మెయన్ ఫీచర్

ఉడుతలు లేని ఊరు.. పిచ్చుకలు లేని గూడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్టేలియాలోని ఒక జాతి చెట్లు అంతరించిపోతున్నాయట! గట్టి ‘కలప’ నిచ్చే ఈ మహావృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. కానీ ఉన్న చెట్లను నరికివేస్తున్న ఆస్ట్రేలియా తెల్లవారు తమ దేశంలో ఈ జాతికి చెందిన ఒక కొత్త చెట్టు కూడ పెరగకపోవడం గురించి డెబ్బయి ఏళ్ల క్రితం గుర్తించారు. ఇలాంటి విలువైన వృక్షాలు ఎందుకని కొత్తగా మొలకెత్తడం లేదు?? ఈ చెట్ల కాయలు విరివిగా రాలి భూమిమీద పడుతున్నప్పటికీ విత్తనాలు అంకురించడం లేదని పరిశోధకులు నిర్ధారించిన వాస్తవం... మరింత పరిశోధన జరిగింది!! విచ్చలవిడిగా పశుపక్ష్యాదులను వన్యమృగాలను వేటాడి వాటి మాంసాన్ని మెక్కే ఐరోపా దుర్జన స్వభావం ఈ మహావృక్షాలు నశించిపోతుండడానికి కారణమన్నది తదుపరి పరిశోధనలలో తేలిన వాస్తవం!!
మనుషులను వేటాడి చంపిన ‘ఐరోపా’ వారి క్రౌర్యం అంతర్జాతీయ చరిత్రను చిత్ర విచిత్రగతులలో నడిపించింది! బ్రిటిష్‌వారు మన దేశంలో తమ వికృత స్వభావాన్ని వ్యవస్థీకరించిన సమయంలో వారి ‘్భత దయారాహిత్యం’ మన ప్రసిద్ధులలో, విద్యావంతులలో అధికులను ఆవహించింది! ఈ ‘విద్యావంతులు’ వారి వారసులు, ‘ప్రసిద్ధులు’ వారి సంతానం విచ్చలవిడిగా అపురూప పక్షులను, జంతువులను హత్యచేస్తుండడం నడుస్తున్న చరిత్ర!! ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో నెలకొని ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి సిబ్బంది కలసి ఓ పెద్ద జింకను ఇటీవల కాల్చి చంపడం ‘్భత దయ లేని తనానికి’ ఒక ఉదాహరణ మాత్రమే!! వీళ్లందరూ తిన్న తరువాత కూడ ఆ జింక మాంసం ఇంకా మిగిలిపోయిందట! అందువల్ల ముక్కలు చేసిన మాంసాన్ని సంచులలో ‘కూరి’బయటికి తరలించి అమ్మడానికి పూనుకున్నారట! ఇదే సమయంలో తిరుమల ప్రాంగణంలోని శేషాచలం అడవులలో దుండగులు ఓ ‘చారల జింక’ను చంపేశారు. వం డి విందు చేసుకోవడానికి వీలుగా బియ్యం బస్తాను మృత హరిణ కలేబరాన్ని ఓ నీటి వాగువద్దకు చేర్చారట!! ఇక్కడ ఇదంతా జరుగుతుండిన రోజుననే అక్కడ మహారాష్టల్రోని నాగపూర్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి, పెద్దపులి ఒక సెలయేరు సమీపంలో మరణించి పడి ఉన్నాయి......
