మెయన్ ఫీచర్

ఆదిత్యనాథ్ చెప్పిన చారిత్రక సత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మన జాతీయ చరిత్రకు జరిగిన, కొనసాగుతున్న అన్యాయాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చరిత్రకు జరిగిన వక్రీకరణల’ను ఇలా ప్రముఖంగా ప్రస్తావించడం బహుశా ఇదే మొదటిసారి. బాబర్, అక్బర్ తదితర మొఘల్ కుటుంబానికి చెందిన వారిని ‘పరిపాలకులు’గా పేర్కొనడం చరిత్రకు జరిగిన ఘోరమైన విఘాతం! ఈ మొఘలాయిలు మన దేశాన్ని దురాక్రమించిన మతోన్మాద బీభత్సకారులన్నది ఆదిత్యనాథ్ యోగి పునరావిష్కరించిన అసలు చరిత్ర.. మన జాతీయ చరిత్రను మాత్రమే కాదు, మన దేశపు వౌలిక అస్థిత్వానే్న వక్రీకరించిన ఘనత బ్రిటన్ పెత్తందార్లది! మన సంస్కృతి, ఈ సాంస్కృతిక భూమిక వికసించిన జాతీయత మన వౌలిక అస్థిత్వం! ఈ అస్థిత్వాన్ని బ్రిటన్ దొరలు చెరచి పోయారు! ఇదీ ఇప్పటికీ మనజాతిని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యలకు అసలు ప్రాతిపదిక! ‘మొఘలాయిలు విదేశీయ దురాక్రమణదారులు’ అన్న వాస్తవాన్ని- వారికి వ్యతిరేకంగా నిరంతరం సంఘర్షణ జరిపిన హైందవ జాతి గుర్తించింది.. బ్రిటన్ దురాక్రమణదారులు మన చరిత్రను, మన విద్యను, మన సంస్కృతిని, మన అనాది జాతీయతను నిరాకరించారు.. అబద్ధాల చరిత్రను సృష్టించి మన విద్యాలయాలలో దాదాపు నూట యాబయి ఏళ్లపాటు బోధించారు! ఫలితంగా దురాక్రమణదారులు పాలకులైపోయారు! మన ‘అద్వితీయ జాతీయత’ను కేవలం ఒక ‘మతం’గా ప్రచారం చేయడం, మన విద్యావంతులను నమ్మించడం బ్రిటన్ దుండగులు చేసిన అతి ఘోరమైన వక్రీకరణ! ఇలా ‘జాతీయత’ మతం స్థాయికి కుదింపునకు గురి కావడం వల్ల జాతీయతత్త్వం, మాతృభూమి పట్ల మమకారం మతతత్త్వమన్న భ్రాంతి వ్యాపించింది, జాతీయ సాహిత్యం మత సాహిత్యంగాను, జాతీయ మహాపురుషులు కేవలం ఒక మతానికి పరిమితమైన వారుగాను ప్రచారం కావడం ఈ ‘భ్రాంతి’లో భాగం! అందువల్లనే అనాదిగా ఈ దేశంలో పుట్టిపెరిగి ఈ దేశం కోసం తమ జీవితాలను సమర్పించిన అసంఖ్యాక జాతీయ మహాపురుషులు కేవలం మత నాయకులన్న భ్రాంతి కలుగుతోంది! విదేశీయ జిహాదీలకు, స్వజాతీయ వీరులకు మధ్య జరిగిన సతత సంఘర్షణను రెండు మతాలవారి మధ్య జరిగిన ‘దొమీ’గా భావించే మానసిక దుర్ర్భాంతికి ఇప్పటికీ మన జాతీయులలోని అనేకమంది మేధావులు గురి అయి ఉన్నారు.. ఈ మేధావులు అన్ని మతాలలోను విస్తరించి ఉన్నారు! ఈ భ్రాంతి తొలగాలన్నది ఆదిత్యనాథ్ యోగి చెబుతున్న మాట..!
వాల్మీకి మహర్షి తొలి చరిత్రకారుడు, ఆయన వ్రాసిన రామాయణం తొలి ఇతిహాసం! కానీ, రామాయణాన్ని విబుధ దైత్యుడైన ‘రావణుడు’ రచించి ఉండినట్టయితే లేదా రచింపచేసి ఉండినట్టయితే ఎలా ఉండేది? మహాభారతాన్ని కృష్ణ ద్వైపాయన వ్యాసుడు కాక ‘సైంధవుడు’ రచించినట్టయితే ఎలా ఉంటుంది? ‘జరాసంధుడు’ వ్రాయించినట్టయితే ఎలా ఉంటుంది? అలా ఉంది బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశం గురించి వ్రాసిన మన దేశపు చరిత్ర.. బ్రిటన్ వారు క్రీస్తుశకం 1600 సంవత్సరం నుంచి మనదేశంలోకి చొరబడి కొల్లగొట్టిన దురాక్రమణదారులు! అందువల్ల తమకంటే పూర్వం మన దేశాన్ని దోపిడీ చేసిన, మన ప్రజలను హింసించిన బీభత్సకారులు బ్రిటన్ మేధావుల, చరిత్రకారుల దృష్టిలో బీభత్సకారులు కాలేదు! క్రీస్తుశకం 712 నుంచి మనదేశంలోకి చొరబడిన మహమ్మద్ బిన్ కాసిమ్, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ వంటి వారిని బ్రిటనీయులు దోపిడీ దొంగలుగా చిత్రీకరించలేదు! వారందరు కూడ ‘సాహస జైత్రయాత్రలు’ చేసినట్టుగా మన చరిత్రకెక్కించిపోయారు బ్రిటన్ దొంగలు. క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో కొల్లగొట్టడానికి వచ్చిన గ్రీసు దేశపు బీభత్సకారుడు అలెగ్జాండర్‌ను మనదేశంలో ఇప్పుడు ‘గ్రీకువీరుడు’గా కొందరు ఆరాధిస్తుండడానికి ఇదీ కారణం! భారతదేశాన్ని దోపిడీ చేసిన విదేశీయుల ‘పరంపర’లో తాము కూడ ఉన్నందున దొపిడీకాండను ‘పరిపాలన’గాను, భౌతిక బౌద్ధిక బీభత్సకారులను ‘పాలకులు’గా చిత్రీకరిస్తే తప్ప తమ దురాక్రమణకు తర్క నిబద్ధత ఏర్పడబోదని ధూర్తులు భావించారు. అందువల్లనే అనాదిగా మనదేశంలో మన వారు వ్రాసిన చరిత్ర కేవలం కల్పితమని ప్రచారం చేసారు. యుగాల మహాయుగాల మధ్యంతరాల కోట్ల సంవత్సరాల చరిత్రను ధ్వంసం చేసి అబద్ధాల చరిత్రను నిర్మించి వెళ్లారు! భారతదేశంలో అనాదిగా ఉన్న జాతి ‘జాతి’ కాదని భారతదేశం ఒక ‘జాతి’గా ఏర్పడనే లేదని క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది నుండి బ్రిటన్ మేధావులు ఈ కొత్త చరిత్రలో చెప్పారు. బ్రిటన్‌వారిని విదేశీయ దురాక్రమణ దారులుగా భావించే నైతిక అధికారం స్వజాతీయులకు లేదన్నది చరిత్రకు జరిగిన మరో వక్రీకరణ! అనాదిగా భారత దేశం ఎవ్వరిదీ కాదని ‘ఆర్యులు’ అనే జాతివారు, అంతకు పూర్వం ‘ద్రావిడులు’ అనే జాతివారు ఈ దేశానికి బయట దేశాల నుంచి వచ్చారని బ్రిటన్ విబుధ దైత్యులు వ్రాసిపోయారు.
