సంపాదకీయం

విచ్ఛిన్న భావాలకు పతాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కాశ్మీర్ ఉన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ ఫలితంగా ఒకే దేశంలో రెండు పతాకాలు అన్న విచ్ఛిన్న సిద్ధాంతానికి బలం చేకూరింది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా మరో జెండా ఏర్పడివుంది. అందువల్ల భారత జాతీయ పతాకంతో పాటు జమ్మూ కాశ్మీరీ పతాకాన్ని కూడ రాజ్యాంగ ప్రక్రియలో భా గం చేయాలన్నది హైకోర్టు ఇచ్చిన తీర్పు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగ నిబంధనలను అమలు జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం సహజమైన పరిణామం...కానీ జమ్మూ కాశ్మీర్‌కు మరో ప్రత్యేక రాజ్యాం గం ఏర్పడి ఉండడం మాత్రం అసహజమైన పరిణామం. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయాదేశం ప్రాతిపదికగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌ను అధ్యక్షుడని, ముఖ్యమంత్రిని ప్రధానమం త్రి అని పిలువడానికి వీలైన రాజ్యాంగ వైపరీత్యం మరోసారి ఏర్పడే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. స్వాతంత్య్ర సమరవీరుడు, మాజీ కేంద్ర మంత్రి భారతీయ జనసంఘం అధినేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1950వ దశకంలో చేసిన బలిదానం ఫలితంగా ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు అన్న వైపరీత్యం 1965లో రద్దయింది. జమ్మూ కాశ్మీర్ రా జ్యాంగంలోని 26వ, 35వ నిబంధనలకు సవరణ జరిగింది. ఈ నిబంధనలను మళ్లీ సవరించి 1965 సంవత్సరానికి పూర్వం వలె అధ్యక్ష, ప్రధానమంత్రులను పునరుద్ధరించాలన్న గొంతెమ్మ కోర్కెలు విచ్ఛిన్నవాదుల గళాలనుంచి వెలువడే ప్రమాదం హైకోర్టు తీర్పువల్ల ఏర్పడింది. ఎందుకంటె రెండు పతాకాలు, రెండు రా జ్యాంగాలు అన్న విచ్ఛిన్న సూ త్రాలతో ఇద్దరు ప్రధానులు అన్న వివాదం కూడ ముడివడి ఉంది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఒకే రాజ్యాం గం ఉంది. అది భారత రాజ్యాంగం..ఒకే పతా కం ఉంది, అది భారత జాతీ య పతాకం. కానీ కాశ్మీర్‌కు మా త్రం మరో రాజ్యాంగం మరో పతాకం ఉండడం ఆ రాష్ట్రానికి లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిలో భాగం. భారత రాజ్యాంగం లోని 370వ అధికరణం ఈ ప్రత్యేక ప్రతిపత్తికి ప్రాతిపదిక. అందువల్ల భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుకానంతవరకు జమ్మూ కాశ్మీర్‌లో రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు రద్దు కావు. ఈ ప్రత్యేకత జమ్మూ కాశ్మీర్‌లో దేశద్రోహ భావాలు బలపడడానికి దోహదం చేసింది. కాశ్మీర్ లోయ ప్రాంతంలో సర్వమత సమభావ వ్యవస్థను ధ్వంసం చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలపైన, రాజ్యాంగ పదవులలో ఉన్నవారు పయనించే వాహనాలమీద జాతీయ పతాకంతో పాటు జమ్మూ కాశ్మీర్ పతాకాన్ని కూడ ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో జారీ చేసిన ఉత్తరువు కందిరీగల తుట్టెను కదిపింది. ఈ రెండు పతాకాల పద్ధతిని భాజపా దశాబ్దులుగా వ్యతిరేకిస్తున్నది. అందువల్ల మూలపడివున్న ఈ విచ్ఛిన్న సంప్రదాయానికి మళ్లీ ప్రాచుర్యం కల్పించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో భాజపా వారు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిడిపి-తో భాగస్వాములుగా ఉన్నారు. భాజపాతో సంప్రదించకుండానే పిడిపికి చెందిన ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సరుూద్ ఈ ప్రభుత్వపుటుత్తరువు-జీవో-ను జారీ చేయించాడు. భాజపా నిరసనతో మళ్లీ జీవోను ఉపసంహరించుకున్నాడు. కానీ జరుగవలసిన నష్టం మాత్రం జరిగిపోయింది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని 144వ నిబంధన ప్రకారం రాష్ట్రానికి పతాకం ఉంది. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలని, ఎర్రని రంగుపై మూడు తెల్లటి చారలు నిలువున ఉండాలని ఈ నిబంధన నిర్దేశిస్తోంది. ఎర్రని పతాకంపై తెల్లని నాగలి గుర్తును కూడ ముద్రించాలని ఈ నిబంధనలో నిర్దేశించారు. 1965లో ఇద్దరు ప్రధానుల వ్యవస్థ రద్దయిపోయిన తరువాత రెండు జెండాలకు ప్రాధాన్యత తగ్గింది. ప్రత్యేక సందర్భాలలో తప్ప నిత్య కృత్యాలలో జమ్మూ కాశ్మీర్ పతాకాన్ని ప్రదర్శించడం తగ్గిపోయింది. మంత్రుల వాహనాలపై కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే ప్రదర్శించారు. మరుగున పడిన ప్రత్యేక ప్రాంతీయ పతాకాన్ని మళ్లీ ప్రదర్శనకు పెట్టడం ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సరుూద్ విచ్ఛిన్న ప్రవృత్తికి నిదర్శనం. జీవో రద్దయినా వివాదం కోర్టుకెక్కింది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఈ పతాకాన్ని స మర్ధిస్తున్నప్పుడు హైకోర్టు భిన్నమైన తీర్పు ఎలా ఇవ్వగలదు?
