మెయన్ ఫీచర్

భారత్-రష్యా మైత్రి అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి సిరియా- పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 డిసెంబరు మూడో వారంలో మూడు దేశాలు పర్యటించారు. రష్యాలో చేసిన పర్యటన చరిత్రాత్మకమైనది. రష్యాలో జరిపిన చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చాలా ప్రయోజనకరమైనవి. ముఖ్యంగా యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం గణనీయమైనది. పుతిన్- మోదీల సంయుక్త ప్రకటన ప్రపంచ శాంతికి ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉద్రిక్తతల నివారణకు తోడ్పడుతుంది. ఐఎస్ ఉగ్రవాదుల దాడిలో రష్యా ఎలా నష్టపోతున్నదో భారత్ కూడా తీవ్రవాదుల దాడిలో అంతే నష్టపోతున్నది. ఈ విపత్కర పరిస్థితిలో ఇండో- రష్యా మైత్రి ఒక చారిత్రక ఘట్టంగా భావింపవచ్చు. రష్యా అనే పదం ఋషిక అనే సంస్కృత శబ్దంనుండి పుట్టింది. ప్రాచీన కాలంలో ఇక్కడ వైదిక సంస్కృతి ఉండేది. వేదర్షులు వాలుకా నదీ తీరంలో యజ్ఞాలు చేసేవారు. నేడు సాంస్కృతిక అవశేషాలు అజార్‌బైజాన్ వంటిచోట్ల స్పష్టంగా చూడవచ్చు.
ఈ దశలో ఇండో-రష్యా మైత్రి ఒక అనివార్య బంధం అని భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఇండియాకు రష్యా అవసరం ఎంత ఉందో రష్యాకూ ఇండియా అవసరం ఈ ద్వీపకల్పంలో అంతే ఉంది. మరొక అంశం ఏమంటే చైనాతో పాకిస్తాన్‌తో పోల్చిచూచినప్పుడు రష్యా నిజాయితీగల దేశంగా అనిపిస్తుంది. ఇండియా రష్యా మైత్రి అటు అమెరికాకు ఇటు చైనా పాక్ కూటమికీ కూడా కొంత కనె్నర్రగానే ఉండవచ్చు. ఐతే బరక్ ఒబామాకు ఇప్పుడు అబుబకర్- అల్-బాగ్దాదీ ప్రధాన శత్రువు. అందుకని నాటో కూటమిలోని భాగస్వామ్య పక్షమైన రష్యాతో చేతులు కలపటం తప్పనిసరి! కాదంటే డెమోక్రాట్లు అధికారం కోల్పోవచ్చు. సరిగ్గా ఇండియా పరిస్థితి కూడా అలాంటిదేనని పరిశీలకుల భావన.
నిన్నటివరకు అమెరికా ఆర్థిక సహాయంమీద ఆధారపడ్డ పాకిస్తాన్ నేడు చైనావైపు మొగ్గుచూపటం స్పష్టమైన రాజకీయ వ్యూహం. శ్రీలంక వంటి అతి చిన్న దేశం నిర్భయంగా తమిళ జాలర్లను అరెస్టుచేయటం సర్వసామాన్యమైంది. అక్కడి వేలుపిళ్లై ప్రభాకరన్‌ను భారత్‌లోని కొన్నివర్గాలవారు పాలుపోసి పోషించారు. ఫలితంగా జరిగిన అవాంఛనీయ పరిణామాలు విషాదాన్ని మిగిల్చాయి. ఇక చైనా విషయానికి వస్తే అక్కడ కూడా లోగడ భారత విదేశాంగ నీతి విఫలమైంది. 1948 చైనా విప్లవం తర్వాత తత్పూర్వం ఉన్న సాంస్కృతిక మూలాల మూలాలు నిర్మూలింపబడ్డాయి. అంతేకాదు టిబెట్, మానస సరోవర్ ఆక్సాయ్‌చిన్ వంటి ప్రాంతాలతోబాటు అరుణాచలప్రదేశ్‌ను కూడా చైనా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసింది. చౌఎన్‌లై 1962లో భారత్ పర్యటనకు వచ్చిన రోజునే చైనా సైన్యం ఈశాన్య ప్రాంతంలో ప్రవేశించింది. ఏమిటీ దుర్మార్గం? అంటే మెక్‌మోహన్ రేఖ నిర్దుష్టంగా రూపొందింపబడలేదు- అని సాకు చూపించింది. ఆనాటి యుద్ధాలలో చైనా చేతిలో భారత్ ఓడిపోయింది. నేపాల్ ప్రపంచంలో ఆధికారికంగా ఉన్న ఏకైక హిందూ దేశం. చైనా దానినికూడా నాశనం చేసింది. నేపాల్ భూకంప బాధితులను మొట్టమొదటగా ఆదుకున్నది భారతదేశమే. అలాంటి అతి చిన్న దేశం నేడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడగలగటం ఆశ్చర్యకరమైన విష యం.
