Others

‘పొగ’ మహమ్మారిని తరిమేద్దాం (నేడు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ
మనోధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరికతో దానిని జయించాలి. హానికరమైన
వ్యసనాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్ కరకాలు అని గుర్తించాలి. ఒక్క గుట్కాను పరిశీలిస్తే అందులో
ఉన్న 4వేల రకాల క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.

ఇంతకీ ఈ నగరానికి ఏమైంది..? అనగానే అందరికీ అర్థం అయిపోతుంది.. అది- ‘పొగతాగడా న్ని ఆపాలనే’ ప్రకటన అని సులభంగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఏదో ఒక సినిమా థియేటర్‌లో ఈ ప్రకటనను చూస్తూనే ఉంటారు. అ యినా పొగరాయుళ్లు మా త్రం మారడం లేదు. భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతున్న ధూమపానం అలవాటు ఆపాలని పదే పదే వైద్యులు హెచ్చరిస్తున్నా ఇంకా చాలామందిలో మార్పు రావడం లేదు. అలాంటి వారికి మరింత గట్టిగా చెప్పేందకు పొగ తాగే అలవాటు మానుకోవాలని కోరుతూ అంతర్జాతీయ దినోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.
మనిషి శరీరం అనేక కణాల సమూహం. ప్రతి కణం కొంత కాలం జీవించి, తర్వాత దాని స్థానంలోకొత్త కణం పుడుతుంది, ఈ ప్రక్రియ చాలా కట్టుదిట్టమైన నియంత్రణలో జరుగుతుంది. ఈ నియంత్రణ లేకపోతే.. కణజాలం ఉత్పత్తి ఒక విస్ఫోటంలా జరిగితే వచ్చేదే క్యాన్సర్. భారతదేశంలో మూడోవంతు జనాభా పొగరాయుళ్లే అనే మాట వింటే దిగ్భ్రాంతి కలుగుతుంది. వారంతా నేరుగా పొగతాగకపోయినా, పక్కవారి పొగను పీల్చి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచంలో 1.3 బిలియన్ ఆడ, మగవారు పొగబారిన పడుతున్నారని ఒక సర్వే తేల్చింది. పొగతాగేవారిలో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారు.
సిగరెట్ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సాహంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో 10 ఏళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కొంతమంది పొగ ఏకాగ్రతను పెంచుతుందని, మరికొంత మంది సృజనాత్మకతను పెంచుతుందని, ఇంకొంత మంది పొగ తాగడం మానేస్తే కోపం వస్తుందని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘పొగతాగడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. కాని పొగతాగడం తప్పు, అనారోగ్యం అని తెలిసే 60 శాతం మంది తాగుతున్నారని ఇటీవలి సర్వేల్లో తేలింది. పొగతాగడం ద్వారా ఎన్నో హానికరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్విరామంగా కాలుస్తూనే ఉంటే మన జీవితం వెలుగుతున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపోవడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనోధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరికతో దానిని జయించాలి. హానికరమైన వ్యసనాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్ కరకాలు అని గుర్తించాలి. ఒక్క గుట్కాను పరిశీలిస్తే అందులో ఉన్న 4వేల రకాల క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది. సిగరెట్‌లో నికోటిన్ , టార్, ఆర్సినిక్, అమ్మోనియా, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, పారామాల్ డిహైడ్, ఆస్బెస్టాస్, సైనైడ్, లెడ్, డిడిటి, పొలోనియం, ఎసిటాల్ డిహైడ్ వంటి కారకాలుంటాయి. మూడు నెలలు గుట్కా వాడినప్పటికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ధూమపానం అలవాటులో సిగరెట్, బీడీలు, హుక్కా, పైపులు, సిగార్ మొదలైనవి ఉన్నాయి. ఇక నమిలే వస్తువుల్లో ఖైనీ, జర్దా, గుట్కా, పాన్ పరాగ్, పొగాకు, ఇతర పాన్ మసాలాలు కూడా క్యాన్సర్ కారకాలే.
నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన గుట్కా, పాన్‌మసాలా, ఖైనీలను ప్రభుత్వం నిషేధించి చాలా కాలం అయినా అతి విరివిగా అన్ని అంగళ్లలో ఇవి లభిస్తునే ఉన్నాయి. ‘ఎపి ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ చట్టం- 2002’ను మరింత పకడ్బందీగా అమలుచేయాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించినా అది సమర్ధంగా అమలుకావడం లేదు. పొగ తాగేవారిని గుర్తించే ఉపకరణాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. వాటిని స్మోక్ చెక్ మిషన్లు అంటున్నాం. ఈ యంత్రంతో చేసే పరీక్షనే బ్లో టెస్టు అంటారు. ఇది వదిలిన గాలిలో కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ శాతం ఎంత ఉందో కనిపెడుతుంది. ఈ కార్బన్‌మోనాక్సైడ్ రక్తంలోని హెమోగ్లోబిన్‌లో కలిసినంత త్వరగా ఆక్సిజన్‌లో కలవదు. కార్బన్ మోనాక్సైడ్ రక్తాన్ని నాశనం చేస్తుంది. ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తన్నాయో కనుగొనే పరీక్షను లంగ్ ఫంక్షన్ టెస్టు అంటారు.
నోరు, ముక్కు, ముక్కు వెనుకభాగం , నోటి వెనుకభాగం, గాలి ఆహారం పోయే మార్గం, శ్వాస నాళాలు, ఊపిరితిత్తులు, స్వరపేటిక వీటన్నింటికీ క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. పొగతాగే విధానం వల్ల క్యాన్సర్ వచ్చే రీతి మారుతుంది. అలాగే తమంతట తామే తాగేవారు, పొగతాగేవారి పక్కన ఉన్న వారికి వచ్చే క్యాన్సర్లలో తేడా ఉంటుంది. అయితే తొలి దశలో ఈ వ్యాధిని గుర్తించిన వారికి చికిత్స అందించే మార్గాలున్నాయి. మందులతోనూ, నమిలే గమ్స్‌తోనూ, అతికించే అతుకులతోనూ, వాయువు మరలతో నోటిద్వారా ఇచ్చే మందులు, మానసిక చికిత్స, ప్రకృతి చికిత్స మార్గాలున్నాయి. వ్యాధి తగ్గించుకునే మార్గాలు వెతికే కంటే వ్యాధి బారిన పడకుండా ముందుగానే పొగతాగడాన్ని ఆపితే వారికే కాదు, ఈ సమాజానికీ ఎంతో మేలు. అందుకే ‘పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఈ వ్యసనానికి దూరంగా ఉంటామని ప్రతిన బూనాలి.

డా. జివిఎస్ రావ్ ఇఎన్‌టి స్పెషలిస్ట్ ఫోన్: 040- 4568 99 99