వీరాజీయం

కశ్మీర్ హమారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రకోట బురుజు మీదా, అతి పేదవాడి గుడిసె మీదా ఒక్కలాగే త్రివర్ణాంకిత పతాకం- ఎగురుతున్న పర్వదినం యిది. ఇవాళ సంబరాల హేల దానిమధ్య మన తిరంగా ప్యారా- ఇండియన్స్ ఎక్కడున్నా వినీలాకాశాన్ని సువర్ణ త్రివర్ణ్భరిత శోభలతో నింపుతూ- ఫర్-్ఫర్‌న్ర ఎగురుతున్న సమయంలో దేశంలోనే అంతర్ భాగమై, శిఖరాగ్ర ప్రదేశమై వున్న జమ్మూ కశ్మీర్‌లో ఎగురుతోందా? - ఎగిరితే ఎలా ఎగురుతోంది?
ఢెబ్బై సంవత్సరాలైంది. ఇండిపెన్‌డెన్స్‌డేకి ముందు ఎప్పుడేనా, కశ్మీర్ భూభాగం మీద, జెండాదిమ్మల మీదా మన జెండా ‘ఊంఛా రహేగా హమారా’ గానం మార్మ్రోగిందా? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగమంటున్నావ్? మరి ఆర్టికల్ 370 ఏమిటి? దేశంలో చట్టాలకీ, చట్రాలకీ ఒక రాజ్యాంగం- కశ్మీర్ వ్యవహారాలకింకో రాజ్యాంగం- రూలు ఏమిటి?’’అని, కొత్తగా ఇరవై ఏళ్ల క్రిందట పుట్టిన కుర్రాడు నిన్నడిగితే- నువ్వు గత ఏభై ఏండ్ల చరిత్ర చూడు నాయనా!’’ అని తప్పుకుంటావా? లేక, ‘వాడు రుూ చరిత్ర తెలియకనే, చూడకనే యిటువంటి ప్రశ్నలు వేయకూడదు-’ అంటావా?
పోనీ మనం ఆలోచిద్దాం. నిన్నగాక మొన్న పత్రికల నిండా వార్తలు వచ్చాయి. కశ్మీర్‌లో, గ్రామీణ ప్రాంతాలలో ఆగస్టు 14న భారీ ఎత్తున ర్యాలీలు, ఉత్సవాలూ జరుపుకునే మిలిటెంట్ల ఏర్పాట్లు- కాంక్రీట్ దిమ్మల మీద- డ్రయినేజ్ గొట్టాలను ధ్వజస్తంభాలుగా పాతి- పాక్ అంటే మోజుపడే వర్గాలు చేస్తున్నారు అనీ-
రాజ్యసభలో - ‘కాంక్రీట్ ఏక్షన్... కాంక్రీట్ ఏక్షన్’- అంటూ అరిచిన శ్రీమాన్ ఏచూరివారు రుూ కాంక్రీటుదిమ్మల బాసులతోనా చర్చలు జరపమంటాడు?-
‘‘రాళ్లు రువ్వుతూ, ఆ వెనుకనుంచి గ్రెనేడ్లు విసురుతూ, పాక్ బ్యానర్లు జెండాలూ ఝుళిపిస్తూ- ప్రభుత్వ- సారీ! ప్రజల ఆస్తుల్నీ తగలెడుతున్న విధ్వంసక శక్తులతోనా? పుష్పమాలల, పూలగుత్తులూ పట్టుకునిపోయి చర్చలు జరపాల్సిందీ? పాకిస్తాన్‌కు ఆగస్టు 14, ఇండియాకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాలెలా ఏర్పాటుచేసుకున్నారు? ఆ దినం- ఎందుకు చేసుకున్నారు?
సరిగ్గా నెల్లాళ్లయింది కర్‌ఫ్యూ క్రింద మ్రగ్గిపోతున్న జమ్మూకశ్మీర్ ప్రజలంతా పాకిస్తాన్ ప్రియులేంకారే? బుర్హన్‌వనీని ‘వీరు’నిగా కీర్తిస్తున్న వాళ్లుకారే? మిగతావాళ్లంతా ఎన్ని కష్టాలు పడుతున్నారు? ఎందుకని?-
ఇదే కథ 2004, 2005, 2008, 2010- యిలాగే రిపీట్ అవుతున్నదే? ప్లాను పేరు ఏదైనా- దాని అమలుకు వో రోడ్డుమ్యాపు వున్నదా? ఇంత వైశాల్యంగల దేశంలో ఒక్క శాతం మేర మాత్రం ఆక్రమించుకున్న కశ్మీర్‌కు దేశ బడ్జెట్‌లోనుంచి పది శాతం కేటాయింపులు జరుగుతున్నట్లు ఎక్కడో చదివాను. ఈ సంగతి కశ్మీరీలకు తెలుసునా? తెలియదేమో?
మొన్న మన ప్రధాని మోదీగారన్నాడు. ‘‘కశ్మీరీలను ఇండియన్స్ ప్రేమిస్తున్నారు. (కొలంబస్... కొలంబస్...’’అంటూ అరిచిందో యువతి.) కానీ కశ్మీరీలకు మిగతా ఇండియా ఎలా వుంటుందో? ఎంత తెలుసు? బి.జె.పి; పి.డి.పి.ల గవర్నమెంటు అస్సలు పరిస్థితులను చక్కదిద్దలేక పోతోందనీ- నెలరోజులకు పైబడ్డ కర్‌ఫ్యూ దారుణ మారణ దినాలు చెప్పటం లేదా?
ఒకప్రక్క రుూ బాధ, ప్లస్ ‘‘కూలిచ్చి గుద్దించుకున్నట్లు’’ భారతావని అంతా రుూ బాధతో పరోక్షంగా కుళ్లికుములుతూంటే-
పాకిస్తాన్ అవతల రాజకీయంగా 2004, 2005, 2008, 2010- ఏడాదేదయితేనేం? కాశ్మీర్ ప్రజలు ‘ఫ్రీడం’కోసం అల్లాడిపోతున్నారని ప్రచారం మోపుచేస్తోంది. మీరేం చేస్తున్నారు?
మన రాజ్యసభ యిక్కడనుంచి- కశ్మీర్ ‘‘మాదే’’ నంటూ తీర్మానం చేయడంలో అబ్బురం లేదుగానీ- కశ్మీర్ సమస్య భారతదేశ అంతర్గత సమస్య కాదూ- అంటూ నవాజ్‌షరీఫ్ మహాశయుడు మళ్లీ అంతర్జాతీయ అభిప్రాయ సేకరణకు ఉద్యమం మొదలుపెట్టాడు. అదే డేంజర్- వేకప్ వేకప్!
ఉగ్రవాదాన్ని కశ్మీర్ మీద రుద్ది- అక్కడనుంచి అనగా పాక్‌నుంచి మిలిటెంట్ ఆగడాలను దిగుమతి చేసి పాకిస్తానే- కశ్మీర్‌లో అశాంతి, అరాచకం, హింస, జన హత్య చేస్తున్నదీ అని మనం అంటే చాలదు- ఆ వున్న వాస్తవాన్ని అంతర్జాతీయ శక్తులు కూడా చూడాలి అనాలి.
‘‘కశ్మీర్ ఎవరిదీ?’’అంటూ ‘‘హురియత్’’లతో పాకిస్తాన్ ప్రాతినిధ్యంనూ చర్చించాలా?
‘అజాద్ కశ్మీర్’అంటున్నావే- అది మాది. దానిమీద చర్చలు జరుపుదాం.. రా!’’అంటూ కేకేసి- అంతర్జాతీయంగా గోల చేసెయ్యాలి- వద్దా?
మోదీగారి వాగ్ధాటి అంతా అసలు అజాద్ కశ్మీర్‌ని ఒగ్గేయడం ఎంత అధర్మమో చెప్పగలగాలి. కానీ, అది సాధ్యమా? ప్రపంచం ఎలా వుందీవాళ? ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బాంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్- ఒకచోటేమిటి? ఎక్కడపడితే అక్కడ ఉగ్రవాద ప్రేలుళ్లు సంభవిస్తున్న దశలో- ఎవరి బాధలు వాళ్లవి. అయినా ప్రతిపక్షాలు పాలకపక్షం- కశ్మీర్‌లోని పాలక, ప్రతిపక్షాలు- అన్నీ తలలు ఏకంచేసి- రోడ్డుమ్యాప్ ఒకటి వేసుకునే దశ యిది. ప్రణాళికలు అమలు రెండూ మస్టు!
ఇండియా దటీజ్ భారత్ అల్లాటప్పా దేశమేమీకాదు యివాళ.
మోదీగారికి ఎక్కడికిపోయినా మంగళారతులు, జేజేలు, స్టాండింగ్ ఒవేషన్లూ లభిస్తున్నాయ్ కదా? ‘కశ్మీర్ మొత్తం మనది’అని ప్రపంచానికి చాటిచెప్పాలి. ఆ ప్రపంచం చేతనే పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పించాలి- అందరితోనూ గడ్డిపెట్టించాలి!
‘‘నవ్వుతున్నారా? వెర్రాడా...’’అని- అలాకాదంటే కశ్మీర్ సమస్యా పరిష్కారం కావాలీ అంటే, ‘అమీతుమీ’కి రెడీ అవ్వాలి.
ఇవాళ మన జెండా తెలియని మారుమూల ఏదీ - ఈ ప్రపంచంలో లేదు. ఐతే వాళ్లకి కశ్మీర్ కథే తెలియదు. మనం చెప్పాలి. నచ్చచెప్పాలి...
విజరుూ విశ్వతిరంగా ప్యారా- కశ్మీర్ హమారా!-
వుయ్ లైక్ యూ కశ్మీర్! వుయ్ లవ్ యూ!