ఇలా అనాదిగా ఈ దేశంలో ఒక జాతి ఒకే జాతి వికసించిందన్న వాస్తవాన్ని చెరచిన బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు లేని ‘జాతుల’ను సృష్టించడం వక్రీకరణకు పరాకాష్ఠ! ‘ఆర్యులు’ ‘ద్రావిడులు’ల వలెనే అరబ్బులు తురష్కులు మొఘలాయిలు, బుడత కీచులు-పోర్చుగల్‌వారు, ప్రాంచీలు-ఫ్రాన్స్‌వారు-తదితరులు ‘ఎవరిదీ కాని ఈ దేశం’లో వచ్చి స్థిరపడినారని ఈ పరంపరలో తాము కూడ వచ్చి చేరామని చెప్పి, తమ దురాక్రమణను సమర్ధించుకోవడం బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారుల పన్నాగం! క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది నాటి ఈ వ్యూహం ఇప్పటికీ మనదేశంలో అమలు జరుగుతుండడం మన అంతర్గత సమస్యలకు ఏకైక కారణం! అనాదిగా ఈ దేశంలో వికసించిన ‘జాతి’ బ్రిటన్ వారి ‘చారిత్రక’ వక్రీకరణ ఫలితంగా ‘జాతి’ కాకుండా పోయింది. ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’ అని వేద ద్రష్టలు ఎలుగెత్తిన సృష్ట్యాది నుంచి మనం ఒక ‘జాతి’గా ఏర్పడి ఉన్నాము. ఈ జాతి సనాతన జాతి, అజనాభం, భారత జాతి, హైందవ జాతి! ఈ జాతీయులు మనదేశానికి బయట నుంచి రాలేదు.. తొలి మానవుడు భారతదేశంలో పుట్టి పెరగడం వారు క్రమంగా ప్రపంచమంతా వ్యాపించడం నిజమైన చారిత్రక పరిణామ క్రమం! లక్షల ఏళ్లు గడిచిన తరువాత, యుగాలు గడిచిన తరువాత, భారతదేశం సరిహద్దులకు వెలుపలివారు వేద సంస్కారాలకు దూరం కావడం, చరిత్ర ఇలా భారతీయతను మరిచిపోయి కొత్త జాతులుగా ఏర్పడినారు. ఈ కొత్త జాతులు మళ్లీ మన దేశంలోకి చొరబడి దోపిడీ చేసారు. ఈ కలియుగంలో ప్రస్తుతం యాబయి రెండవ శతాబ్ది నడుస్తోంది, ఈ హేమలంబ సంవత్సరం 5119వ కలియుగాబ్ది! కలియుగం పద్దెనిమిదవ శతాబ్దిలో ఇలా చొరబడి దోపిడీ చేసినవారిని తిప్పికొట్టి సరిహద్దులను భద్రం చేసిన జాతీయ వీరుడు ‘శుంగ’ వంశపు పుష్యమిత్రుడు! అప్పటి నుంచి కలి 5,049వ సంవత్సరం వరకు స్వజాతీయులు విదేశీయ దురాక్రమణదారులతో సంఘర్షణ సాగిస్తునే ఉన్నారు! కానీ మన ఇతిహాస పురాణాలు వివరించిన ఈ మన చరిత్రలో ఆర్యులు, ద్రావిడులు అన్న జాతులు కాని, ‘సింధు నాగరికత’ అన్న వేద సంస్కృతికి విభిన్నమైన సమాజం కాని లేవు! ‘ఆర్య’ అని అంటే సంస్కారవంతుడు, అనార్యుడు సంస్కారం లేనివాడు! ద్రావిడులు ద్రవిడ ప్రాంతాలలో అనాదిగా నివసించిన భారతీయులు! వారు ప్రత్యేక ‘జాతి’ కాలేదు. ఈ ద్రావిడ భౌగోళిక జన సముదాయాలు అనాదిగా భారత జాతిలో లేదా హిందు జాతిలో భాగం! సింహళ, తమిళ, తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రాంతాల వారు పంచ-వేదు-ద్రావిడ సముదాయాలు మాత్రమే! ప్రత్యేక జాతీయులు కాదు. మనదేశంలో ‘్భష’ పేరుతో కాని మతం పేరుతో కాని ‘జాతులు’-నేషన్స్- ఏర్పడలేదు. అనేక భాషలు, అనేక మతాలు, అనేక ఇతర వైవిధ్యాలు ఒకే ‘జాతి’లో భాగం, ఒకే జాతీయ సంస్కృతిలో భాగం! ఆ జాతి హైందవ జాతి లేదా భారత జాతి...
