్వం 2014లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ విజయవంతమై దేశం వేగంగా ప్రగతి పథంలో దూసుకొని పోతున్నదన్న స్టాండర్డ్ అండ్ పూర్స్ ఇంటర్నేషనల్ సంస్థ తాజా నివేదిక అశేష భారతావనికి చల్లని కబురు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థిరంగా 7.4 శాతం వున్నా దేశాభివృద్ధి రేటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వరకు పెరగవచ్చునన్న నివేదిక భారత్‌ను అధిక అభివృద్ధి నమోదు చేసే చైనా కంటే మెరుగైన స్థానం ఇవ్వడం శుభపరిణామం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా పేరుపొందిన మనదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మాంద్యాన్ని తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సదరు నివేదిక సూచించింది. జన్‌ధన్ యోజన సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్, మొబైల్ నెంబరును ప్రతీ వినియోగానికి జతపరచడం వంటి చర్యల ద్వారా కేంద్రం వ్యయం చేసే ప్రతి పైసా అర్హులకు చేరి, తద్వార ప్రజాధనం అవినీతి తిమింగలాల పాలు కాకుండా కాపాడవచ్చునన్న ప్రధాని ముందుచూపు సత్ఫలితాలనిచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ఆర్నెల్లుగా ద్రవ్యోల్బణం అదుపు కావడం, కరెంట్ ఖాతాల లోటు కుంచించుకొని పోవడం, కొన్ని వారా లుగా రూపాయ విలువ స్థిరంగా ఉండటం దేశ ఆర్థిక పటిష్టతను సూచిస్తోంది. గత ఐదేళ్లుగా వివిధ కుంభకోణాలతో అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థ అంతటి పతనావస్థ నుండి ఇంత త్వరగా కోలుకుం టుందని ఎవ్వరూ వూహించి ఉండరు. అయతే అధికారం చేపట్టిన మొదటిరోజు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పరి పుష్ఠి చేకూర్చేందుకు చిత్తశుద్ధితో యత్నిస్తున్న మోదీ ప్రభుత్వానికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది.
- సి. సాయ మనస్విత, విజయవాడ
తప్పును కప్పిపుచ్చుకోవద్దు
ఓ అభాగ్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడలో కాల్‌మనీ కలెక్షన్ల గుట్టు, వారి దోపిడీ విధానం, విధివంచితులైన ఆడవారిని కాల్ గరల్స్‌గా తయారు చేసి వారి జీవితాలతో చెలగాటమాడడం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈ దారుణమైన వ్యాపారం విషయం పోలీసులకు, ప్రభు త్వానికి ఈ ఫిర్యాదు ఇచ్చేవరకు తెలియదను కోవాలా? డొంక కదిలింది- బహిర్గతమయంది కాబట్టి ఇందుకు సంబంధించిన వారెంతటివారైనా ఉపేక్షించేది లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం తమ తప్పును కప్పిపుచ్చుకునే యత్నం మాత్రమే. దేశంలో జరిగే ప్రతినేరం గుట్టు చప్పుడు కాకుండా ప్రముఖుల అండదండలతో జరుగు తున్నవి కావా? స్వచ్ఛ్భారత్ అంటే వీధులు వూడవటం కాదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవడం కూడా దీని పరమావధి. ఇందుకోసం కృషి చేయని ఏ ప్రభుత్వ మైనా తన అసమర్ధతను చాటుకున్నట్టే.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
బోగస్ పింఛన్లను ఏరివేయాలి
బోగస్ పింఛన్లను ఏరివేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా అనర్హులను, ఈ ప్రభుత్వం తొలగించింది. తదుపరి ఒత్తిడి రావటంతో మొత్తం పింఛన్లను పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడే అధికారులు అనాలోచితంగా వ్యవహరించారు. పునరుద్ధరణ పేరుతో మంజూరుచేసిన పింఛన్లలో చాలామంది అనర్హులున్నారు. లక్షల మంది అనర్హులు, ఇలాగే పింఛన్లు తీసుకుంటున్నారు.