సంపాదకీయం

తీరు మారని ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్‌లోని పఠాన్‌కోట వద్ద గల మన వైమానిక దళ స్థావరంపై పాకిస్తానీ టెర్రరిస్టులు శనివారం దాడి చేయడం ఆశ్చర్యకరం కాదు. ఆవుల మందలోకి తోడేళ్లు దూకడం ఆశ్చర్యకరం! పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ స్వభావం గురించి తెలిసిన వారికి ఇలా మన వాయుసేనపై ఉగ్రవాదులు దాడి చేయడం ఎలాంటి దిగ్భ్రాంతిని కలిగించడం లేదు! మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25న లాహోర్‌కు సౌహార్ద యాత్ర జరుపుతున్నప్పుడు ఈ ‘తెలిసిన వారికి’ స్ఫురించిన చారిత్రక వాస్తవాలు ఇందుకు ప్రాతిపదికలు! పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేతగా చెలామణి అవుతున్న కరడుకట్టిన జిహాదీ బీభత్సకారుడు నవాజ్ షరీఫ్! ఈ నవాజ్ షరీఫ్ పుట్టినరోజు పండుగ సందర్భంగా అతగాడిని అభినందించడానికై మన ప్రధాని లాహోర్‌కు వెళ్లడం గొప్ప నాటకీయ పరిణామం! కానీ భారతీయులలో అత్యధికులకు 1999 నాటి కార్గిల్ యుద్ధం గుర్తుకు వచ్చింది. నవాజ్ షరీఫ్ పొడిచిన వెన్నుపోటు గుర్తుకు వచ్చింది! అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్‌కు బస్సు వేసి నవాజ్ షరీఫ్‌తో మైత్రిని నెరపి తిరిగి వచ్చాడు! అప్పుడు కూడ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత ఈ నవాజ్ షరీఫ్ అనేవాడే. అహో..ఒహో! అని అంటూ వాజ్‌పేయిని మైత్రి మాటలతో నమ్మబలికిన షరీఫ్ నిజానికి భయంకరమైన బద్మాష్ అని ఆ తరువాత ధ్రువపడింది! మైత్రి మత్తులో మునిగి తేలుతుండిన అప్పటి మన ప్రభుత్వాన్ని నవాజ్ షరీఫ్ ఘోరంగా వంచించాడు! మన కార్గిల్‌లోకి మొదట పాకిస్తానీ బీభత్సకారులు తరువాత ప్రచ్ఛన్న బీభత్సకారులైన పాకిస్తానీ సైనికులు చొరబడిపోవడం షరీఫ్ దుస్తంత్రంలో భాగం! అదే కథ ఇప్పుడు పునరావృత్తమైంది! దరహాసపు తెరల వెనుక దాగిన షరీఫ్ విష హృదయం మరోసారి ఆవిష్కృతమైంది! నరేంద్ర మోదీ అతగాడిపై కురిపించి వచ్చిన అభినందనా మృతపు జల్లుల తడి ఆరకముందే అతగాడు మన పఠాన్‌కోట స్థావరంపైకి జిహాదీ తోడేళ్లను ఉసి గొలిపాడు! ఇప్పుడిలా జిహాదీ ఉగ్రవాదం మరోసారి మనపై దూకడం జిహాదీ స్వభావాన్ని లక్ష్యాన్ని తెలిసినవారికి ఆశ్చర్యకరం కాదు. తోడేలు స్వభావంలో మార్పు వచ్చిందని, వస్తుందని ఆవుల గొంతులను కొరికి వేయడం అది మానుకుంటుందని మన ప్రభుత్వం భ్రమించడం మాత్రమే విస్మయకరం. పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ తోడేళ్ల సమాహారం! మట్టుపెట్టదగిన తోడేళ్ల పట్ల మైత్రిని నెరపడం వల్ల అవి మచ్చిక అవుతాయా? గోడ దూకి గోశాలలలోకి చొరబడడం మానుకుంటాయా? ‘శామ్యేత్ ప్రత్యపకారేణ, నోపకారేణ దుర్జనః’ (దుర్జనునికి ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ వాడు అణగిపోడు, వాని చర్యలకు ప్రతిగా అపకారం చేసినప్పుడు మాత్రమే వాడు అణగిపోతాడు..) అన్నది మహాకవి సహస్రాబ్దులకు పూర్వం చెప్పిన సత్యం! నవాజ్ షరీఫ్ ఇలాంటి దుర్జనుడు!
