మిర్చిమసాలా

పరీక్ష మాదే.. ర్యాంకూ మాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా పరీక్ష రాసిన తర్వాత అధ్యాపకులు పేపర్లు దిద్ది మార్కులు వేస్తారు. కానీ, పరీక్ష రాసిన వారే మార్కులు వేసుకుంటున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర ధాని నరేంద్ర మోదీ మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా సురవరం మీట్ ది ప్రెస్‌లో ఈ వ్యాఖ్య చేశారు. ఇటీవల కొన్ని పార్టీల సర్వేలపై మీ అభిప్రాయం ఏమిటీ? అని ఓ విలేఖరి ప్రశ్నించగా, ‘పరీక్ష రాసిన వ్యక్తే ర్యాంకు ఇచ్చుకున్నట్లు ఉంది..’ అని ఆయన చెప్పడంతో ఒక్కసారి నవ్వుల జల్లు కురిసింది.
-వి. ఈశ్వర్ రెడ్డి

ఎందుకోసం ఈ వౌనం?
తెలంగాణలో ఏం జరిగినా తక్షణం స్పందించే సిఎం కేసిఆర్ ఈ మధ్య ఒక విషయంలో వౌనం వహించడంపై పెద్ద చర్చే జరుగుతోంది. ‘దర్శకరత్న’ దాసరి మరణించినపుడు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసిఆర్ వెళ్లకపోవడంపై కొందరు చర్చకు తెరతీశారు. దాసరి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించిన కెసిఆర్ ఆయన ఇంటికి మాత్రం వెళ్లకపోవడంపై ఎవరికి వారు తమ సొంత ‘క్లారిటీ’ ఇస్తున్నారు. రాజకీయాలే కారణమని కొందరు, పార్టీ కారణమని.. ఇలా ఎవరికి తోచినట్టు వారు చెప్పేసుకుంటున్నా....కెసిఆర్ వౌనానికి కారణం ఎమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న...
- బి.వి.ప్రసాద్

‘స్క్రిప్టు’ బాగోలేదు..
సంగారెడ్డి సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి ‘ప్రసంగ పాఠం’ రాసిచ్చింది ఎవరో గానీ- జాతీయ స్థాయిలో ఆయనపై వ్యతిరేక ప్ర చారం చేసేందుకు ప్రత్యర్థులకు ఉపయోగిపడింది. ‘కేసిఆర్ కుటుంబ పాలన’ అంటూ రాహుల్ ప్రసంగిస్తున్న వేదికపైనే- నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ ఫొటోలు ఉండడంతో ఇది ‘కుటుంబ స్వామ్యం కాదా?’ అంటూ జాతీయ మీడియా హడావుడి చేసింది. ఇక కాంగ్రెస్ లోకల్ లీడర్లు తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ రాహుల్ చేత సభలో చెప్పించారు. ఆయన ప్రసంగం టీవీ చానళ్లలో వస్తున్నపుడే- తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు 15 నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు, ఇప్పటికే భారీగా నియామకాలు జరిగినట్లు వార్తలు ప్రసారమయ్యాయి!
- మురళి

‘సమాచారం’ తగ్గించండి..
సర్కారీ పిఆర్‌ఓలు రాసే ప్రసంగ పాఠాలను చదవలేక గవర్నర్, సిఎం, కలెక్టర్లు అవస్థ పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగం చదువుతూ కళ్లుతిరిగి పడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇలాగే బడ్జెట్ ప్రసంగంలో సొమ్మసిల్లి పడిపోయారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన విషయాలను పేర్కొంటూ రాసే 40-50 పేజీల స్క్రిప్ట్‌లను చదవలేక వివిఐపిలు నానా ఇబ్బంది పడుతున్నారు. వాటిని చదివినపుడు ఆయాసం, దానికి ఎండవేడి తోడు కావడంతో మంత్రులు స్పృహ తప్పిపడిపోతున్నారు. చదివేవారికే కాదు, వినేవారికి సైతం ‘సహన పరీక్ష’ పెడుతున్నందున- చాదస్తాన్ని వదిలించుకుని సమాచార శాఖ పిఆర్‌ఓలు క్లుప్తంగా ప్రసంగ పాఠాలు రాస్తే అందరికీ మేలే.
- వెల్జాల చంద్రశేఖర్

ఆ దూకుడేది బాబూ..?
టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా, గతంలో విపక్షంగా ఉన్నా అందరి దృష్టి తనపై పడేలా యత్నిస్తుంటారు. అయితే- ఈమధ్య ఆయనలో దూకుడు తగ్గిందట! ఏటా ‘మహానాడు’లో ‘ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలం’టూ ప్రవేశపెట్టే తీర్మానంపై బాబుకు ఇపుడు ఆసక్తి లేదట. దివంగత సిఎం వైఎస్ పేరును కడప జిల్లాకు పెట్టగా, ఎన్టీఆర్ పేరుతో జిల్లా లేకపోవడం పట్ల నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్‌కు ‘్భరతరత్న’ విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలేని చంద్రబాబు- కనీసం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి ఎందుకు ప్రయత్నించడం లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాబులో దూకుడు తగ్గిందని ‘తమ్ముళ్లు’ అంటున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు