తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మాండలిక భాషలో రాస్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయిన వారం ఓ న్యూస్ చానెల్‌లో ‘దేవులాట’ కార్యక్రమం చర్చాగోష్టికి వెళ్లాను. వార్తలు, ఇతర కార్యక్రమాలన్నీ ప్రజల భాషలోనే ప్రసారం చేయాలని వారి ఆరాటం. అంటే తెలంగాణ మాండలిక భాషలోనే ఉండాలనే ప్రయత్నం. కొందరు రచయితలను, భాషా విభాగంలో పనిచేసిన వారిని పిలిచి భాషారూపం, పదాలు, జాతీయాలు వంటివి ఎలా ఉపయోగించాలనే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలోనే ఫోను మోగింది. ‘నిజామాబాద్ నుండి పంచరెడ్డి లక్ష్మణ మాట్లాడుతున్నాను. నా ‘ఇసిత్రం’ రెండో ముద్రణ కవితా సంకలనం ఆవిష్కరణ సభకి రావాల’ని ఫోను. 1973లో అచ్చయిన మొదటి మాండలిక కవిత్వ సంకలనం అని తెలుసు. ఐతే రోజు రోజుకీ మాండలిక భాషపై ఆలోచనలు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ‘సరే’ అనేశాను. ఆ పక్కకు తిరిగి చూస్తే ‘ఇచ్చింత్రం’ అనే ప్రోగ్రాం టీవీ చానల్ వారు చేస్తున్నారు. చిత్రం అనే పదానికి ‘వి’ ఉపసర్గ చేర్చితే ‘విచిత్రం’ అవుతుంది. దీని అర్థం వింత. చిత్రవిచిత్రాలు అనే పదబంధం కూడా ఉంది. విచిత్రం పదానికి వికృతి ఇసిత్రం. విచిత్రంలోని ‘విచి’ అక్షరాలను ఇచ్చిగా తీసుకుని దానికి తనుస్వారం జోడించి ఇచ్చింత్రం అని పలికే పద్ధతి కూడా ఉందేమో.
మొత్తానికి ఒక్క పదానికి అనేక రూపాలు ఉండడం విచిత్రం. ఒక్కో మాండలిక శబ్దానికి అనేక పర్యాయ శబ్దాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ శబ్దాలు, వాటి ఉచ్ఛారణ భేదాలు మండలాలు, జిల్లాలు, ప్రాంతాలను బట్టి, వృత్తిపనులను బట్టి, పరభాషీయులు తెలుగు పదాలను పలకడాన్ని బట్టి తేడాలు కనుపిస్తాయి. ఈ పదాలు చాలావరకు అంటే తొంభైశాతం నిఘంటువులకి ఎక్కనివే. రాత సాహిత్యానికి దూరమైనవే. ఈ పదాలన్నీ వౌఖికమే. వేలాది ఇలాంటి పదాలు కాలం అనే కాసారంలో కలిసిపోయాయి. చాలా తక్కువ శబ్దాలు మిగిలాయి. ఐతే వీటికి సాహిత్య గౌరవం ఏనాడూ దక్కలేదు. ఒకనాటి సామాజిక అవసరం, గౌరవం ఈనాడు ఇతోధికంగా తగ్గిపోయింది. పొగబండి పదం ఇప్పుడు వాడతామా? రైలుని రైలే అంటాం. ట్రైన్ అని మరో పదం వాడుకలోకి వచ్చింది. చాలాపదాలు అంతరించిపోయాయి. వాటికి ప్రాణం పోయడం సాధ్యమా అనేది ఒక ఆలోచన.
మాండలిక భాష ప్రజల భాష. పండితులు సైతం ఈ భాషలో మాట్లాడాల్సిందే. ఇంటిలో, పరిసరాలలో, సమాజంలోని వివిధ వృత్తులవారితో, బజారులో మాండలికం వినాల్సిందే, మాట్లాడాల్సిందే. ఆనాడు ఒక్క బడి, గుడిలో మాత్రమే సంస్కృత భాష ఎక్కువ. ప్రజల సాంస్కృతిక భాష యావత్తు మాండలికమే. దానికే మరోపేరు దేశీ. అంటే తొంభయి శాతం ప్రజలు వాడే తెలుగు భాష ఇది. ప్రస్తుతం బడి, గుడిలో మాత్రమే కాకుండా ప్రసార ప్రచార మాథ్యమాలు దాదాపుగా మాండలిక తెలుగు భాషని పక్కన పెట్టేశాయి. ఈమధ్య ప్రాంతీయాభిమానం పెరిగింది. ఆ యా భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు, చరిత్ర, సామాజిక జీవన రీతుల పట్ల గౌరవ భా వన కూడా దానితోపాటే హెచ్చింది. ఈ భావాలు సాహిత్యంలో ఎక్కువగా ప్రతిఫలిస్తున్నాయి. భాషా పెత్తందారీ భావనవల్ల భాషాన్యూనత ఆపాదింపబడిన తెలంగాణ తన భాషకోసం పోరాటం చేసి గెలిచింది.
