ఉత్తరాయణం

తీరుమారని ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణంలోని కింగ్‌జార్జ్ ఆసుపత్రి బ్రిటీషు వారి కాలంలో ప్రారంభించబడింది. వందేళ్లకు పైగా చక్కగా నడిచిన కెజిహెచ్ తర్వాతి కాలంలో పెను మార్పులకు లోనై ప్రస్తుతం కుహనా రాజకీయాలకు నెలవై అధ్వాన్న పరిస్థితిలో ఉంది. జనరేటరు పనిచేయ దు, లిఫ్టులు లేవు. డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసుల్లో మునిగి తేలుతుంటారు. రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి షరా మామూలే. అటువంటి పరిస్థితిలో ఆసుపత్రి ఎందుకో బోధపడటం లేదు. ఇటీవల కెజిహెచ్‌ను సందర్శించిన వైద్యశాఖా మాత్యులు హెచ్చరించినా ఫలితం లేదు. ఈ ఆసుపత్రి తీరు మారదా?
- పట్టిసం శేషగిరిరావు, విశాఖపట్టణం
ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో బాలలు
ప్రస్తుతం దేశంలో వినోద, విజ్ఞాన విషయాలను ప్రజానీకానికి అందించడంలో దృశ్య మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించడం గమనార్హం. ఈ నేపధ్యంలో వందల కొద్ది దృశ్యమాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొన్ని మాధ్యమాల్లో జుగుప్సాకరమైన హాస్యం పేరుతో చెవులు వినరాని వ్యంగ్య సంభాషణలు చోటుచేసుకోవడం విశేషం. ముఖ్యంగా చిన్న పిల్లలతో పిచ్చి పిచ్చి నృత్యాలు చేయించే వివిధ భంగిమల్లో సర్కస్‌లో మాదిరిగా నృత్యా ల పేరుతో వయస్సుకు మించిన విన్యాసాలు చేయించడం బాధాకరం. చిన్న పిల్లలతో వ్యంగ్య సంభాషణలు, నృత్య విన్యాసాలు చేయించడం భావ్యమా?
- కొలుసు శోభనాచలం, గరికపర్రు
భిన్నత్వంలో ఏకత్వం
అతి పురాతన సంస్కృతి, సంప్రదాయాలుగల భరతదేశం మనది. ఈ పుణ్యభరత భూమిలో విభిన్న కులాలు, మతాలు, జాతులు, భాషలు కలిగి వున్నాయి. అయినా భిన్నత్వంలో ఏకత్వ విధానమే సంప్రదాయంగా భావించుకొని ఐకమత్యంతో సహ జీవనం చేస్తూ సోదర సౌభాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి మన దేశంలో నేడు మతం, ప్రాంతం, భాషా, జాతుల పేరున ప్రజలందరినీ విభజించి పరిపాలించాలని స్వార్థపర రాజకీయ వాదులు కుట్ర పూరితమైన పన్నాగాలు పన్నుతున్నారు. మతం పేరున ప్రజలను రెచ్చగొట్టే పరిపాలకులను, వారి పరిపాలనా విధానాలను ఎంతమాత్రం చూస్తూ వౌనం వహించకూడదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రజాస్వామ్య దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చేయి చేయి కలిపి, బిజెపి విధానాలను, ఎదిరించడానికి కంకణధారులై నిలువాలి. మహనీయమైన జాతీయత మీద కేంద్రంలో బిజెపి పరిపాలకులు కుట్ర పూరితమైన విధానాలను అనుసరిస్తున్నారు. భిన్నత్వంలోని ఏకత్వ విధానమే ప్రధాన ధ్యేయంగా అనుసరిస్తున్న కాంగ్రెస్(ఐ) పార్టీ, దేశ ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా భావించుకొని, దేశ సమైక్యత, సమగ్రతలకోసం పాటుపడుతూ వస్తున్నది. విష పూరితమైన విధానాలను ఎండగట్టి భారతీయులంతా ఒకటేనని, జాతి ప్రజలంతా స్వార్థపర దుష్టశక్తులు విసిరే ఎంతటి సవాళ్లనైనను ధీటుగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు కలిగి వున్నామని ప్రపంచానికి మరోమారు చాటుకోవాలి.
- రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్
పెట్రోలు ధరలు తగ్గించాలి
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 120 డాలర్ల నుండి 34 డాలర్లకు తగ్గిపోయింది. కాని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించకుండా రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు లాభం చేకూర్చే ప్రయత్నంలో వున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పోర్బ్స్ జాబితాలో ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానం ఆక్రమించడం ఖా యం. పరిస్థితి ఇదే విధంగా ఉంటే రిలయన్స్ షేర్ ధర 1200 వరకూ పెరుగుతుంది. వెంటనే మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు 10 రూపాయలు తగ్గ్గించాలి.
- నల్లమిల్లి సుబ్బారెడ్డి, అనపర్తి
ఏదీ నిరుద్యోగ నిర్మూలన?
నిరుద్యోగ నిర్మూలన చేస్తామన్న ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు పరిమితి 60 ఏండ్లకు పెంచింది. ఇంకా కేంద్రంలో 65 ఏండ్లు చేస్తామంటోంది. మరి నిరుద్యోగులు మాట ఏమిటి? వృద్ధాప్య పింఛనులు 65 సం.లు పెంచారు. నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామని గాలికొదిలేశారు. ఇప్పుడు ఒక చేతికి డిగ్రీ, మరో చేతికి ఉద్యోగం అంటున్నారు. నిరుద్యోగుల నీడ నివ్వని నిలకడ లేని ప్రకటనలు ఎందుకో? గత ప్రభుత్వం ఉపాధ్యా య, ఆరోగ్య శాఖలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసింది. మెగా డిఎస్‌సిలు పెట్టి నిరుద్యోగ నిర్మూలన చేసింది. కుడి చేయికి పట్టా ఎడమ చేయికి పోస్టు ఎప్పుడో!
- నీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పార్టీలు మారితే ఎన్నికలు జరపాలి
ఎన్నికల్లో గెలిచిన వారు పార్టీలు మార్చితే ప్రభుత్వం ఎన్నికలు జరపాలి. కాని ప్రభుత్వం అలా జరపడం లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.