ఉత్తరాయణం

‘అసహన’ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురంలో ఇటీవల భాజపాకు వ్యతిరేకంగా ముస్లింలు ప్రదర్శన నిర్వహించడం, మతఛాందస వాదులకు బుద్ధి చెప్పాలని ప్రకటన చేయడం చాలా విడ్డూరం. దీని వెనుక కుహనా లౌకిక వాదులు, వామపక్ష తదితర హిందూ వ్యతిరేకులు ఉన్నట్లు అర్థమవుతోంది. హిందూ సమాజంపై దాడి చేయడం సరైనది కాదు. పెను గొండ, పరిగి, గోరంట్ల ప్రాంతాల్లోని ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక పార్లమెంటు సభ్యుడి పేరు చెప్పి హిందూ సమాజంపై దాడి చేయడం, భాజపాని విమర్శించడం సరైనది కాదు. అన్ని మతాలను సమానంగా గౌరవించేది ఒక్క భారతీయ జనతాపార్టీ మాత్రమే. మనం వ్యతిరేకించాల్సింది భాజపాను కాదు. మనదేశంపై దాడికి యత్నించే ఐఎస్‌ఐఎస్, అల్-ఖైదా, ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను మాత్రమే.
నేడు భారతదేశంలో ఏమూల ఇస్లామిక్ తీవ్రవాదులు న్నారో తెలియని స్థితి నెలకొని ఉంది. హిందూపురంలో జరిగిన ప్రదర్శనలు కేవలం ‘అసహనం’లో భాగం మా త్రమే. దీన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ లేదా హిందూ వ్యతిరేక వర్గాలు కావచ్చు. హిందూ మత ఛాందస వాద మన్న మాటను ఉపయోగించడమే తప్పు. ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ప్రతి రాజకీయ పార్టీ గుర్తించాలి. ఆవిధంగా గుర్తించకపోవడం వల్లనే కొత్తకొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయ. దేశ భక్తిలేని, స్వార్ధపర నాయకులే కుహనా లౌకిక వాదాన్ని రెచ్చగొడుతున్నారన్నది సత్యం.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
పల్లెల్లో మరుగుదొడ్లు నిర్మించాలి
పల్లెటూళ్లు ప్రగతిపథానికి పట్టుకొమ్మలు అంటారు కానీ ఆ పల్లె జనుల అవసరాలు తీర్చే మరుగుదొడ్లు మాత్రం అందుబాటులో ఉండవు. అవసరం కోసం మార్గం వెతుక్కొని చెట్ల చాటుకు చేరవలసిన పరిస్థితులు కోకొల్లలు. గర్భిణీ స్ర్తీలు, వికలాంగులైన మహిళలు కూడా ఎంతో ఇబ్బంది పడే సంఘటనలను అనేకం తారస పడుతూనే ఉన్నాయ. దేశం అభివృద్ధి చెందడమంటే రాకెట్‌లపై ప్రయోగాలు చేయడం, విమానాలపై విదేశాలు తిరిగి రావడం కాదు. పల్లె జనులకు అవసరమైన కనీస నిత్యావసర వసతులు కల్పిస్తే చాలు. అదే అభివృద్ధిలో ప్రధాన భాగంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని చిత్తశుది ధతో నిర్వహించాలి.
- పెయ్యల శ్రీనివాసరావు, అలికాం, తూ.గో. జిల్లా
ఎందుకీ ఊకదంపుడు ఉపన్యాసాలు
బతికి ఉండగా తిండి తిప్పలు లేని నానా అవస్థలు పడిన జీవులకు తుదిశ్వాస వదలగానే సమాధులు కట్టి, రంగవల్లులు తీర్చి పూల దండలు వేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందా? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కుటుంబీకులు ఒంగోలులో గృహవసతి లేక ఎన్నో ఇబ్బందులకు గురై స్వంత వూరిలో పూలమ్మిన చోటే కట్టెలు అమ్మిన విధంగా జీవితం వెళ్లదీశారు. నిజంగా అంతటి స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం పరిస్థితి కన్నీటిని తెప్పిస్తుంది. పంతులుగారి జయంతి సందర్భంగా ఊకదంపుడు ఉపన్యాల వల్ల పంతులుగారి ఆత్మకు శాంతి కలుగుతుందా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
బెర్త్ ఖాళీలను డిస్‌ప్లే చేయాలి
కంప్యూటర్ ద్వారా రెలు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఖాళీల సంఖ్యే డిస్‌ప్లే అవుతోంది. లోయర్ బెర్త్‌లకు ప్రిఫరెన్స్ ఇచ్చినా అప్పుడప్పుడూ వాటిని కేటాయంచడం లేదు. లోయర్, మిడిల్, అప్పర్ బెర్తులు ఎన్ని ఖాళీలున్నాయనేది కంప్యూటర్లలో చూపితే సీనియర్ సిటిజన్స్, స్ర్తీలకు సదుపాయంగా ఉంటుం ది. ఈ సదుపాయం బస్సు రిజర్వేషన్లలో ఉంది. సీని యర్స్ కొంతమంది రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి లోయర్ బర్త్‌లు పొందుతున్నారు. నెట్ సదుపాయం వచ్చిన తర్వాత స్టేషన్ కౌంటర్లకు వెళ్లడం తగ్గించి వేశారు. ఐఆర్‌సిటిసి వారు ఈ సదుపాయాన్ని అందించాలి.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
బయోమెట్రిక్ వ్యవస్థను అమలు జరపాలి
ప్రభుత్వ పాఠశాలల్లో త్వరగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తోంది. బయోమెట్రిక్ హాజరువల్ల, ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులు నిర్వహించగలుగుతారు. బాధ్యత అనేది తెలిసి వస్తుంది. ప్రభుత్వం ఇక కాలయాపన చేయడం తగదు. త్వరగా బయోమెట్రిక్ అమలుచేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు వెయ్యి కళ్ళతో బయోమెట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు.
- బచ్చల అవినాష్, కొత్తపేట
కౌమార దశలో శిక్షలుండాలి
కౌమార దశలో కూడా శిక్షలు వుండాలి. కౌమార దశలో ఉన్న ఒక బాలుడు ఖూనీ చేస్తాడు. అతనిని కౌమార దశ అని వదలిపెడతారా? నిర్భయ కేసు జరిగి నేటికి 3 సంవత్సరాలు. అప్పటినుండి లైంగిక కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. మైనర్ పిల్లలపై లైంగిక దాడులు ఎక్కువ. గనుక కౌమార దశలో కూడా శిక్షలు వుండాలి.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు