ఉత్తరాయణం

నాణేల చెలామణిపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి, రెండు రూపాయల నోట్లను, ఇరవై ఐదుపైసల నాణేలను రిజర్వు బ్యాంకు రద్దు చేస్తున్నట్టు గతంలో అధికారికంగా రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ రిజర్వు బ్యాంకు వారు తయారు చేస్తున్న ఐదు రూపాయల నోటు, యాభై పైసల నాణేలకు సంబంధించి రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయ. కిరాణాషాపులు, కూరగాయల మార్కెట్ తదితర చిల్లర లావాదేవీలు జరిగే చోట్ల గందరగోళం నెలకొంటున్నది. అయతే ప్రస్తుతం యాభై పైసల నాణేలతోపాటు, ఐదు రూపాయల నోటు- అధికారికంగా చెలామణిలో ఉన్నాయా, లేవా? అనే సందేహానికి సమాధానం కావాలి. ఇదివరలో చాలాసార్లు వెయ్య రూపాయలు, ఐదు రూపాయల నోట్లు చెల్లవని ప్రచారమైంది. ఇలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని చిల్లర వర్తకులు, సామాన్య ప్రజలు ఆయా నాణేలను, నోట్లను తీసుకోవడానికి విపరీతంగా భయపడిపోతుం టారు. దాదాపు అన్ని చోట్లా యాభై పైసలతో కొనే వస్తువులు ఏమీ దొరకవు. ఇకనైనా ఐదు రపాయల నోటు, యాభై పైసల నాణేల చెలామణికి సంబంధించిన విషయంలో ఆర్‌బిఐ అధికార్లు అందరికీ తెలిసేలా ప్రతికాముఖంగా ప్రకటన విడుదల చేయాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్
ప్రార్థనలు ఎక్కువ వైద్యం తక్కువ
ఉత్తరాంధ్ర వరదాయనైన ఒక ఆసుపత్రిలో ప్రతి ఆదివారం రోగులకు వైద్యసేవలకన్నా, ప్రార్థనలే ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు రోజులో అధికభాగం ప్రార్థనలు, తక్కువగా వైద్యసేవలు అందుతున్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రార్థనలు ఎక్కువగా విధినిర్వహణ సమయంలో జరగడం చట్ట వ్యతిరేకం. ఇటువంటి వాటివల్ల రోగులు ఇబ్బందులకు గురవుతారు. వ్యక్తిగత అంశమైన వాటిని ప్రభుత్వ ఆసుప త్రుల్లో నిర్వహించి, రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడే ఉద్యోగులను తీవ్రంగా శిక్షించాలి. అన్యుల చర్యలను మన ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించవు? దీపావళి టపాసులు ఆసుపత్రిలో తీవ్రస్థాయలో కాలిస్తే హిందూ మనోభావాలంటూ వదిలేస్తారా? ఏ మతస్థుడైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రాజ్యాంగ పరంగా శిక్షించాలి.
- పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు, నక్కపల్లి, విశాఖ జిల్లా
చరిత్ర సృష్టించిన కెసిఆర్
రాష్ట్రానికి, దేశానికి సంక్షేమ, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమం త్రి కె.సి.ఆర్. నిర్వహించిన అయుత చండీయాగం నభూతో నభవిష్యతి. యాగం కొరకు నిర్మించిన ఆశ్రమవాసాలు, ఇతర ఏర్పాట్లు, ఒక పద్ధతిగా ప్రత్యేక పర్యవేక్షణతో ఘనంగా వున్నాయ. దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి యాగం చేయలేదు. ప్రజలం దరిని ఆహ్వానించడం వచ్చిన వారందరికి యాగం తిల కించే అదృష్టం కలిగించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా తనో వ్యక్తి కాదని, శక్తి అని కెసిఆర్ నిరూపించుకున్నారు. ఋత్వికులు వేల సంఖ్యలో పాలొ గని వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగి ప్రజల్లో భక్త్భి వాన్ని ప్రేరేపించింది. వేలాది బ్రాహ్మణుల మంత్ర బలం తో, ఆ జగన్మాత చల్లని చూపులతో ప్రతి మనిషి, ప్రతి జీవి ఆనందంగా జీవించాలి. కేసీఆర్ చరిత్ర సృష్టించారు.
- జి. వి. రత్నాకర్ రావు, వరంగల్
దిగ్విజయ్ విమర్శ అహేతుకం
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జగన్మాత చండీయా గాన్ని విమర్శించడం అహేతుకం. దేశ క్షేమాన్ని కోరుతూ చండీయాగాన్ని చేయడం శుభదాయకం. విశ్వశాంతి కోసం ప్రతి రాష్ట్రంలోను చండీయాగం తలపెట్టాలి. ఈ యాగాన్ని నిర్విఘ్నంగా, విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనీయుడు. చేతగానివారే విమర్శలు చేస్తుంటారు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
బుక్ ఫెస్టివల్ అంటే ఇదేనా?
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అక్రమాలకు, పక్షపాతానికి మారుపేరు. ‘అభ్యుదయవాద’ ముసుగులో తమను వ్యతిరేకించిన వారికి గుర్తింపును కూడా ఇవ్వని ఫలితమే ఈ ఏడాది అసలుకే ఎసరు తెచ్చింది. ఆంధ్రప త్రిక, భారతి, ఆంధ్రప్రభ వంటి ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికల ప్రచురణ కేంద్రంగా విజయవాడ మంచి పేరు తెచ్చుకుంది. కానీ నేడు ముద్రణ, మార్కెటింగ్ రంగ అభివృద్ధితో లాభాలకోసమే బుక్‌ఫెస్టివల్ నిర్వహణ జరు గుతోంది. పూర్తిగా వ్యాపారం, లాభదృష్టి అయతే ఎవరూ ఆక్షేపించరు. ఇందులో రాజకీయ పక్షపాత ధోరణి, ఒకేవర్గం ఆధిపత్యం పుస్తక అభిమానులను, ప్రఖ్యాత రచయతలను క్షోభకు గురి చేస్తున్నది.