ఇలా వన్యమృగ హననం చేస్తున్న వారిలో అత్యధికులు తథాకథిత విద్యావంతులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, ‘ప్రసిద్ధి’ ముసుగును వేసుకున్న ‘‘నట విట గాయక గణికా’’ జనాలు!! మన్సూర్ అలీఖాన్ పటౌడీ అనే ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడిని హరియాణ రాష్ట్రంలోని ఝజ్బార్ అన్నచోట క్రీస్తుశకం 2005 జూన్‌లో పోలీసులు అరెస్టుచేశారు, అతగాడు తన మిత్రులతో కలసి పయనిస్తుండిన విలాస వాహనంలో ‘నల్లజింక’ మృతదేహం పోలీసులకు లభించింది! సమీపంలోని రక్షిత అటవీ ప్రాంతంలో ఈ నల్లజింకను పటౌడీ స్వయం గా కాల్చి చంపినట్టు మిత్రులలో ఒకడైన మదన్‌సింగ్ అనేవాడు బయటపెట్టాడు. ఆ తుపాకీ కూడ ‘విలాస వాహనం’లో దొరికింది! పటౌడీని అతగాడి ఆరుగురు మిత్రులను పోలీసులు అరెస్టుచేశారు!! తరువాత ‘బెయిల్’ వచ్చింది.... ఇది ఒక ఉదాహరణ మాత్రమే!! పట్టుబడక ముందు ఈ పటౌడీ ఎన్ని వన్య జంతువులను చంపి కడుపులో దాచుకున్నాడో?? పట్టుబడని పటౌడీ వంటి ప్రసిద్ధులు ఎన్ని వందల, వేల వన్యప్రాణులను హతం చేశారో?? హిమాలయాలలోని ‘కృష్ణసారమృగాలు’ దాదాపు అంతరించిపోయాయి!! కృష్ణసార మృగం సంచరించే ప్రాంతం పవిత్రమైనదన్నది ‘ఇతిహాసం’ చెప్పిన మాట! కస్తూరి జింకలు కనుమరుగైపోయాయి. ‘పునుగు’ పిల్లులు ఉండేవన్నది నాయనమ్మల ‘కథలై’ పోయాయి!! ‘పిచ్చుకలు’వాటి ‘గూళ్లు’ గత చరిత్రలు.... ప్రకృతిమాత ‘పలుకులై’న చిలుకలు, కోకిలలు మూగబోయాయి. చిట్టి ‘ఉడుతలు’ ముచ్చటగొలిపే దృశ్యాలు పల్లెసీమలలో సైతం ఆవిష్కృతం కావడం లేదు. ‘‘కాకులు కూత మానుకొని కాననసీమకు పారిపోయె....’’ నన్నది నిన్నటి మాట! నేడు అడవులు కూడ లేవు.... వన్యమృగాలను హత్యచేసి ఆరగించిన తరువాత ఎప్పుడో అప్పుడు పట్టుబడిన ‘ప్రముఖుల’ నేరాలు న్యాయస్థానాలలో ధ్రువపడడం లేదు!! వన్యప్రాణులకు న్యాయం జరుగదు....
ఇప్పుడు శేషాచలం అడవులలో ‘నల్లజింక’ను చంపిన ఇద్దరిలో ఒకడు మాజీ ‘పోలీస్’ఉద్యోగి అట! తమిళనాడుకు చెం దిన ఈ ‘హంతకుడు’ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై శిక్షణకూడ పొందాడట! కానీ ‘పోలీసు’గా ఉండడంకంటె, ‘ఎఱ్ఱగంధం’ చెక్కలను దొంగ రవాణా చేయడం ‘‘మరింత లాభసాటి’’అని గ్రహించి పోలీసు ఉద్యోగాన్ని వదలి వేశా డు, గంధం దొంగగా స్థిరపడినాడట!! శేషాచలం అడవులను హననం చేస్తున్న ఎఱ్ఱదొంగలు చుట్టుపక్కల గ్రామాలలోకి చొరబడి ఆవులను, గొర్రెలను దొంగిలించి చంపి భోంచేస్తున్నారట!! ఈ మాంసంతో తృప్తితీరని వీరు ‘నల్లజింకల’ను నమిలి మింగడానికి పూనుకున్నారు.... చదువుకొనడంవల్ల ప్రాణికోటి పట్ల ‘మమకారం’ పెరగాలన్నది భారతీయ సంప్రదాయం! ఒక మహర్షి ఒక ‘చిట్టిచేప’ను ప్రమాదాలనుండి రక్షించి పెంచి పెద్దచేయడం ఈ ‘వైవస్వత’ మన్వంతరం ఆరంభంనాటి ముచ్చట! అలా రక్షించినవాడు సత్యవ్రతుడు, ఈ భూతదయ సత్యవ్రతుడిని ‘మనువు’ను చేసింది, సమస్త ధరాపాలకుడిని చేసింది!
‘‘నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును, ‘‘నితాం
తాపారభూతదయ’’యును
తాపస మందార! మాకు దయచేయగదే!’’