దేశీయంగా చూస్తే కాంగ్రెసు ఒక అఖిల భారతీయ శక్తిగా అంతరించిపోయిన తర్వాత ములాయంసింగ్‌లు లల్లూప్రసాద్‌యాదవ్‌లు పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శించి బలమైన ప్రాంతీయ శక్తులుగా ఎదిగారు. అంటే నేడు భారతదేశంలో భారతీయ జనతాపార్టీ ఒక్కటే అఖిల భారతీయ స్థాయిగల ఏకైక పక్షంగా మిగిలిపోయింది. తక్కినవి కాంగ్రెసు ఉభయ కమ్యూనిస్టుల పార్టీలలో సహా ప్రాంతీయ పార్టీలే కావటం విచారకరం.
ఈ దశలో నరేంద్రమోదీ- పుతిన్‌ల మైత్రి అంతర్జాతీయ స్థాయిలో రాబోయే పరిణామాలకు ఉషోదయం వంటిది. రష్యా తర్వాత మోదీ కాబుల్ వెళ్లి అక్కడి భారత కార్యాలయం ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలతో చితికిపోయింది. నిరంతర తాలిబన్ల దాడితో సహజ జీవన పద్ధతి అక్కడ లోపించింది. పౌరులంతా ఆత్మరక్షణకోసం భుజాలమీద రాకెట్లు పెట్టుకొని తిరిగే దృశ్యాలు టి.వి.లలో చూశాము. మోదీ ఆఫ్ఘన్ పర్యటన అనూహ్య పరిణామాలు రాత్రికిరాత్రే సాధించలేకపోయినా ‘‘అటల్’’ బ్లాక్‌ను ప్రారంభించటం శాంతి స్థాపన దిశలో ఒక అంశ మాత్రమే. మరి విషాదమేంటంటే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని భారతీయ కాన్సులేట్ ఉన్న మజారే షరీఫ్ ప్రాంతంపై గత ఆదివారం రాత్రి పఠాన్‌కోట్ తరహా దాడి జరిగింది. మోదీ కాబూల్ వెళ్లి ఆర్థిక సహాయం ప్రకటించిన వారం రోజులు కూడా కాకముందే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
క్రిస్మస్ పర్వదినం రోజున అంతా శాంతి ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఎవరికీ చెప్పకుండా మోదీ లాహోర్‌లో అడుగుపెట్టి విస్మయాన్ని సృష్టించారు. నవాజ్ షరీఫ్ జన్మదిన వేడుకలు, ఆయన మనుమరాలి పెళ్లి అనేది కేవలం మిష- మాత్రమే, షరీఫ్- మోదీల మధ్య జరిగిన సంభాషణ- యుఫా- బ్యాంకాక్- అమెరికాల చర్చలు పొడిగింపుగా భావించాలి. ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే షరీఫ్ మాట పాకిస్తాన్ సైన్యం వినదు. ఈ చర్చల పర్యవసానాన్ని భారత్ చవిచూసింది.
