సంపాదకీయం

‘మత్తు’కు కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహిరంగ మద్యపాన నిషేధం సక్రమ చర్య అని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయగల పరిణామం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన నిర్ణయం. ఐదు నక్షత్రాల హోటళ్లలో తప్ప మిగిలిన హోటళ్లలో కాని, భార్‌లలో కాని మద్యం సరఫరా చేయరాదన్న కేరళ ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదని సమున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం అనుసరించదగింది. వందశాతం అక్షరాస్యత సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కేరళలో మద్యపాన దురాచారం భయంకరంగా విస్తరించడం అంతుపట్టని వ్యవహారం. అక్షరాస్యులైనవారు సంస్కారవంతులై సామాజిక వికృతులను దురాచారాలను దూరం చేయగలగాలి. ఇందుకు విరుద్ధంగా దేశంలోకి మొత్తం మద్యంలో పధ్నాలుగు శాతాన్ని కేరళ ప్రజలే తాగేస్తున్నారట. దేశంలోని జనాభాలో కేరళ రాష్ట్ర ప్రజల సంఖ్య నాలుగుశాతం కంటె తక్కువ. నాలుగు శాతం ప్రజలు సగటున పధ్నాలుగు శాతం మద్యాన్ని తాగేస్తుండడం సర్వోన్నత న్యాయమూర్తులకు సైతం విస్మయం కలిగించిన కఠోర సత్యం. కేరళ ప్రభుత్వ మద్యపానంపై ఆంక్షలు విధించడానికి నేపథ్యం. మద్యం దుకాణాలలో కొని ఇంటికి తీసుకెళ్లి తాగవలసిందే కాని బార్‌లలో, రెస్టారెంట్లలో, హోటళ్లలో కూర్చుని సేవించడానికి వీలు లేదన్నది కేరళ ప్రభుత్వం వారి ఉత్తరువు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం సేవించవచ్చునన్నది కేరళ ప్రభుత్వం విధించిన నిబంధన. ఫలితంగా దాదాపు నాలు గు వందలకు పైగా బార్‌లు మూతపడిపోయాయి. మ ద్యం సరఫరా చేసే హోటళ్ల, రెస్టారెంటుల ఆదాయం తగ్గింది. అందువల్ల ఈ వ్యాపారులు కోర్టుకెక్కడం సహజం. అయితే కేరళ ప్రభుత్వం ఇలా ఆంక్షలను విధించడం రాజ్యాంగంలోని పధ్నాలుగవ అధికరణం నిర్దేశిస్తున్న సమానత్వానికి భంగకరం కాదన్నది సర్వోన్నత ధర్మాసన న్యాయమూర్తులు విక్రమజిత్ సేన్, శివకీర్తి సింగ్ చెప్పిన తీర్పు. అయితే ఐదు నక్షత్రాల హోటళ్లలో సైతం మద్యపానాన్ని ఎందుకని నిషేధించరాదన్న ప్రశ్నకు మాత్రం సర్వోన్నత ధర్మాసనం వారు సరైన వివరణ ఇవ్వలేదు. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసేవారు కేవలం తాగడానికి మాత్రమే అక్కడికి రావడం లేదన్న న్యాయమూర్తుల అభిప్రాయం సమంజసమైంది. కానీ ఐదు నక్షత్రాల హోటళ్లకు వచ్చేవారు బార్‌లకు రెస్టారెంట్లకు వచ్చి తాగేవారికంటె పరిణితి చెందిన వారన్న అభిప్రాయం మాత్రం తర్కబద్ధం కాదు. డబ్బున్న ఘరానాల్లో నేర ప్రవృత్తి కలవారు కూడ ఉన్నారు. ఇలాంటి వారు విలాసవంతమైన హోటళ్లలో చేరి దారుణ నేరాలు చేయరన్న హామీ ఏమీ లేదు. అయితే విహార వినోద యాత్రలవారు ఈ పెద్ద హోటళ్లలోనే బస చేస్తున్నారట. అందువల్లనే ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రం సేవించవచ్చునట. ఈ టూరిస్టులు లేకపోయినట్టయితే ఐదు నక్షత్రాల హోటళ్లలో సైతం మద్యం సరఫరా చేయరాదన్నదే సుప్రీం న్యాయ అభిప్రాయం.
