ఉత్తరాయణం

ఆలయాల కూల్చివేత దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేత అత్యంత దారుణమైన చర్య. ఈ విషయంలో కొంతమంది నేతలు ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆలయాలను కాపాడుకోలేనప్పుడు వాటిని నిర్మించడమెందుకు? ఒకవైపు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న సమయంలో ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. గోశాలను కూల్చడం, విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేయడం రాజ్యానికి మంచిది కాదు.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా
ఎవరి మెప్పుకోసం ఈ పనులు?
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డుకింద లక్ష రూపాయలు వచ్చాయి. పత్రికా విలేకర్లు వచ్చి ఈ అవార్డు సొమ్మును మీరేం చేస్తారని అడగ్గా, ‘మా ఊళ్లో జీర్ణించిన శివాలయం ఉంది. దానికి కొంత వెచ్చిస్తా’ నన్నారాయన. మరి మన చంద్రబాబు నాయుడేం చేశారు? పవిత్రమైన కృష్ణా పుష్కరాల సందర్భంగా 30 దేవాలయాలను కూల్చివేశారు. నిజంగా ఇది ఆక్షేపణీయం. నాడు ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను కూల్చివేశారు, నేడు ఆ పని మళ్లీ చంద్రబాబు చేశారు. కాకినాడలో రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మసీదు అడ్డువస్తే దాన్ని ముట్టుకోలేదు. అదే ఉదారభావం ఇక్కడ ఎందుకు లేకపోయింది? దేవాలయాల ప్రతిష్ట ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతుంది. అటువంటి వాటిని రాత్రికి రాత్రే ఎందుకు తొలగించవలసి వచ్చింది? నాడు గోదావరి పుష్కరాలు 29 నిండు ప్రాణాలను బలిగొంటే, నేడు కృష్ణ పుష్కరాలు 30 దేవాలయాలను బలిగొన్నాయి. ఎంతో మంది మనుసులను క్షోభింపజేసి, ఎవరి మెప్పుకోసం ఈ పనులు? నిజంగా ప్రజా రంజక పాలన అంటే మెజారిటీ వర్గాలను క్షోభింపజేయడం కాదు.
- కె.వి. రమణమూర్తి, కాకినాడ
ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య
అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ దేశంలోని నైస్ నగరంలో ఓ ఉగ్రవాది జనసమూహంపై ట్రక్కును వేగంగా నడిపి రెండు వందలకు పైగా ప్రాణాలు తీయడం, వందల మందిని గాయపరచడం సహజంగానే ప్రపంచ దేశాలని దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్ని దేశాలు ఐకమత్యంగా ఒకటయతే ఉగ్రవాదలు వూపిరి తియ్యడం ఎంతసేపు? ఈ కలయక కొరవడితే అమాయక ప్రజలు ఉగ్రవాద భూతానికి ఆహుతి కాక తప్పదు. వ్యవస్థ అస్తవ్యస్తమవు తుంది. ఇది వొక దేశ సమస్య కాదు. అంతర్జాతీయ విపత్తు. ఈ ఉగ్రవాదులకు ఆర్థికంగా వూతమిచ్చే రోగ్ దేశాలను, సంస్థలను కనుగొని వారితో గల సంబం ధాలను త్యజించాలి.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
బిసిలకు అన్యాయం
వెనుకబడిన తరగతుల పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు పదే పదే వల్లెవేస్తుంటారు. మాటలలో తప్ప చేతలలో బిసిలకు చేసిందేమీ లేదని తేటతెల్లమైంది. కాపుల్ని బిసిలలో చేర్చుతుండటం మాటలకే పరిమితమైంది. కేంద్రమంత్రివర్గంలో ఇద్దరు అగ్ర కులాలవారే! ఇటీవల రాజ్యసభకు పంపించే అభ్యర్థులలో ఒక్కరూ బిసిలకు అవకాశమివ్వకపోవటం వంటివి చూస్తుంటే కరివేపాకులా బిసిలను ఉపయోగించుకుంటున్నట్లు అవగతవౌతోంది.
రైళ్లు, బస్సులు తగులబెట్టిన పదహారు శాతం ఉన్న కాపులకు వెయ్యి కోట్లు, ఏభైరెండు శాతం వున్న బిసిలకు ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు బడ్జెట్‌లో కేటాయించటం వంటి పనులతో బిసిలకు అంచెలంచెలుగా వెనుకకు నెట్టబడుతున్న సంకేతాలు సాక్షాత్కరిస్తున్నాయి. బిసి సబ్ ప్లాన్ ఏర్పాటుచేస్తామని ఎన్నికల ముందు చెప్పినా అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసేలేదు. బిసిలను పల్లకీ మోసే బోరుూలుగా పరిగణించటం పార్టీ భవిష్యత్‌కు మంచిది కాదు. బిసిలకు జరుగుతున్న అన్యాయాలను తక్షణం పరిగణనలోనికి తీసుకుని కేంద్రమంత్రివర్గంలోను ఇతర నామినేటెడ్ పదవుల్లోను దామా షా పద్ధతిలో నియామకాలు జరపగలరని ఆశిస్తున్నాం.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం