సంపాదకీయం

‘మాధ్యమ’ మీమాంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతటా ఒకే భాష మాధ్యమంగా ఉన్నత విద్యాబోధన జరగడం అభిలషణీయం. ఈ వాస్తవాన్ని క్రమంగా అన్ని ప్రాంతాల వారు గుర్తించారు, గుర్తిస్తున్నారు. ‘కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సీబీఎస్‌సీ- వారి పాఠ్య ప్రణాళికలను బోధిస్తున్న బడుల్లో ప్రాథమిక స్థాయిలోనే దేశమంతటా ఈ బోధనా మాధ్యమ సమానత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన జరుగుతోంది. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషల మాధ్యమంగా బోధన జరగాలన్న స్ఫూర్తికి దశాబ్దుల పాటు ఇది ‘అపవాదం’గా మారింది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాష మాధ్యమంగా జరగాలని, దానివల్ల బాలబాలికల్లో అవగాహన పెరుగుతుందని బ్రిటన్ దాస్య విముక్తి జరిగాక మన దేశమంతటా ప్రచారం జరిగింది. నిజానికి బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశాన్ని పాలించిన సమయంలో దేశమంతటా ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగా మాత్రమే ప్రాథమిక విద్యాబోధన జరిగింది. ఎనిమిదవ తరగతి నుంచి మాత్రమే ఆంగ్ల మాధ్యమ బోధన మొదలయ్యేదని చరిత్ర చెబుతోంది. ఒకటవ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంగా బోధించిన బడులు ఉన్నా, అవి కేవలం మహా నగరాల్లో మాత్రమే నెలకొని ఉండేవి. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన సమయంలో ఉన్నత, ఉన్నతోన్నత విద్యావంతులు మాత్రమే ఆంగ్ల మాధ్యమ బోధన గ్రస్తులయ్యారు,బ్రిటన్-ఐరోపా భావజాల ప్రభావితులయ్యారు. ‘స్వరూప భారతీయులు’గా మిగిలి ‘స్వభావ పాశ్చాత్యులు’గా మారారు. కానీ ఈ పరివర్తన జరిగిన దాదాపు నూట యాబయి ఏళ్ల కాలంలో భారతీయ ప్రాంతీయ మాతృభాషల అస్తిత్వానికి భంగం వాటిల్లలేదు. ఎందుకంటె ప్రాథమిక స్థాయి విద్యాబోధన ప్రాంతీయ భాషల్లోనే కొనసాగింది. ఉన్నత విద్యాబోధన, విశ్వవిద్యాలయ స్థాయి బోధన ఆంగ్ల మాధ్యమంగా మొదలుకావడంతో సంస్కృత భాష ప్రాధాన్యం తగ్గింది, ఆ భాష వినియోగం అడుగంటింది. సంస్కృతం అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. సంస్కృతం అంతరించిపోవడానికి భూమిక సిద్ధమైంది. బ్రిటన్ పాలకులు ఈ భూమికను సిద్ధం చేశారు. బ్రిటన్ వారి విద్యా విధానం వ్యవస్థీకృతం అయ్యేవరకు భారతదేశమంతటా సంస్కృత భాష మాధ్యమంగా ఉన్నత విద్యాబోధన జరిగింది.
ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా ఆంగ్లం అవతరించడం సంస్కృత భాష పాలిట గొడ్డలి పెట్టు. బ్రిటన్ భౌతిక దురాక్రమణ విముక్త భారతదేశంలో ‘బ్రిటన్ బౌద్ధిక దాస్యం’ మాత్రం మరింతగా వ్యవస్థీకృతమవుతోంది. బ్రిటన్ వారు సంస్కృత భాషకు వ్యతిరేకంగా ఉపయోగించిన ‘గొడ్డలి’ని వాణిజ్య పాఠశాలల- కార్పొరేట్ స్కూల్స్- వారు ప్రాంతీయ భాషలను మట్టుపెట్టడానికి ఉపయోగించారు. ఫలితంగా ప్రాథమిక స్థాయిలోనే ‘కార్పొరేట్’ విద్యార్థులు మాతృభాషలకు దూరమయ్యారు. గత పదేళ్లకు పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సైతం మాతృభాష మాధ్యమ బోధనను హత్య చేయడానికి పాలకులు నడుం బిగించారు. ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోను, లాభాపేక్ష లేని స్వచ్ఛంద జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న బడుల్లో సైతం ఆంగ్ల మాధ్యమం మొదలైంది. ఫలితంగా దేశమంతటా ప్రాంతీయ మాతృభాషలు అంతరించిపోవడానికి భూమిక సిద్ధమైంది. ‘ఉన్నత విద్యాబోధన మాధ్యమం’ ద్వారా బ్రిటన్ దొంగలు సంస్కృత భాషను హత్యచేయ యత్నించారు. ప్రాథమిక విద్యాబోధన మాధ్యమం ద్వారా దేశంలోని ‘దొరలు’ ప్రాంతీయ మాతృభాషలను హత్య చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే 1947 నాటికి సంస్కృత భాషకు పట్టిన దుర్గతి అన్ని ప్రాంతీయ మాతృభాషలకు పట్టడం ఖాయం. ప్రభుత్వాలు ఇప్పుడైన సంస్కృత భాషా హనన చరిత్ర నుండి పాఠం నేర్చుకోవాలి. ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి. కేవలం ఒక పాఠ్యాంశం- సబ్జెక్టు-గా ప్రాథమిక స్థాయిలో తెలుగును కానీ, ప్రాంతీయ భాషలను కానీ బోధించడం వల్ల ఈ భాషలు- సంస్కృతం వలె ఊపిరితో మిగలవచ్చు. సర్వ సమగ్ర పరిపుష్టిని మాత్రం పొందలేవు!
దేశమంతటా ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగా బోధన జరిగినప్పుడు మాత్రమే ఈ భాషలకు పరిపుష్టి ఏర్పడగలదు. ‘ప్రాంతీయ భాషా మాధ్యమ ప్రాథమిక విద్యాబోధన’ను ఎనిమిదవ తరగతి వరకు దేశమంతటా నిర్బంధం చేస్తూ కేంద్రం రాజ్యాంగంలో ఇప్పుడైన నిర్దేశించాలి. ఇలాంటి రాజ్యాంగ నిర్దేశం లేనందున ప్రాంతీయ భాషలు బోధనా మాధ్యమ ప్రతిపత్తిని క్రమంగా కోల్పోతున్నాయి. పదవ తరగతి వరకు కన్నడ భాష మాధ్యమంగా మాత్రమే తమ ప్రాంతమంతటా అన్ని బడుల్లో బోధన జరగాలని కర్నాటక ప్రభుత్వం దాదాపు పదేళ్లుగా నిర్దేశిస్తోంది. రాజ్యాంగ నిబంధన లేనందున ఈ ఉత్తరువు అమలు జరగడం లేదు. భాషాపరమైన అల్ప సంఖ్యాక ప్రజల మాతృభాషల మాధ్యమంగా ప్రాథమిక విద్యాబోధన జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ‘350-ఏ’ రాజ్యాంగ అధికరణంలో నిర్దేశించారు. ప్రతి ప్రాంతంలోని ప్రధాన మాతృభాష మాధ్యమంగా ప్రాథమిక విద్యాబోధన జరిపించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న రాజ్యాంగ నిబంధన లేదు. మార్గదర్శక సూత్రమైన నలబయి ఐదవ రాజ్యాంగ అధికరణంలో పదునాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను నేర్పించాలని నిర్దేశించారు. కానీ మాతృభాష మాధ్యమంగా బోధన జరిపించాలని నిర్దేశించలేదు. పాలనా భాష గురించి, అనుసంధాన భాష గురించి, అధికార భాష గురించి, న్యాయస్థాన భాష గురించి రాజ్యాంగంలో నిర్దేశాలున్నాయి. వేల లక్షల సంవత్సరాల పాటు మన దేశంలో సంస్కృతం మాధ్యమంగా వందల విభాగాల భౌతిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక శాస్త్ర విజ్ఞానం వికసించింది. ఈ విజ్ఞాన నందనవనాన్ని విదేశీయ దురాక్రమణదారులు అడవిపందుల వలె పడి ధ్వంసం చేశారు. అవశేష సంస్కృత శాస్త్ర విజ్ఞానం సైతం అత్యంత విస్తృతంగా ప్రస్ఫుటిస్తుండడం వర్తమాన వాస్తవం. విదేశాల దురాక్రమణ నుండి విముక్తమైన ప్రతి దేశం, చిన్న దేశాలు సైతం దురాక్రమణకు పూర్వస్థితిని పునరుద్ధరించుకుంటున్నాయి. మన దేశం మాత్రం ఎందుకని పునరుద్ధరించుకోరాదు? మన దేశంలో విదేశీయ దురాక్రమణకు పూర్వస్థితి సంస్కృత భాష మాధ్యమంగా ఉన్నత విద్యాబోధన..
మన దేశానికి రాజ్యాంగ రచన చేసిన బీఆర్ అంబేద్కర్ మహాశయుడు ‘సంస్కృత భాషను యథాపూర్వకంగా పునరుద్ధరించాల’ని కోరి ఉన్నాడు. పూర్వం సంస్కృత భాషలో జరుగుతుండిన వన్నీ బ్రిటన్ దురాక్రమణ తర్వాత ఆంగ్లంలో జరుగుతున్నాయి. ఇది వర్తమాన వైపరీత్యం. ఆంగ్లంలో ప్రస్తుతం జరుగుతున్న వన్నీ సంస్కృత భాషలో మళ్లీ జరగడం యథాపూర్వ స్థితి పునరుద్ధరణ. అంబేద్కర్ అంతరంగం ఇది. ఈ దిశగా ఇప్పుడైన ప్రయత్నం జరగాలి. ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా సంస్కృత భాషను నిర్థారించడానికి పూర్వరంగంగా సంస్కృతాన్ని ఒక పాఠ్యాంశంగా కనీసం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోధించే వ్యవస్థను దేశమంతటా ఏర్పాటు చేయాలి. ఆరు నుంచి పదవ తరగతి వరకు బోధనలో ఆంగ్ల భాష పాఠ్య ప్రణాళికలను, కాలాంశాల- పిరీయడ్స్-ను సగానికి తగ్గించి ఆ సమయాన్ని సంస్కృత భాషా బోధనకు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ కోసం పూనుకోవాలి.