ఈ ఆంక్షల వల్ల మద్యం అమ్మకాలలో కాని తాగుబోతుల సంఖ్య కాని తగ్గే అవకాశం లేదు. ఎందుకంటె తాగుతున్న మద్యంలో డెబ్బయి ఐదుశాతం దుకాణాల ద్వారా అమ్ముడు పోతున్నదట. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పువల్ల ఈ వైపరీత్యంలో మార్పు రాదు. బార్‌లలోను హోటళ్లలోను ఇన్నాళ్లు సేవించిన తాగుబోతులు మాత్రం ఇకపై దుకాణాలలో కొని ఇళ్లకు ఎత్తుకొని పోయి తాగాలి. ఇలాంటి వారు దుకాణాలలో కొన్న మద్యాన్ని హోటళ్ల గదులకు మోసుకొని పోయి అక్కడ తాగే అవకాశం కూడ లేకపోలేదు. ఏమయినప్పటికీ ఇళ్లలో కాక బయట తాగుతున్న వారివల్లనే వివిధ రకాల నేరాలు జరిగిపోతున్నాయి. ఆ నేరాలు మాత్రం ఇప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంది. మద్యం సేవించిన వారు వాహనాలను నడపరాదన్న నిబంధన ఉంది. అయితే బయట రాత్రి పొద్దుపోయే వరకు తప్పతాగిన వారు ఇళ్లకు ఎలా వెళ్లగలుగుతున్నారు? ఇలా తాగుతున్న వారిలో అధికాధికులు తమ వాహనాలను తామే నడుపుకుంటూ ఇళ్లకు చేరుతున్నారు. మార్గమధ్యంలో స్కూటర్లతోను, కార్లతోను గుద్దేసి జనాలను హత్య చేస్తున్నారు, గాయపరుస్తున్నారు. కేరళ ప్రభుత్వం వారి నిర్ణయం వల్ల ఈ నేరాలు తగ్గిపోనున్నాయి. బహిరంగ స్థలాలలో జనాలకు వీరివల్ల ఇప్పటివరకూ జరుగుతున్న అసౌకర్యాలు కూడ తగ్గవచ్చు. తప్పతాగి బస్సులలోకి రైళ్లలోకి చొరబడేవారు అక్కడ భయంకరంగా కక్కి బీభత్సాన్ని సృష్టించే ప్రమాదాలు కూడ తగ్గనున్నాయి. అందువల్ల కేరళ రాష్ట్రం ఆదర్శాన్ని మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ అమలు పరచడానికి పూనుకోవాలి.
కానీ పూనుకుంటున్న జాడలేదు...బిహార్ వంటి చోట్ల ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు జరుపడానికి యత్నిస్తున్నప్పటికీ మిగిలిన చోట్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇతోధికంగా మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మద్యం విక్రయ కేంద్రాలను పాల విక్రయ కేంద్రాలుగా పరివర్తన చేయాలన్న ఆదర్శం కూడ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రభావితం చేయడంలేదు. మద్యపానాన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా సుంకాల రూపంలో లభించే వేలకోట్ల రూపాయలతో ఖజానాలను నింపుకోవాలన్నదే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల విధానం. ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో బార్లలోను, పబ్బులలోను అర్థరాత్రి పనె్నండు గంటల వరకు మద్యం సరఫరా చేయడానికి వీలు కల్పించే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమాంతర విపరిణామం. కేరళలో బార్‌లను మూసివేస్తుండగా మన ప్రభుత్వం ఇలాంటి వైపరీత్యానికి ఒడిగడుతోంది. ఇలా అర్థరాత్రి వరకూ బార్‌లలో విచ్చలవిడిగా తాగేసిన వారు ఇళ్లకు తిరిగి వెడుతూ ఎన్ని ప్రమాదాలు సృష్టించనున్నారో. తాగిన వారు వాహనాలు నడుపరాదన్న నిబంధన, అర్థరాత్రి వరకు బార్‌లను బార్లా తెరచి ఉండడం పరస్పర విరుద్ధాంశాలు. తాగిన ప్రతి ఒక్కరి వెంట తాగని మరొకరు ఉండి వారిని పబ్బులనుండి సురక్షితంగా ఇళ్లకు తీసుకొని పోతున్నారా? అంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త కొత్త బార్లను ఇతర మద్యపాన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బార్లు ప్రస్తుతం 780 ఉండగా జనవరి 1వ తేదీ నుంచి 1100కు పెంచనున్నట్టు నవ్యాంధ్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి‘‘ఈవిధంగా ముందుకు పోవడాన్ని’’ నిరోధించగలవారెవ్వరు?
రాజ్యాంగంలోని 47వ అధికరణం ప్రకారం మద్యపాన నిషేధం జీవన ప్రమాణాలను పెంచడంలో భాగం. ఆరోగ్య కారణాల దృష్ట్యా తప్ప మద్యం తాగడానికి ఎవ్వరినీ అనుమతించరాదన్నది ఈ అధికరణంలోని నిర్దేశం. ఈ అధికరణం మార్గదర్శక సూత్రం-డైరెక్టివ్ ప్రిన్సిపుల్- కాబట్టి అరవై ఐదేళ్లుగా ప్రభుత్వాలు దీన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఈ అధికరణం ప్రకారం దేశమంతటికీ వర్తించే సంపూర్ణ మద్య నిషేధపు చట్టాన్ని పార్లమెంటు రూపొందించవచ్చు..కానీ పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి?