తెలంగాణ

పోలీసుల తనిఖీలపై ప్రైవేటు విద్యాసంస్థల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులకు బదులు పోలీసులు తనిఖీలకు రావడం పట్ల తెలంగాణ విద్యాసంస్థల జెఎసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు సిఎం కెసిఆర్‌ను, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని తప్పుదోవ పట్టిస్తున్నారని జెఎసి నేతలు అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐబి, సిఐడి, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ పోలీసులు ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవసరమైతే విద్యాశాఖ అధికారులు మాత్రమే తనిఖీలు జరపాలని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.