ఉత్తరాయణం

ఇంగ్లీషు మీడియం రద్దు చెయ్యండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగా ఆ దేశంలో పరజాతి ద్వేషం పెరుగుతోంది. అమెరికన్ల జాత్యహంకారం వల్ల మన ఇండియన్లకి అక్కడ తల తిరిగి నోట్లోకొస్తోంది. ఇండియాలో ఇక నుంచీ ‘మమీ డాడీ’ చదువులే కొనసాగుతాయా? ‘యా, యా’ వంటి అమెరికన్ ఉచ్ఛారణలే బతికి బట్టకడతాయా? ‘అడ్డమైన చాకిరీ చేసి అయినా సరే అమెరికాలోనే బతకాలి. అందుకే నేను ఇండియాలో పుట్టాను’- అనే మాటనే ఇకముందు కూడా మన యువత కలలు కంటూ ఉంటుందా? అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో నలుగురు ఇండియన్లు కాల్చివేయబడటంతో ఈ విద్వేషం ఇక్కడితో ఆగుతుందనే నమ్మకం లేదు. ఇప్పటికే కట్టూ, బొట్టూ, జుట్టూ పూర్తిగా మార్చేసుకుని అక్కడే డాలర్ల మోజుతో బతుకుతున్న మన ఇండియా వారు ఇకముందు ఇంకా మారిపోయి ఇంకా జీవచ్ఛవాల్లా బతకాల్సి ఉంటుందేమో? లేదా భారత్‌కు తిరిగి రావటానికి అక్కడ కొనుక్కున్న ఆస్తుల్ని తెగనమ్ముకోవలసి వస్తుందేమో? ఇందుకు ఇష్టమేనా? ఈ పెనుతుపాను మన యువతను ముంచెత్తబోతున్నప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీషు మీడియంలో చదువులు ఎందుకు అంటగట్టాలి?- ‘అంటార్కిటికాలోకో అంతరిక్షంలోకో పోయి బతకండి’ అని చెప్పటానికా ఇంగ్లీషు మీడియం? సరే, అమెరికాలో మనవాళ్లు వాళ్ల తిప్పలు వాళ్లు పడతారు. మన దేశంలోని ప్రభుత్వాలన్నీ ఇంగ్లీషు మీడియంను తుంగలోకి తొక్కక తప్పదు... అస్సాం ప్రభుత్వం 8వ తరగతి వరకూ సంస్కృతాన్ని కంపల్సరీ చేసిందట! యుపిలోని మదరసాల్లో ఉర్దూతోబాటు సంస్కృతాన్నీ, గాయత్రీ మంత్రాన్నీ బోధిస్తున్నారట! అసలా మదరసాల్ని ఇస్లాం నుంచి వేరుచెయ్యటానికే ప్రయత్నాలు జరుగుగతున్నాయట! వీటిల్లో భాగం పంచుకుంటున్న ముస్లిములే ఉత్తరప్రదేశ్‌లో మోదీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారేమో! మన రెండు తెలుగు ప్రభుత్వాలకూ జ్ఞానోదయం అయితే బాగుండును.
-గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు, ఏలూరు
పిఆర్‌సి సిఫార్సుల అమలు ఎపుడు?
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తన మానిఫెస్టోలో పింఛనుదారులకు ఇస్తున్న 15 శాతం క్వాంటమ్ పింఛను 65 ఏళ్లు నిండిన వారికి వర్తింపచేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరం. 10వ వేతన సవరణ సంఘం 70 ఏళ్లు నిండిన వారికి 15శాతం క్వాంటమ్ పింఛను అందజేయమని సిఫార్సు చేసినా దానిని కూడా అమలుచేయడంలో మీనమేషాలు లెక్కించడం తగదు. గత నెలలో విజయవాడలో పింఛనుదారుల సంఘం, నిర్వహించిన 40వ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఈ విషయమై ప్రకటన చేయకపోవడం విచారకరం. ఎంతో ఆశతో ఎదురుచూసిన పింఛనుదారులకు నిరాశే మిగిలింది. ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ సమయంలో తమ ఖాతాలో నిల్వఉన్న ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి సంబంధించి 10వ వేతన సవరణ సంఘం సిఫార్సు చేయగా, ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అందుకు సంబంధించిన ఫైల్ కూడా 2008 నుండి నత్తనడక నడుస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువైనాడు. మానవతా దృక్పథంతో పైరెండు సిఫార్సుల అమలుకు వెంటనే తగు చర్యలు తీసుకొనవలసిందిగా ఏపి సర్కారుకు విజ్ఞప్తి.
- ఆశం సుధాకరరావు, గూడలి

హేవళంబి? హేమలంబి!
తెలుగువారికి మాత్రమే సొంతమైన తెలుగు సంవత్సరముల పేర్లు అర్థవంతమైనవి. ఇవి ‘ప్రభవ’తో అనగా ‘జన్మించుట’తో ప్రారంభమై ‘అక్షయ’ అనగా ‘క్షయము కానిది’తో ముగుస్తాయి. ఈ అరవై సంవత్సర నామములలో 29 మార్చి 2017న వచ్చే తెలుగు సంవత్సరం పేరు ‘హేమలంబి’ అనగా ‘బంగారు తోరణము’ అని అర్థం. చాలామంది దీనిని ‘హేవళంబి’ అని పేర్కొంటున్నారు. ఇది సరికాదు. ‘ళ’ కారము సంస్కృత భాషలో లేదు. ‘హేమలంబి, విలంబీచ, వికారీ, శార్వరీ తథా’ అని శ్లోకము కలదు. కావున ‘హేమలంబి’యే సరైనది.
- సుశర్మ, ప్రధాన కార్యదర్శి,
శ్రీనన్నయ భట్టారక పీఠం, తణుకు