పాకిస్తాన్‌లోని ముల్తాన్ ప్రాంతానికి చెందిన జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు శనివారం నాడు పంజాబ్‌లోని పఠాన్ కోట ప్రాంతంలో గల భారతీయ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడిలో ఏడుగురు భద్రతాదళ సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులు మాట్లాడుతున్న పంజాబీ యాసను బట్టి వారు ముల్తాన్ ప్రాంతీయులేననేది సుస్పష్టం. అంటే నేరం నుండి పాకిస్తాన్ తప్పించుకోజాలదు. జనవరిలో ఇండో-పాక్‌ల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరుగబోయే సమయంలో ఈ స్నేహ సంబంధానికి విఘాతం కలిగించడానికి ఇలా జరిగిందని విశే్లషకుల అంచనా. ఒక ఉగ్రవాది తన దాడికి ముందు పాక్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన సంభాషణలు రికార్డు చేయబడ్డాయి. అంటే పాక్ హస్తం ప్రత్యక్షంగా కనబడుతున్న పఠాన్‌కోట సంఘ టన భారత వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో జరిగింది. నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లి షరీఫ్ గారి మనవరాలిని ఆశీర్వదించి వచ్చిన తర్వాత కూడా ఇలా ఎందుకు జరిగిందనేది అంతుపట్టడం లేదు. లోగడ ఉదంపూర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడితో దీన్ని పోలుస్తున్నారు. భవిష్యత్తులో ఇండో-పాక్ సంబంధాలను ఎలా ఉంటాయో తెలియదు. కాకుంటే సైన్యం మీద ఉగ్రవాద సంస్థల మీద పాక్ ప్రభుత్వానికి అదుపు లేదన్నది సుస్పష్టం. పొరుగు దేశాలతో సహజీవనం గడపాలని కోరుకోవడంలో తప్పేమీ లేదుకాని, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం. అటువైపు నుండి కూడా సహకారం ఉండాలి కదా. నరేంద్రమోదీ గత డిసెంబర్ 25న లాహోర్‌లో నవాజ్‌షరీఫ్‌తో మంతనాలాడుతున్న సమయంలో దావూద్ ఇబ్రహీం నిర్భయంగా కరాచీలో తన 60వ జన్మదినాన్ని జరుపుకున్నాడు అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగాఉందో అర్ధంచేసుకోవచ్చు.జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ ఈ ఉగ్రవాద దాడి వెనుక ఉన్నాడు. అంతేకాదు కాశ్మీర్‌లోని ప్రజలను భారత్‌కు వ్యతిరేకంగా తిరగబడ వలసిందిగా పిలుపునిచ్చాడు. 2016 నూతన సంవత్సరం ప్రారంభంలో ఉగ్రవాదులు భారత్‌కు ఇచ్చిన కానుక ఇది. మరి భారత్ ఇవ్వబోతున్న కానుక ఏమిటి? ఉగ్రవాదులను నాలుగు రోజులల్లో భారత్‌కు అప్పగిం చకపోయ నట్లయతే మేమే ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తాం అని భారత ప్రభుత్వం నాలుగవ తేదీ సోమవారం సాయం త్రం అల్టిమేటం జారీ చేసింది.
సిరియాపై రష్యా-అమెరికాలు ఆర్థిక ఆంక్షలు విధించి నట్టే పాకిస్తాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిన సమయం ఆసన్నమైంది. పఠాన్‌కోట, ఆఫ్ఘనిస్తాన్‌లలో జరిగిన రెండు దాడులూ పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయంతో జరిగినవే. ఎందుకంటే ఇండో-పాక్-ఆఫ్ఘాన్ స్నేహం పాకిస్తాన్‌కు ఇష్టం లేదు. ప్రస్తుతం న్యూఢిల్లీలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. ముస్లిం ఉగ్రవాద సంస్థలు కేరళ, తెలంగాణ, కాశ్మీర్, బెంగాల్, యుపి, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లో సక్రియాత్మకంగా పనిచేస్తూ భారత్‌పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి.
రష్యా, అమెరికాలు కలిసి సంయుక్తంగా సిరియాలోని ఐఎస్‌ఐ స్థావరాలపై ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి. మరి ఇండియా ఐక్యరాజ్య సమితితో చెప్పి ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఎందుకు ధ్వసం చేయకూడదు? శ్రీకృష్ణరాయబారం, మహాభారత యుద్ధానికి ముందు జరిగింది. యుద్ధం అనివార్యం అని తెలిసినా రాయబారాలు తప్పవు. ఐక్యరాజ్యసమితి ఇప్పుడు భారత్‌ను తప్పుపట్టే అవకాశం ఉండదు. జనవరి 2016లో కార్యదర్శి స్థాయి చర్చలకు కూడా భారత్ అంగీకరించింది. పాక్ ఇంకా మొండిగా ప్రవర్తిస్తే సిరియామీద విధించినట్లే ఆంక్షలు విధించవలసి ఉంటుంది. శాంతికి, పగవానికి కూడా పరిమితులు ఉన్నాయి కదా. పఠాన్‌కోట సంఘటన తర్వాత ఇక చర్చలు ఎవరితో? జైషే మహమ్మద్ లష్కరే తోయిబా, ఇత్తెహాదుల్ మజ్లీస్ ముస్లిమీన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్..వీరితో చర్చలు జరుపుతారు? ఆక్రమిత కాశ్మీర్ విముక్తికి సమయం ఆసన్నమైనదని తోస్తున్నది.
ఇక దేశీయంగా మోదీని ఇబ్బందిపెట్టేందుకు ఆనందశర్మలు మణిశంకర్ అయ్యర్‌లూ ఉండనే ఉన్నారు. అలాగే ఇండో- రూసీ మైత్రి బలపడితే భారత ప్రతిపక్షాలల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఉభయ కమ్యూనిస్టుల మధ్య అగాధం మరింత పెరుగుతుంది. కాంగ్రెసు పార్టీలో సూడో సెక్యులరిస్టువర్గం ఒకటి రోమన్ క్యాథలిక్ వర్గం ఒకటి ఉంది. క్యాథలిక్కులు ఇకమీద అమెరికావైపు చూపులు సారింపవచ్చు. అంటే అనూహ్యంగా నరేంద్రమోదీ చాణక్యాన్ని ప్రదర్శించినట్లయింది. నేతాజీ ఫైళ్లు బయటకురావటంవల్ల పుతిన్‌కు వచ్చే నష్టమేమీ ఉండదు కాని ఇండియాలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనపడవచ్చు. నట్వర్‌సింగులు శరత్‌పవార్‌లు అప్పుడే తన నిరసన గళం వినిపించారు. మన్మోహన్‌కు బదులు ప్రణబ్‌ముఖర్జీని ప్రధానిగా అప్పుడు ఎన్నుకొని ఉంటే పార్టీకి ఇప్పుడీ దుర్గతి వచ్చి ఉండేదికాదు’’ అని సల్మాన్‌ఖుర్షీద్ తన ఆత్మకథలో వ్రాశారు. అంటే కాంగ్రెసులో అసమ్మతి గళాలు క్రమంగా పెరుగుతు న్నాయని అర్థం. దీని నుండి ఆ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.
మోదీ లాహోరు పర్యటన- లోగడ వాజపాయి బస్సుయాత్ర వంటిదే. దీనివలన వెం టనే సత్ఫలితాలు వస్తాయని ఆశించటం అత్యాశే అవుతుంది. దుష్ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తుంటాయ. దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించరు. కాశ్మీరు లోయలో ఐసిస్ జెండాలు రెపరెపలాడుతూనే ఉంటా యి. ఐఎస్‌ఐ- తన విచ్ఛిన్నకర కార్యకలాపాల కొనసాగింపు యధాప్రకారంగానే ఉంటుంది. కాకుంటే పాకిస్తాన్ ఈ స్నేహహస్తాన్ని విస్మరిస్తే మరో సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లవుతుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఇండో- రష్యన్ మైత్రీబంధం-ఒక చారిత్రక అనివార్యం!!

- ముదిగొండ శివప్రసాద్