ముఫ్తి మహమ్మద్ సరుూద్ నేతృత్వంలో పిడిపి రాజ్యాంగ నిబద్ధతను అభినయిస్తున్న విచ్ఛిన్న సంస్థ. 370వ అధికరణం ప్రసాదిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిలో సంతృప్తి చెందని నేషనల్ కాన్ఫరెన్స్ వారు జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కోరుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాల నేతృత్వంలో కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ కంటె విచ్ఛిన్న పథంలో ముందు ఉంటున్న పిడిపి మరింతగా దేశ వ్యతిరేకతను వెళ్లగక్కడం చరిత్ర. పిడిపి జమ్మూ కాశ్మీర్‌కు స్వయం పాలన-సెల్ప్‌రూల్-ను కోరింది. ఈ స్వయంపాలన గురించి మొదట ప్రతిపాదించినవాడు పాకిస్తాన్ మాజీ నియంత పరవేజ్ ముషారఫ్..ముషారఫ్ మాట కాశ్మీర్‌లో పిడిపి నోట పలకడం జనమెరిగిన వాస్తవం. ఈ స్వయం పాలన వల్ల జమ్మూ కాశ్మీర్ మరింతగా దేశానికి దూరంగా జరుగుతుంది. పిడిపి వారు ఈ దేశ వ్యతిరేక సిద్ధాంతాన్ని విడనాడినట్టు ప్రకటించిన సమాచారం లేదు. ఇటువంటి పార్టీతో జాతీయతా నిష్ఠగల భాజపా జట్టుకట్టడమే ఘోరమైన పరిణామం. ఇప్పుడు రెండు పతాకాలు మళ్లీ మొదలు కావడం, ఈ పరిణామ ఫలితం. ముఫ్తి మహమ్మద్ సరుూద్ అతి తెలివిగా భాజపాను వంచించాడు. ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఎవరు సవాలు చేయాలన్న మీమాంస మొదలైంది. భాజపా వారు ముఖ్యమంత్రిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేయించాలి. కాని ఈ ప్రతిపాదనకు ముఫ్తి మహమ్మద్ సరుూద్ అంగీకరిస్తాడా? అన్నది వేచి చూడదగిన వ్యవహారం. ప్రత్యేక ప్రతిపత్తి సృష్టించిన అనేకానేక దేశ వ్యతిరేక పరిణామాలలో పతాక ఘట్టం ఇది.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఫలితంగా 1964లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో 26వ, 35వ నిబంధనలను సవరించారు. 26వ నిబంధనలోని అధ్యక్షుడు, గవర్నర్‌గాను, 35వ నిబంధనలోని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగాను మారారు. అదే సమయంలో 144వ నిబంధనను కూడ సవరించి ఈ ప్రత్యేకమై జెండాను ఎందుకని రద్దు చేయలేదు? 1964 వరకు ప్రధానమంత్రిగా ఉండిన జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ విషయంలో అనుసరించిన విధాన వైపరీత్యాలు ఇందుకు కారణం. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం నిజానికి జవహర్‌లాల్ నెహ్రూ సృష్టి. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో ఈ అధికరణం నిజానికి షేక్ అబ్దుల్లా కుటుంబం వారికి ప్రాధాన్యాన్ని పెంచింది. కాశ్మీర్ కల్లోలగ్రస్తం కావడానికి నెహ్రూ విధానాలే కారణమని కాంగ్రెస్ వారు ముంబయి నుంచి ప్రచురిస్తున్న ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలోనే విమర్శలు ప్రచురితం కావడం సమాంతర పరిణామం. 370వ అధికరణం నుంచి రాజ్యాంగానికి ముక్తి లభించినప్పుడు మాత్రమే కల్లోలం నుండి కాశ్మీర్‌కు విముక్తి...