అని ప్రార్థించిన జాతి ఇది.... ఈ ప్రార్థన ఇప్పుడు పాతబడిపోయింది! బ్రిటిష్‌వారు వచ్చిపడిన తరువాత మన చదువుల స్వభావం మారిపోయింది! చదువుకోనివారు, నిరుపేదలు, బడుగుజీవులు వేటను వృత్తిగాచేసుకొని ఆకలి తీర్చుకోవడం భారతీయ చరిత్ర! బ్రిటిష్ విద్యావిధానం ప్రభావం వ్యాపించనిచోట నిన్నమొన్నటివరకు ఇదే చరిత్ర నడిచింది!!
కానీ బ్రిటిష్‌వారు ‘మప్పిన’ విద్యల వికృత ప్రభావం ఇప్పుడు ప్రస్ఫుటిస్తోంది!! బలవంతుడు బలహీనుణ్ని బలితీసుకోవడం బ్రిటిష్ విద్యల ప్రభావం!! అందువల్లనే ‘డబ్బు’ముదిరినవారు రకరకాల మాంసాలను మరిగి అడవులలోకి చొరబడి సాధుజంతువులను చంపి తింటున్నారు. ఉడుతలను పిచ్చుకలను భోంచేస్తున్నారు! ప్రకృతిలో సగం వృక్షజాలం మిగిలిన సగం జంతుజాలం! వృక్షజాలం మనుగడ జంతువులపై ఆధారపడి ఉంది, జంతుజాలం మనుగడం వృక్షాలపై ఆధారపడి ఉంది! ఆస్ట్రేలియాలో నశించిపోతున్న ఆ మహావృక్షాల ‘వ్యథ’ ఈ పరస్పర ఆశ్రయతత్త్వాన్ని మరోసారి ధ్రువపరచింది....
బ్రిటిష్‌వారు ఐరోపావారు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది చివరిలో ఆస్ట్రేలియాలోకి చొరబడిపోయారు!! అంతవరకు, అనాదిగా ఆస్ట్రేలియాలో జీవించిన ఆదిమ జాతుల వారిని వేటాడి చంపేశారు!! ఆస్ట్రేలియా మొత్తం ఐరోపా ‘తెల్ల’వారి దురాక్రమణ బలైపోతోంది. ఈ దురాక్రమణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకంటె ఆస్ట్రేలియాలోని ‘స్వజాతి’ నామరూపాలు లేకుం డా నశించింది. కొన్ని వేలమంది అనాది మానవులు - అబోరిజిన్స్-మాత్రమే ఆస్ట్రేలియాలో మిగిలి ఉన్నారు. ఇలా దురాక్రమించిన ఐరోపా దొంగలు, వారి సంతతి ఆస్ట్రేలియాలో కొత్త ‘స్వజాతి’గా మారడం రెండువందల ఇరవై ఏళ్ల చరిత్ర. ఆస్ట్రేలియాలో అంతరించిన పాత ‘స్వజాతి’ ప్రజలు ప్రకృ తి ఆరాధకులు, ప్రకృతి ఆరాధన భారతీయుల వేద సంస్కృతి! అందువల్ల ఆస్ట్రేలియాలోని ఆదిమజాతి ప్రకృతిని వేలాది ఏళ్లు సంరక్షించింది! వన్యమృగాలు, పక్షు లు, చేపలు, జలచరాలు బతికాయి!! కానీ ఐరోపా సంతతికి చెందిన కొత్త జాతివారు వంద యాబయి ఏళ్లలోనే ‘ఆస్ట్రేలియా’ప్రకృతిని విధ్వంసం చేశారు! ఒక ‘పక్షి’జాతిని సంపూర్ణంగా నిర్మూలించారు.
ఈ పక్షుల మాంసం బ్రిటిష్ సంతతివారి నోళ్లకు అత్యంత రుచికరమైందట!! ఈ పక్షులు అంతరించడంతో ఉక్కు వంటి గట్టి కలపను సమకూర్చే ఆ మహావృక్షాల విత్తనాలు మొలకెత్తడం మానుకున్నాయి, అందువల్ల ఆ ‘మహావృక్షాల సంఖ్య తగ్గిపోయింది, అవి కూడ అంతరించడం ఖాయమన్నది పరిశోధకులు కనిపెట్టిన ప్రాకృతిక రహస్యం... ఎందుకంటె ఈ మహావృక్షాల పండ్లను ఆ ‘పక్షులు’తినాలి! గుజ్జును జీర్ణించుకొని విత్తనాలను విసర్జించాలి!! అలా ఆ పక్షులు విసర్జించిన విత్తనాలు మాత్రమే మొలకెత్తగలవట! నేరుగా చెట్లునుండి రాలిన పండ్లలోని విత్తనాలు కాని, ఇతర రకాల పక్షులు తిని విసర్జించిన విత్తనాలు కాని మొలకెత్తలేదు.... సృష్టిగతమైన ఈ సనాతన రహస్యాన్ని ‘ఆస్ట్రేలియన్లు’ ఆ తరువాత కనుక్కున్నారు!! ఆ ప్రత్యేక జాతి పక్షులను విచక్షణ రహితంగా వేటాడి నిర్మూలించినందుకు పశ్చాత్తాపం చెందా రు!! ఆ ప్రత్యేక జాతి పక్షులు ఒకటోరెండో ఎక్కడైనా బతికి ఉన్నాయేమో కనుగొనడానికి అనే్వషణలు సాగుతున్నాయి.
ప్రముఖ రచయిత స్వర్గీయ చిట్టా దామోదరశాస్ర్తీ తమ ‘శే్వతద్వైపాయనుడు’అన్న వాస్తవగాథలో ఇలాంటి మరో ప్రాకృతిక అద్భుతాన్ని ఆవిష్కరించి ఉన్నాడు. అద్భుతమైనప్పటికీ ఇది సత్యం! అమెరికాలోని ఒక ‘తెల్లవాడు’డబ్బు పట్టలేక ఆఫ్రికాకు వెళ్లి మృగయా వినోదం మరిగాడట.... ఇలా వేటలాటలు ఆడుతూ ఉన్న సమయంలో అతగాడు ఒక మగ నెమలిని చంపి తినేశాడు. అనేక ఆడ నెమళ్లు అక్కడికి వచ్చి ఏడ్చి ఏడ్చి వెళ్లిపోయాయి!! ఆ తరువాత కొన్నాళ్లకు తెల్లవాడి శరీరం కారునలుపు రంగుకు మారిపోయింది!! అతగాడు అమెరికాకు వెళ్లిపోయాడు!! కానీ తెల్లవాడు నల్లవాడైపోయాడు!! దిగులుతో చిక్కిపోయాడు.... చివరికి చికిత్సకోసం మన రాజస్థాన్‌లోని ఒక ఆయుర్వేద వైద్యుని ఆశ్రమానికి వచ్చి చేరాడు! కొన్ని నెలలలోనే ‘పంచగవ్య’ చికిత్సద్వారా ఆ వైద్యుడు ఆ నల్లవాడిని తిరిగి ‘తెల్ల’వాడిగా మార్చగలిగాడు!! ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం ఈ ఐదూ పంచగవ్యాలు! ఇలా ఆ విచిత్ర వ్యాధిని నయంచేయడం ‘పంచగవ్యాల’ గొప్పతనం.... ఆ వైద్యుని గొప్పతనం, ఆ యుర్వేద శాస్త్ర మాహాత్మ్యం... కానీ తెల్లవాడు ‘నల్లవాడు’గా ఎందుకయ్యాడు?? నెమలిని అతడు చంపడానికి ముందు ఆ నెమలి ఒక ‘విష సర్పాన్ని’ భుజించింది! పాము విషం నెమలి కడుపులో సహజంగా జీర్ణం అయిపోతుంది!! కానీ అలా జీర్ణంకాక పూర్వమే ఆ నెమలిని ఈ ‘తెల్ల’వాడు హత్యచేసి ఆరగించాడు! ఇతగాడి కడుపులో అలా విషాన్ని జీర్ణించే వ్యవస్థలేదు..అందుకే విష ప్రభావంతో నల్లబడిపోయాడు!! సృష్టిలోని సమస్త ‘కణాలు’ పరస్పరం ముడివడి ఉన్నాయి..... విధ్వంసంలో, వికాసంలో!!

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352