‘జాయిష్ ఏ మొహమ్మద్’ ముఠాకు చెందిన ముష్కరులు పఠాన్‌కోట వాయుసేన స్థావరంపై ఇప్పుడు దాడులు జరిపారు. గత జూలై 27న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించిన జిహాదీ హంతకులు లష్కర్ ఏ తయ్యబా ముఠావారు! ఇలా వివిధ రకాల పేర్లతో చెలామణి అవుతున్న అనేక పాకిస్తానీ జిహాదీలను నడిపిస్తున్నది మాత్రం ఐఎస్‌ఐ. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య సంస్థగా చెలామణి అవుతున్న ఈ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) నిజానికి ఉగ్రవాద అనుసంధాన వ్యవస్థ మాత్రమే! లష్కర్ ఏ తయ్యబా, జమాద్ ఉద్‌దావా, జాయిషే మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్, హుజి, ఇండియన్ ముజాహిదీన్, సిమి వంటి అనేకానేక ముఠాలను పరస్పరం అనుసంధానం చేసి నడిపిస్తున్నది ఐఎస్‌ఐ మాత్రమే! ఐఎస్‌ఐ పాకిస్తాన్ సైనిక విభాగం! అందువల్ల పఠాన్‌కోటపై దాడి పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న భారత వ్యతిరేక బీభత్సకాండలో భాగం! పఠాన్‌కోటపై దాడికి పాకిస్తాన్ సైనిక దళాల కార్యాలయంలోనే వ్యూహ రచన జరిగిందన్నది అందువల్ల ఆశ్చర్యకరం కాదు! మన సైనిక దళాల అప్రమత్తత వల్ల మరింత ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఏడుగురు మన సమర వీరులు అమరులు కావడం అనివార్యం అయింది! ఇదంతా వెన్నుపోట్లు తింటున్నప్పటికీ మళ్లీ మళ్లీ పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులను విశ్వసిస్తున్న మన ప్రభుత్వ విధాన వైపరీత్య ఫలితం!
దాదాపు పదేళ్లుగా పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై జమ్మూలోని పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్‌లోని సైనిక స్థావరాలపై, పోలీస్ స్టేషన్లపై దాడులు జరుపగలగడం పెరిగిన జిహాదీ పటిమకు, విస్తరించిపోతున్న వికృత వ్యూహానికి నిదర్శనం! 1947 ఆగస్టులో పాకిస్తాన్ ఏర్పడినప్పటినుంచి ఈ జిహాదీల హత్యాకాండ కొనసాగుతోంది. పాకిస్తాన్ ఏర్పడకపూర్వం జిహాదీలు భయంకర రక్తపాతం సృష్టించారు! పాకిస్తాన్ ఏర్పాటు కోసం మాత్రమే జిహాదీ హంతకులు హిందువులను చంపుతున్నారన్న ప్రచారం జరిగింది. అందువల్ల పాకిస్తాన్ ఏర్పడినట్టయితే జిహాదీ హంతకులు తమ లక్ష్యం నెరవేరిందన్న సంతృప్తి చెందుతారని కూడా ప్రచారం జరిగింది! అందువల్ల బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమనేతలు దేశ విభజనకు అంగీకరించారు! అఖండ భారత్‌ను బద్దలుకొట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు! కానీ జిహాదీ హంతకులు తమ స్వభావాన్ని విడనాడలేదు! పాకిస్తాన్‌లోని హిందువులను నిర్మూలించారు! అంతటితో ఆగలేదు మన దేశంలోని కాశ్మీర్ లోయ ప్రాంతంలోని హిందువులను నిర్మూలించారు! అప్పటికీ జిహాదీలు సంతృప్తి చెందలేదు. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో భయంకర బీభత్స కృత్యాలను నిర్వహించారు! వేలాది మందిని హత్య చేశారు! చివరికి సైనిక స్థావరాలలోకి, పోలీస్ స్టేషన్లలోకి చొరబడి హత్యాకాండ సాగించే స్థాయికి తెగబడినారు! ఈ జిహాదీ బీభత్స చరిత్రవల్ల స్పష్టపడుతున్న వాస్తవం ఏమిటి? జిహాదీ ఉగ్రవాదం ప్రతిక్రియాత్మకం కాదు. అది స్వాభావికమైనది! ప్రపంచంలోని ఇస్లామేతర మతాల వారిని శతాబ్దుల తరబడి సామూహికంగా హత్య చేయడం ఈ స్వభావం. అన్ని ఇతర మతాల ప్రజలను నిర్మూలించి ప్రపంచమంతటా ఇస్లాంను ఏకైక మతంగా స్థాపించడం జిహాద్ లక్ష్యం.
పాకిస్తాన్ ఏర్పాటు కావడం ఈ లక్ష్యంలో ఒక ఘట్టం మాత్రమే! మొత్తం భారతదేశాన్ని పాకిస్తాన్‌వలె ఇస్లామీకరణ చేయడం జిహాద్ లక్ష్యం. సర్వమత సమభావ వ్యవస్థ మన దేశం స్వభావం! ఈ సర్వమత సమభావ వ్యవస్థపై పాకిస్తాన్‌లోని ఏకమత జిహాదీ వ్యవస్థ జరుపుతున్న దొంగచాటు యుద్ధం ఈ బీభత్సకాండ! అలాంటి పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం చర్చలు జరుపడంవల్ల ఫలితం శూన్యం. ఇది చరిత్ర నిరూపించిన నిజం! పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బీభత్స కృత్యాలను విడనాడదు. అందువల్ల ఎల్‌టిటిఇని శ్రీలంక ప్రభుత్వం, పిఎల్‌ఓ, హమాస్‌లను ఇజ్రాయిల్ నడుము విరిచినట్టుగా పాకిస్తాన్ బీభత్స ముఠాలను తుదముట్టించడం మాత్రమే మన ప్రభుత్వానికున్న సరైన ప్రత్యామ్నాయం.