జాతీయ వార్తలు

యుఎస్ విద్యా కేంద్రాలు పటిష్ఠం చేయాలి: కంభంపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రావాలనుకుంటున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఎడ్యుకేషన్ యుఎస్‌ఏ తదితర యుఎస్ ప్రభుత్వ విద్యా సలహా కేంద్రాలను పటిష్టం చేయాలని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకోరారు. కంభంపాటి గురువారం అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జోసెఫ్ పాంపర్‌ను కలిసి తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు చేసుకునే సమయంలోనే భారతీయ విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేస్తే తిరస్కరించే సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. చెల్లుబాటు వీసా ఉన్నప్పటికి అమెరికా వెళ్లిన తరువాత తిరిగి పంపివేస్తున్న తెలుగు విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారని పాంపర్‌కు వివరించారు. విద్యార్థులను తిప్పిపంపడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.