మూడేళ్ళ కాలంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ వైపుగా ఎలాంటి దృష్టి సారించలేదు. అంటే పాలక వర్గాలు ఏ మాత్రం ఆసక్తి కనబరచలేదు. అయినా పౌర సమాజం తెలంగాణ మాండలిక భాషా గౌరవం నిలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. మాండలిక భాషలో దినపత్రిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. సుమారు రెండేళ్ళపాటు హైదరాబాద్ మిర్రర్ అనే దినపత్రికని తీసుకువచ్చారు. ఇప్పుడు విసిక్స్ చానల్‌వారు మొత్తం తెలంగాణ మాండలిక భాషలోనే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద భాషా ప్రయోగం. ఈ నేపథ్యంలో ‘ఇసిత్రం’ పుస్తకావిష్కరణ ఇప్పుడు సావిత్రి, బిత్తిరి సత్తి పాత్రల నోటిలో మాండలికం ఎలా పండిందో, 1970లలో తెలంగాణ మాండలిక కవిత్వం అటు అచ్చులో, కవి సమ్మేళనాలలో నిండిపోయింది. వికసించింది. రాజమండ్రి నుండి రంధి సోమరాజు అనే కవి ‘పొద్దు’ కవితా సంపుటిలో ఉత్తరాంధ్ర మాండలిక భాషకు పట్టం కట్టిన మొదటి అచ్చు సంకలనం. సుమారుగా అదే సమయంలో ఇక్కడ మాండలికంలో సరికొత్త కవిత్వపు పంట మొదలైంది. ఐతే ఆ విధానం అక్కడ ఆగిపోయింది. తెలంగాణలో ఇంకా కొనసాగుతోంది.
నలభై ఏళ్ళు గమ్మునుండి ఒకే ఒక్క పుస్తకంతో వెలుగు వెలిగి, తనకి తాను కవిగా అదృశ్యమైన లక్ష్మణ రెండో రంగ ప్రవేశం బాగున్నది. కేవలం మాండలిక కవితా సంపుటం వెలువరించడం వల్లే పునర్జీవనం లభించిందని అనిపిస్తుంది. దానికీ ఒక కారణం ఉంది.‘ఇసిత్రం’ (1973) తరువాత ఏడాదికి దేవరాజు మహారాజు ‘గుడిసె గుండె’ మొదటిసారి అచ్చయ్యింది. దానిపై (1974) ఆనాడు ఇది తొలి మాండలిక కవితా సంకలనం అని రాయలేదు. కాని అది కూడా తెలంగాణ మాండలికంలో రాసిన కవిత్వమే. ఇటీవల ఆ పుస్తకాన్ని పునర్ముద్రిస్తూ దాని అట్టమీద కొట్టవచ్చినట్టుగా ఆ మాట రాసుకున్నాడు. అందువల్ల నాలుగు దశాబ్దాల నిద్రాణ స్థితిలోంచి మెలకువలోకి వచ్చి తాను ఎలాంటి విశేషణాలు తగిలించుకోకుండా పుస్తకం వేశాడు లక్ష్మణ. ఎక్కడా విరేశలింగంలా తానే తొలి.. అనే భావన రానివ్వలేదు. ‘తొలి’ రచన గురించి విమర్శకులు, పరిశోధకులు వాస్తవాల నుండి మాట్లాడాలి. కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు చరిత్రలో నిలవవు. నిజానికి ఇతివృత్తం మారకుండా ‘్భష’ మారే వీలుండదు. కనీసం భావనలో అయినా కొత్తదనం రావాలి. అప్పుడే భాషలో మార్పు రాగలదు. ప్రతిరోజూ కళ్ళముందు కానవచ్చే సంఘటనలు, మనుషుల కేంద్రం చుట్టూ పరిభ్రమించే విషయాలు కవిత్వం కావడానికి మాండలికం ఇసిత్రంలో అడుగడుగునా దోహదపడింది. ఆ సంకలనంలో నలభై ఏడేళ్ళ క్రితం వాడపడిన పదాలు చాలావరకు పోయాయి. పేంటుని లాగు, షర్ట్‌ని బుష్కోటు, వెంట్రుకల్ని బాల్, టైట్‌ని గుత్తెం, రోడ్డుని సడక్, శబ్దాన్ని మోత, దగ్గర అనేదానికి పంచ, దీపావళిని దిల్లె అని ఎన్నో పదాలను వాడి రాసిన కవితలు తప్పక ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి. ఇవి సహజ మాండలిక పదాలు. అసహజ మాండలిక పదాలూ ఉంటాయి. కవులు పద స్వరూపాన్ని చెడగొడితే ఏర్పడే పదాలు ఇవి. నారికేళం (కొబ్బరికాయ)ని నార్కేలాలు, పగలకొట్టుని పగ్లగొట్టి అని, ఉరుకుని ఉర్కి అని వాడినంత మాత్రాన అవి సహజ కాంతవంతమైన మాండలిక పదాలు కావు. ప్రజలు వాటిని అలా వాడరు. చదువుకున్న వాళ్ళు తమ అవసరాల మేరకు వాటిని తయారుచేసిన కృత్రిమ మాండలికాలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు భాషా మాండలికాలపై చర్చ జరగాలి. మనిషి జరుగుబాటుకి కూడా అది సంకేతం కావాలి. ఆత్మగౌరవ పోరాటాంగా వెలగాలి.

*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242