ఈ వాస్తవాన్ని బ్రిటన్ దొరలు చెరిచి పోయారు. ఈ వాస్తవాన్ని మళ్లీ ఈ జాతీయులు గ్రహించగలిగినప్పుడు ‘మొఘలాయిలు’ ఈ దేశాన్ని దురాక్రమించిన విదేశీయ బీభత్సకారులన్న సత్యాన్ని అన్ని మతాలవారు అంగీకరించగలరు! ఎందుకంటే అన్ని మతాల వారికి, అన్ని భాషల వారికి జాతీయత సమానం, జాతీయ సాంస్కృతిక వారసత్వం సమానం! కీచకుడు ద్వాపర యుగం నాటి నీచుడు.. ఏ మతం వాడన్న ప్రశ్న ఉదయించలేదు! మాతృ సంస్కృతిని మలిన పరిచిన జరాసంధ, సైంధవ, దుర్యోధన, శకుని వంటి దుర్మార్గులు ఏ మతం వారన్న ప్రశ్న పుట్టలేదు. ఈ ‘జాతి’కి చెందిన అన్ని మతాలవారు, కులాలవారు, భాషలవారు ఈ నీచులను ద్వేషిస్తున్నారు! వీరిని ఎదుర్కొన్న యదుకుల కృష్ణుడిని, కురుకుల పాండవులను జాతీయ వీరులుగా గుర్తుపెట్టుకున్నారు! రఘురాముడిని వ్యతిరేకించి మాతృమూర్తుల సౌశీల్యాన్ని మలినపరచ యత్నించిన రావణుడు ఏ మతం వాడు? వాడిని మొత్తం జాతి యుగాలుగా నిరసిస్తోంది. రఘురాముడిని యుగాలుగా పూజిస్తోంది..
కలియుగాబ్ది 4,630వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 1528లో రఘురాముని జన్మస్థలమైన అయోధ్యలోని మందిరాన్ని కూలగొట్టిన మొఘలాయి బాబర్‌ను కూడ ఈ జాతికి చెందిన అన్ని మతాల, భాషల, ప్రాంతాల వారు నిర్ద్వంద్వంగా నిరసించాలి! సైంధవ కీచకాదులు ఈ దేశానికి చెందినవారు, ఈ జాతికి చెందినవారు. అయినప్పటికీ మానవీయ సంస్కారాలు లేని ఈ అనార్యులను ఈ జాతి నిరసించింది. అందువల్ల విదేశాల నుంచి చొరబడిన బాబర్ అనే బీభత్సకారుడిని ఈజాతి మొత్తం ఎందుకని నిరసించరాదు? ‘బాబర్ పేరుతో కట్టడం’ ఈ జాతి పరాజయానికి చిహ్నం! రఘురాముని జన్మభూమి మందిరం జాతీయ విభవ చిహ్నం! రఘురామునికీ బాబర్‌కూ మధ్య జరిగిన 4,630వ సంవత్సరం నాటి సంఘర్షణ దేశ రక్షణకు, దురాక్రమణకు మధ్య జరిగిన పోరాటం! ఈదేశంలో పుట్టి పెరిగిన రాముడు భరతమాత వజ్రాల బిడ్డడు! రాజ్యాన్ని అంటే ప్రజలను రాముడు పూజించినట్టు- రామో రాజ్యం ఉపాసీత్వా- అని వాల్మీకి మహర్షి చెప్పాడు. రఘురాముడు ఆదర్శపాలకుడు! బాబర్ పాలకుడు కాదు, విదేశీయ బర్బర బీభత్సకారుడు! కుల మత భాష ప్రాంత వైవిధ్యాల అద్వితీయ భారత జాతి ఎవరిని సమ్మానించాలి? బ్రిటన్ చరిత్రను ఆ దేశానికి శత్రువైన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వ్రాయలేదు! భారత చరిత్రను ఈ దేశానికి శత్రువైన బ్రిటన్ వారు వ్రాసి పోయారు.. *

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com