Others

‘చెంచు’ జాతికి అభయం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అంతరించిపోతున్న ప్రధాన తెగలలో చెంచుజాతి ఒకటని యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రకటించడం ఆవేదన కలిగిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న చెంచులు ఆదిమానవ జాతులకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటుపడ్డ చెంచుల జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48,053. చెంచుల్లో అక్షరాస్యత ఇరవైఐదు శాతం మాత్రమే కావడం గమనార్హం.
కృష్ణానదికి ఇరువైపులా తెలుగు రాష్ట్రాల్లో వీరు విస్తరించి ఉన్నారు. పది పార్లమెంట్ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన వీరి జీవనం నేటికీ దుర్భరంగానే ఉంది. ప్రకృతి వనరులే వీరికి జీవనాధారం. అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో వీరు స్వయం పాలన కూడా సాగించారు. ఆధునిక సమాజం చెంచుల స్వయం పాలనను విచ్ఛిన్నం చేసినప్పుడల్లా పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ఫలితమే కనీసం కొన్ని అభివృద్ధి ఫలాలైనా చెంచుల చెంతకు చేరాయి. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న చెంచులు ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పండుగను నిర్వహిస్తారు. ఈనెల 23 నుండి 26 వరకు పండుగను జరిపేందుకు చెంచు గ్రామాలు ముస్తాబయ్యాయి. సాధారణ ప్రజలు సంవత్సరంలో అనేక పండుగలను జరుపుకుంటూ ఉంటే చెంచులు మాత్రం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఇలా పండుగ జరుపుకుంటారు. చెంచుల పండుగ సందర్భంగా వారి జీవన విధానం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై ఆలోచించడం కనీసం మన బాధ్యత.
1950లో హైదరాబాద్ రాష్ట్రంలో తొమ్మిది తెగలను (చెంచు, అంధ్, భిల్,గోండు, కోలా,కోయ, కొండరెడ్డి, పర్థాన్, తోటి) షెడ్యూల్ తెగలుగా గుర్తించారు. నల్లమలలో నివసిస్తున్న చెంచు తెగ అంతరిస్తోందన్న పరిశోధనా ఫలితాలతో వీరిని కాపాడాలని ప్రభుత్వం 1975 లో నిర్ణయించింది. అనేక ప్రభుత్వాలు వచ్చి వెళ్లిపోయినా, చెంచుప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. పౌష్టికాహారం లేకపోవడం, శుభ్రమైన ఆహారం, సమతుల ఆహారం లేకపోవడం, దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు తదితర కారణాల వల్ల రక్తహీనత, మలేరియా, క్షయ, డయేరియా, వైరల్ ఫీవర్ తదితర రోగాలకు వీరు తరచూ గురవుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్న దాఖలాలు లేవు. ఏడు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలోనూ, రెండున్నరేళ్ల తెలంగాణ రాష్ట్రంలోనూ చెంచులకు ఇ ప్పటి వరకు ఒనగూడిందేమీ లేదు. అటవీ సం పద చెంచుల ద్వారా పట్టణప్రాంతాలకు చేరుతోంది. చెంచుల చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ, ఈ జలాలు సాధారణ జనానికి తాగునీటిగా, సాగునీటిగా, జలవిద్యుత్తుగా మారి ఎంతోమంది అవసరాలను తీ రుస్తున్నాయి. కానీ, చెం చులు మాత్రం తాగేందుకు నేటికీ ‘చెలిమల’ (చిన్న చిన్న గుంటలు తవ్వుకుని వాటిలో చేరే) పైనే ఆధారపడి ఉన్నారు. రాత్రివేళ చీకటితో సహవాసం చేస్తుంటారు. అడవిలో దొరికే గడ్డి, కర్రలతో వేసుకునే గుడిసెలే వీరికి రాజమందిరాలు. మూలికలు, ఆకుల వైద్యమే వీరికి దివ్యౌషధం.
చెంచులను మూడు రకాలుగా చూడవచ్చు. దట్టమైన నల్లమల అటవీప్రాంతంలోని గూడేలలో నివసిస్తున్న వారిని ‘కోర్ ఏరియా’ చెంచులుగా పరిగణించవచ్చు. అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలు, పట్టణాలకు వచ్చి జీవిస్తున్న వారిని మైదాన ప్రాంత చెంచులుగా పేర్కొనవచ్చు. బతుకుతెరువు కోసం దూరప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు వలస చెంచులు. నిజాం సర్కారు హయాంలో ‘చెంచు రిజర్వ్’ అనే ప్ర త్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్ర కారం చెంచులకు ప్రత్యేక సదుపాయాలు వ చ్చా యి. 2006లో పార్లమెం ట్ ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం ‘చెంచు రిజర్వ్’ అమలు కొనసాగించాల్సి ఉంది. 2008 లో భూపంపిణీ చట్టం తెచ్చారు. చెంచులకు పట్టాలు ఇచ్చారు. భూమిని చూపించడం మరిచారు. అక్కడక్కడా దక్కిన పొలాలు భూస్వాములు, వడ్డీవ్యాపారులకు చేరాయి. సొంతంగా భూమి లేకపోవడంతో చెంచులు తమ ప్రాంతంలోనే కూలీలుగా జీవించాల్సి వస్తోంది.
చెంచుల పండుగను తెలంగాణ ప్రభుత్వం అ ధికారికంగా (మేడారం తదితర జాతరల మా దిరి) నిర్వహించాలని నిర్ణయించడం పెద్ద ముందడుగు. మేడారం తరహాలోనే బౌరాపురంలోని బౌరమ్మ (భ్రమరాంబ దేవి) ఆలయాన్ని అలంకరిస్తారు. బౌరాపురం నుం డి ఆరు కిలోమీటర్ల దూ రంలోని అప్పాపురం నుండి ఫిబ్రవరి 23 న ఉత్సవ విగ్రహాలను (మల్లన్న-మల్లికార్జునస్వామి, బౌరమ్మ-భ్రమరాంబిక) భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి కల్యాణం చేస్తారు. శివరాత్రిరోజు వేలాది మంది చెంచులు చేరి , ఉపవాసం పాటించి ఉత్సవాల్లో పాల్గొంటారు. 24 అర్థరాత్రి ప్రకృతికి హారతి ఇస్తారు. 25 న ఉపవాసం విరమించి, బౌరమ్మకు పోసిన వడిబియ్యంతో అన్నం వండి అందరికీ పంచుతారు. ఫిబ్రవరి 25 న బౌరాపురంలోని మైసమ్మ అమ్మవారికి శాంతిపూజ చేస్తారు. తమను చల్లగా కాపాడాలని వేడుకుంటారు. అదేరోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలను తిరిగి అప్పాపూర్‌కు తీసుకువెళతారు. ఇదీ మూడు రోజుల పండగ.
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రోడ్డులో 135 కిలోమీటర్ల వద్ద మన్ననూరు ఉంటుంది. అక్కడి నుండి అటవీప్రాంతంలో 30 కిలోమీటర్ల దూరంలో బౌరాపురం ఉంటుంది. పరిపాలనాపరంగా ఇది నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి పంచాయితీ పరిధిలోకి వస్తుంది. బౌరాపురం చుట్టూ జలపాతాలు, గుహలు, లోయలు, చెరువులు, ప్రకృతి వనరులు ఉన్నాయి.
చెంచులకు చేయూత ఇచ్చేందుకు ‘చెంచులోకం’ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాం. మూడు రోజుల పండగ సందర్భంగా అనేక పోటీలు నిర్వహిస్తున్నాం. మూడు రోజుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు మేధావులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, పరిశోధకులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి శ్రద్ధ చూపితే- చెంచు తెగ అంతరించిపోకుండా కాపాడవచ్చు.

-డాక్టర్ రాంకిషన్, గౌరవాధ్యక్షుడు, ‘చెంచులోకం’